పెద్దమ్మ Part 20

మిస్సెస్ కమిషనర్ : పో చెల్లీ ……. , సెల్ఫీలు మీరు మాత్రమేనా అంటూ మాదగ్గరికి వచ్చారు . తల్లీ …… పట్టు పరికిణీ బ్యూటిఫుల్ అంటూ బుగ్గలను అందుకుని సంతోషంతో ముద్దులు కురిపించారు – లవ్ యు బామ్మా ………
చెల్లి : అక్కయ్య రెడీ చేసారు మమ్మీ …… , అన్నయ్య …… బుజ్జిదేవకన్యలా ఉన్నావు చెల్లీ అన్నారు .
లవ్ యు చెల్లీ – బుజ్జిదేవుడు అన్నాడు అంటే నువ్వు నిజంగా బుజ్జి దేవకన్యవే , అన్నయ్య …… బుజ్జిదేవుడు – అక్కయ్య …… దేవకన్య – చెల్లి ….. బుజ్జిదేవకన్య అన్నమాట ……. , ఇక అవంతిక అయితే ఇలాంటి పట్టుచీరలో ఖచ్చితంగా దేవతలా ఉండి ఉంటుంది .
అక్కయ్య – నేను అవాక్కయ్యాము .
అక్కయ్య : చూడకుండానే కరెక్ట్ గా చెప్పారు అక్కయ్యా …… , మన బుజ్జిదేవుడు …….. తన దేవతను చూడగానే దేవతగా …….
మిస్సెస్ కమిషనర్ : అది మళ్లీ చెప్పాల్సిన పనిలేదు కదా అంటూ సంతోషంతో నవ్వుకుని , అక్కయ్య బుగ్గపై – నా నుదుటిపై ముద్దులుపెట్టి , త్వరగా త్వరగా గ్రూప్ సెల్ఫీ తీస్తే కిందకువెళదాము – సర్ప్రైజ్ కు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదట ………
అక్కయ్య : Ok అంటూ గ్రూప్ సెల్ఫీలు తీసుకుని కిందకువచ్చేసరికి , దేవత – బామ్మలు వచ్చేసారు .

దేవత : సర్ ……. ముందే చెప్పి ఉంటే చక చకా టిఫిన్ రెడీ చూసేవాళ్ళము .
కమిషనర్ సర్ : ఈ ఒక్కపూట మాత్రమే …… , In టైం లో ఉండాలి అందుకే ……. , నేను బయట ఉండి ఆర్డర్ రాగానే తీసుకొస్తాను అని వెళ్లారు .
దేవత : Ok సర్ ….. , Wow హాసినీ ….. బ్యూటిఫుల్ ……
హాసిని : మా మేడం మరింత బ్యూటిఫుల్ – అన్నయ్య …… దేవతలా ఉన్నారు అన్నది నిజమేనేమో …….
అయిపోయాను అంటూ అక్కయ్య నడుమును పట్టుకుని వెనుక దాక్కుని నడుము ఒంపులో తొంగి చూస్తున్నాను .
దేవత : చిరుకోపంతో చూస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : అవంతికా …… దివినుండి దిగివచ్చిన దేవతలా ఉన్నావు అనగానే …….
దేవత పెదాలపై అందమైన నవ్వులు ……..
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదే …… బుజ్జిహీరో వర్ణించినట్లు దేవత – దేవకన్య – బుజ్జిదేవకన్య …… ఒక్కదగ్గర నిలబడితే చూడాలని ఆశగా ఉంది .
బామ్మలు : మాకుకూడా …….

హాసిని : నేను రెడీ అంటూ వెళ్లి దేవతను హత్తుకుని నిలబడింది .
మిస్సెస్ కమిషనర్ : దేవకన్యా దేవకన్యా ……..
హమ్మయ్యా …… సేఫ్ అంటూ ప్రక్కకువచ్చి నిలబడ్డాను .
అక్కయ్య పరిస్థితిని గమనించిన బామ్మ సంతోషించి , తల్లీ ……. నేను నిలబడతాను అంటూ మాదగ్గరికివచ్చి , చిట్టితల్లీ …… గిలిగింతలు పెట్టాడా నీ తమ్ముడు అంటూ చీరకొంగుతో అక్కయ్య నుదుటిపై చెమట బిందువులను తుడిచారు – బుజ్జిహీరో …… మీ అక్కయ్యకు వేడి చేసింది .
అక్కయ్యా అక్కయ్యా …… అంటూ కంగారుపడుతూ దగ్గరకు వెళ్ళాను .
చెల్లీ – అక్కయ్యా …… అంటూ దేవత – హాసిని రాబోతే ……
బామ్మ : కంగారుపడాల్సిన అవసరమే లేదు అక్కడే ఆగండి , బుజ్జిహీరో …… మీ అక్కయ్యకు కొన్ని ముద్దులుపెడితే కూల్ అయిపోతుంది .
ఏమాత్రం ఆలోచించకుండా పాదాలను పైకెత్తి , అక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించాను .
ముద్దుముద్దుకూ అక్కయ్య పెదాలపై అందమైన నవ్వులు ……. , లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అంటూ ఏకంగా నా బుగ్గపై సున్నితంగా కొరికేసి , నడుముపై గిలిగింతలుపెట్టి , మై డియర్ దేవతా – బుజ్జిదేవకన్యా …… అంటూ పరుగునవెళ్లి దేవతను మరొకవైపునుండి చుట్టేశారు .

దేవత : చెల్లీ …… ఇప్పుడెలా ఉంది అంటూ నుదుటిపై స్పృశించారు .
అక్కయ్య : మీ శిష్యుడు ముద్దులుపెట్టాడు కదా హాయిగా ఉంది – I am perfectly alright అక్కయ్యా – చెల్లీ …… అంటూ ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : అవును అవును perfectly alright , ఉమ్మా ….. దేవకన్యా ….. , Wow ….. ముగ్గురినీ చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు – బుజ్జిహీరో …… నువ్వేమీ మాట్లాడటం లేదు – చెల్లెళ్ళూ …… మిమ్మల్ని చూసి ఫ్రీజ్ అయిపోయినట్లున్నాడు అంటూ భుజం కదిల్చి , ఎంజాయ్ ఎంజాయ్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
అందరూ నవ్వుకున్నారు .
బామ్మలు : మా దిష్టినే తగిలేలా ఉంది అంటూ దిష్టి చుక్కలు ఉంచారు .
మిస్సెస్ కమిషనర్ : కాస్త ఫోజస్ ఇస్తే స్వీట్ మెమోరీస్ కోసం ఫోటోలు తీసుకుంటాము – నీతో కలిపే చెప్పాను బుజ్జిహీరో కానివ్వు అంటూ కన్నుకొట్టారు .
దేవతకు కనిపించకుండా మిస్సెస్ కమిషనర్ తోపాటు నా చిన్న మొబైల్లో ఫోటోలు తీసుకున్నాను . దేవత – దేవకన్య – బుజ్జిదేవకన్య …… రకరకాల పొజిషన్స్ – ముద్దులు పెట్టుకుంటూ చిరునవ్వులు చిందిస్తుండటం కనులవిందుగా ఉంది .

ఆర్డర్ చేసిన టిఫిన్ వచ్చేసింది అంటూ రెండుచేతుల నిండా పట్టుకుని లోపలికి తీసుకొచ్చారు కమిషనర్ సర్ ……..
వెంటనే వెళ్లి అందుకుని డైనింగ్ టేబుల్ పై ఉంచాను .
కమిషనర్ సర్ : ఇంకా బయట ఉన్నాయి బుజ్జిహీరో ……. నేను తీసుకొస్తాను .
సర్ వెనుకే వెళ్లి ఇద్దరమూ తీసుకొచ్చాము .
కమిషనర్ సర్ : థాంక్యూ బుజ్జిహీరో ……. , శ్రీమతిగారూ ……. సరిగ్గా వన్ hour లో అందరమూ బయలుదేరాలి – ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు – అందరమూ కలిసి తిందాము టైం సేవ్ అవుతుంది .
అలాగే శ్రీవారూ అంటూ మిస్సెస్ కమిషనర్ ……. దేవత – బామ్మల సహాయంతో నిమిషాల్లో రెడీ చేసి అందరినీ ఆహ్వానించారు .

అప్పటివరకూ గమనించని కమిషనర్ సర్ ……. తల్లీ హాసినీ బ్యూటిఫుల్ …….
హాసిని : పోండి డాడీ …… , అన్నయ్య ప్రేమతో తెచ్చిన డ్రెస్ వేసి అక్కయ్య ఎంతో ప్రేమతో రెడీ చేస్తే ఇప్పుడా చూసేది అంటూ బుంగమూతిపెట్టుకుంది .
కమిషనర్ సర్ : లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ప్రాణంలా బుగ్గలను అందుకుని బుజ్జి ఏంజెల్ లా ఉన్నావు అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
హాసిని – అక్కయ్య – దేవత – మిస్సెస్ కమిషనర్ తియ్యదనంతో నవ్వుకున్నారు .
సర్ ఆశ్చర్యపోవడం చూసి , మిస్సెస్ కమిషనర్ జరిగిన మధురమైన దృశ్య కావ్యాన్ని వినిపించారు .
కమిషనర్ సర్ : ముగ్గురినీ చూసి మన బుజ్జిహీరో వర్ణించినది అక్షరాలా సత్యం , దేవత – దేవకన్య – బుజ్జిదేవకన్య ……… , బుజ్జిహీరో హాట్సాఫ్ ……..

అక్కయ్య – హాసిని ……. సంతోషంతో ఉమ్మా ఉమ్మా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
బుజ్జిహీరో ……. అంటూ దేవత తియ్యనైన కోపంతో చూడటంతో …….
అక్కయ్యా ……. అంటూ మళ్లీ వెనుకచేరి భయపడుతూ దేవతవైపు తొంగితొంగిచూస్తున్నాను .
మిస్సెస్ కమిషనర్ : బామ్మా …… బుజ్జిచెల్లికి మళ్లీ తియ్యనైన వేడిచేసినట్లుంది , నుదుటిపై చెమట పట్టేసింది అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు .
చెల్లీ ……… ఏమైంది – ఇది రెండోసారి …….
మిస్సెస్ కమిషనర్ : ఏమీ కాలేదు చెల్లీ …… , చెప్పానుకదా తియ్యనైన వేడి అని – మీరు వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకునిరండి అంతలోపు చల్లారిపోతుంది . హలో ….. బుజ్జిహీరో తమరెక్కడికి మీ అక్కయ్యకు వేడిచేసినప్పుడు ఏమిచెయ్యాలో బామ్మ ఇంతకుముందే చెప్పారుకదా అంటూ కొత్త చీరకొంగుతో అక్కయ్య నుదుటిపై చెమట తుడిచారు .
ఆ ఆ అవునవును ముద్దులుపెట్టాలి .
అక్కయ్య : అక్కయ్యా …… కొత్త పట్టుచీర …….
మిస్సెస్ కమిషనర్ : నా బుజ్జిచెల్లికంటే ఏదీ ఎక్కువకాదు – చూడు నీకు ఏమైందని నీ హీరో బుజ్జిహీరో ఎలా కంగారుపడుతున్నాడు – ఇక్కడేనా ఇక్కడేనా అంటూ అక్కయ్య నడుముపై గిలిగింతలుపెట్టడంతో …….
అక్కయ్యా అంటూ మిస్సెస్ కమిషనర్ గుండెలపైకి చేరి , నా చేతిని అందుకుని ముద్దుపెట్టి గుండెలపై హత్తుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరో ……. ఇంకెందుకు ఆలస్యం – మీ అక్కయ్య వేడి చల్లారేంతవరకూ కానివ్వు మరి ……..
పెద్దమ్మా …… అని ప్రార్థించి అక్కయ్య బుగ్గలపై ముద్దులు కురిపించాను .
మిస్సెస్ కమిషనర్ : బుగ్గలపైనేనా లేక పెదాలను తడిపి చూయించి ఇంకెక్కడైనానా బుజ్జిచెల్లీ ……..
అక్కయ్య : ఇప్పుడే కాదు అక్కయ్యా అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , పరుగున దేవత దగ్గరికివెళ్లారు .
మిస్సెస్ కమిషనర్ : మా బుజ్జిహీరో బుజ్జిదేవుడు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , వెళ్లు వెళ్లు నీదేవత – దేవకన్య – బుజ్జిదేవకన్యతోపాటు హ్యాండ్ వాష్ చేసుకునిరా అంటూ పంపించారు .
నేను …… వంట గదిలోకి వెళ్లడం – అదేసమయానికి దేవత బయటకువస్తూ తియ్యనైన కోపంతో చూసారు .
Sorry మేడం ఇక్కడ ఏముందో అదే చెప్పాను అంటూ తలదించుకుని లోపలికివెళ్ళాను .
అక్కయ్య – చెల్లితోపాటు దేవతకూడా నవ్వేసి డైనింగ్ టేబుల్ పైకి చేరారు .
అన్నయ్యా ……. ఇడ్లీ వడ పూరి దోస ఉతప్పం …… అన్నిరకాల టిఫిన్స్ ఉన్నాయి తొందరగా రండి అంటూ ఏకంగా నా దగ్గరకే వచ్చి పిలుచుకునివెళ్లి ప్రక్కన కూర్చోబెట్టుకుంది .
మిస్సెస్ కమిషనర్ : అన్నయ్య అంటే అందరికంటే ప్రాణం మా హాసినికి అంటూ ముద్దుపెట్టి ఎవరికి ఇష్టమైనవి వారికి వడ్డించి , దేవత కోరిక మేరకు మిస్సెస్ కమిషనర్ కూడా కూర్చుని కలిసి చిరునవ్వులు చిందిస్తూ టిఫిన్ చేసాము .

కమిషనర్ సర్ : మొబైల్ రింగ్ అవ్వడంతో మాట్లాడారు , ” yes yes కమింగ్ అనుకున్న సమయానికి అక్కడ ఉంటాము ” – శ్రీమతిగారూ ……. 20 మినిట్స్ లో బయలుదేరాలి .
మిస్సెస్ కమిషనర్ : కొత్త బట్టలలో అందరమూ ఎప్పుడో రెడీ – మీదే ఆలస్యం శ్రీవారూ …….
కమిషనర్ సర్ : అయితే వెహికల్స్ ను రమ్మంటాను అని కాల్ చేశారు .

అక్కయ్య : బామ్మా …… డ్రెస్ చేంజ్ చేసుకోవాలి .
బామ్మ : మన బుజ్జిహీరో వల్లనే కదా …….
అక్కయ్య : అవునన్నట్లు తలఊపి సిగ్గుపడుతూనే నావైపు ప్రేమతో చూస్తున్నారు .
బామ్మ : నీ తమ్ముడిని తోడుగా పంపించనా …… ? .
అక్కయ్య : ఊహూ …… ముందు ఆ అదృష్టం తమ్ముడి ప్రాణమైన దేవతకు ఆ తరువాతనే నాకు ……..
బామ్మ : అక్కయ్య అంటే ఎంతప్రాణం నా చిట్టితల్లికి ……. అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
అక్కయ్య : బామ్మా ……. మరొక కొత్త డ్రెస్సే కావాలి – నేను పాత డ్రెస్ వేసుకుంటే తమ్ముడు బాధపడతాడు .
బామ్మ : నిజమేకదా ……. , అయితే ఒకపనిచెయ్యి మన దైవం పెద్దమ్మను – నీ బుజ్జిదేవుడు తమ్ముడిని తలుచుకుని బెడ్రూంలోకి వెళ్లు ……..
అక్కయ్య : లవ్ టు లవ్ టు బామ్మా …… , చెల్లీ …… ఒకసారి మన ఇంటికి వెళ్ళొద్దాము .
హాసిని : అన్నయ్య తోడుగా వస్తేనే ……..
దేవత : అన్నయ్యా అన్నయ్యా ……. , బుజ్జిహీరో …… హాసినిని వదిలి మాత్రం ఎక్కడికీ వెళ్లిపోకూడదు గుర్తుపెట్టుకో …….
ప్రాణం పోయినా మేడం …… , చివరి రక్తపు బొట్టువరకూ చెల్లిని ప్రాణంలా చూసుకుంటాను . చెల్లితోపాటు అక్కయ్యను మరియు మరియు ……..
హాసిని : లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ……
దేవత : అర్థమైంది అర్థమైంది ……. ఇలా సెంటిమెంటుతో హృదయాలను మాత్రం క్షణాలలో గెలిచేస్తాడు ఇడియట్ …….
ఇడియట్ ……. పిలిచి ఎన్నిరోజులైంది అంటూ మురిసిపోతున్నాను .
హాసిని : నిన్న కాలేజ్ వదిలినప్పుడు మీరు అల్లరిచేస్తే అన్నారుకదా అన్నయ్యా ……
ఏమిటో చెల్లీ …… నిమిషానికొకసారి ఇడియట్ అంటూ తిట్టించుకోవాలని – గంటకొకసారైనా కొట్టించుకోవాలని అనిపిస్తుంది .
అందరూ నవ్వుకున్నారు .
దేవత : అల్లరితో ఇలానే ఆలస్యం చేసేస్తాడు – సర్ చెప్పినట్లు సమయానికి మనం రెడీగా ఉండాలి చెల్లెళ్ళూ …… నేను తోడుగా వస్తాను పదండి .
అక్కయ్య – హాసిని : మరింత హ్యాపీ అంటూ దేవతను చెరొకవైపు చుట్టేసి వెళ్లారు .
నా ప్రాణమైన ముగ్గురికీ తోడుగా విక్రమ్ తోపాటు ఇంటివరకూ వెనుకే వెళ్లి బయట నిలబడ్డాము .

సెక్యూరిటీ అధికారి సైరెన్స్ తో సెక్యూరిటీ అధికారి వెహికల్స్ తోపాటు మధ్యలో మూడు govt వెహికల్స్ వచ్చి ఆగాయి . సెక్యూరిటీ అధికారి వెహికల్స్ నుండి సెక్యూరిటీ ఆఫీసర్లు కిందకుదిగి బయటకువచ్చిన కమిషనర్ సర్ కు సెల్యూట్ చేసి అక్కడక్కడా పొజిషన్స్ లో నిలబడ్డారు .
10 నిమిషాలకు దేవత …… పట్టుచీరలో – అక్కయ్య …… లంగావోణీలో – చెల్లి …… పరికిణీలో బయటకు రాగానే అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . అక్కయ్యా ……. మోస్ట్ బ్యూటిఫుల్ ……..
ముగ్గురూ తియ్యదనంతో నవ్వుతూనే ఉన్నారు .
చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు ఒకేసారి సెల్యూట్ చేశారు .
దేవత – అక్కయ్య : కమిషనర్ సర్ కు అయిఉంటుంది అనిచూస్తే ఎక్కడా సర్ లేరు – Ok ok మా బుజ్జిచెల్లికి సెల్యూట్ చేసారన్నమాట ……..
హాసిని …… నా వైపు చూసి సంతోషంతో నవ్వుకుంది . అక్కయ్యా – మేడం కాదు కాదు దేవత – దేవకన్య ……. ఎవరికి సెల్యూట్ చేశారో మరికొద్దిసేపట్లో మీకే తెలుస్తుందిలే ……..
అక్కయ్యకు అర్థమైనట్లు అవునవును తెలుస్తుంది తెలుస్తుంది అంటూ దేవత – చెల్లి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
హాసిని : మేడం – అక్కయ్యా …… మనకోసమే ఈ వెహికల్స్ రండి అంటూ చేతులు అందుకుని రండి అన్నయ్యా అంటూ పిలుచుకునివెళ్లింది .
దేవత : మనకోసం govt వెహికల్స్ ….. ? .

సెక్యూరిటీ అధికారి సర్ సెల్యూట్ చేసి డోర్ తెరవబోతే ……..
నో నో నో అంటూ ఇంటిలోనుండి యూనిఫార్మ్ లోకి మారిన కమిషనర్ సర్ పరుగునవచ్చి let me – honour is mine అంటూ స్వయంగా వెహికల్ డోర్ తెరిచి కూర్చోమన్నారు .
దేవత : సర్ ……. ? .
కమిషనర్ సర్ : ఈ అదృష్టం కోసం డీజీపీ సర్ క్యూ లో ఉండమన్నా ఉంటారు ఇక నేనెంత ……. , బుజ్జిదేవుడి వలన మొదటగా నాకే ఈ అదృష్టం లభించింది అంటూ వెనకున్న నావైపు చూసి కన్నుకొట్టారు .
హాసిని : లవ్ యు డాడీ ఉమ్మా …… అంటూ ముద్దుపెట్టి , మేడం – అక్కయ్యా …… రండి అంటూ ఇద్దరిమధ్యన కూర్చుంది సంతోషంతో హత్తుకుని , డాడీ …… నాదైతే డబల్ అదృష్టం – మీ బుజ్జిదేవుడికి లవ్ యు చెప్పండి – అవునూ ఇంతకూ మీ బుజ్జిదేవుడు ఎక్కడ ? అంటూ ముసిముసినవ్వులతో నావైపు చూస్తోంది .
కమిషనర్ సర్ : సర్ప్రైజ్ కోసమని ఆహ్వానించడానికి నేరుగా వెళ్ళాను . ” చాలా సంతోషం సర్ – ఈ సర్ప్రైజ్ లు బామ్మ ప్రాణమైన వాళ్లకు అంటే మీకు చెందితే మరింత సంతోషం సర్ ” అనిచెప్పి వాళ్ళ పల్లెటూరికి వెళ్ళిపోయాడు .
దేవత : సర్ ……. , ఆ బుజ్జిదేవుడు లేకుండా తప్పు కదా సర్ …….
కమిషనర్ సర్ : ” మీతోపాటు త్వరలో నేనొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ కానుకగా ఇవ్వబోతున్నాను – అప్పుడే మిమ్మల్ని కలుస్తాను అనిచెప్పాడు ” .
దేవత : అంటే అప్పటివరకూ ఆ బుజ్జి మహానుభావుడిని చూడలేమా …… ? .
హాసిని : మీరు చూడకపోయినా అన్నయ్య మనల్ని చూస్తూనే ఉంటారు మేడం ……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *