ఫ్రెండ్స్! 3 161

నేను తనకు ఇంకా గట్టి వత్తిడి ని ఇస్తూ నాతో పాటే గడ్డి వాము వైపు నడిపించుకుంటూ వెళ్ళాను.

ముందు చూడలేదు కానీ,

గడ్డివాము పక్కనే పచ్చటి బంతి తోట,ఏపుగా పెరిగింది మా వయసు లాగే,

ఇద్దరం అక్కడ కూరుతున్నాం,

ప్రవి నా వొళ్ళో తల పెట్టుకొని కింద వున్నా గడ్డిని చేతిలోకి తీసుకొని నా పాదం మీద ఎదో రాస్తూ నన్ను గిలిగింతలు పెడుతుంది,

నేను గడ్డివాముకి నా వీపుని ఆసరాగా చేసుకొని కాళ్లు చాపుకొని కూర్చున్నా.

తాను నా వైపుకి తిరిగి సూటిగా నన్ను చూస్తుంది,

శ్రీ..నాదో చిన్న అనుమానం అంది,

ఏంటి రా అని అన్నాను నేను,

నన్ను జీవితాంతం ఇలాగె చేసుకుంటావా ?

నేను సారీ ప్రవి,జీవితాంతం ఇలాగె అంటే నావల్ల కాదు అన్నాను,

తాను కోపం గా చూసింది,

నేను అవును రా,

జీవితాంతం ఇలాగె అంటే నా వెన్ను వంగిపోద్ది,

నిన్ను ఇలాగె పాడుకోబెట్టుకుంటే మనకు ఇల్లు,పిల్లలు,వుద్యోగం ఎలా చెప్పు అన్నాను,

తాను కోపం గా నా గుండె మీద తన పిడికిలితో చిన్నగా కొడుతూ నవ్వుతు నన్ను అల్లుకుపోయింది.