శృంగార మధనం – Part 80 66

telugu boothu stories – కాసేపు పుస్తకాన్ని పక్కన పెట్టి ఆ ఆనందంని,నాని గాడి సాన్నిహిత్యం ని నెమరువేసుకున్నాను..

కొద్దిసేపటికి తేరుకొని మళ్లీ పుస్తకంలో లీనమయ్యాను..ఇంతలో ఒక వన్య మృగం మా వైపు రావడం దాన్ని సూర్యకీర్తి తన విద్యలతో ఏమార్చడం జరిగాయి..

రాజసింహుడు : మిత్రమా ఆ వన్య మృగం అంత భయంకరమైనది, దానిని అంత అవలీలగా ఎలా ఏమార్చావ్?

సూర్యకీర్తి : మిత్రమా ఇది బహు సులభమైన పని,మా నాన్న గారు నేర్పించిన విద్యల తాలూకు మహిమ వల్లే ఇలా చేసాను
..
రాజసింహుడు : బహు ఆశ్చర్యం గా ఉన్నది,దానితో పోరాడటం మాత్రం మాకు తెలిసిన విద్యలు,కానీ దానితో పోరాడకుండానే నువ్వు ఏమార్చడం ఆశ్చర్యం, ఇంతకీ ఆ విద్యలు ఎవరైనా నేర్చుకోవచ్చా?మరి మా సంరక్షకుడు భేతాళుడు మాకు ఇవి నేర్పించలేదేంటి?

సూర్యకీర్తి : మిత్రమా,ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీలేదు,ఎవరైనా నేర్చుకోవచ్చు..కానీ ఇవి సంపూర్ణంగా తెలిసిన గురువు మా నాన్న ఒక్కరే,అది కూడా ఇంతవరకు ఆయన ప్రయోగించలేదు..మీ భేతాళుడు కి ఈ విద్యలు బహుశా తెలియకపోవచ్చును..

రాజసింహుడు : ఓహో అటులనా?మరి మీ పితామహులు దగ్గరకు వెళ్లి ఆ విద్యలన్నీ నేను నేర్చుకోవచ్చా?

సూర్యకీర్తి : అది సాధ్యం కాదు మిత్రమా,ఈ విద్యల తాలూకు విషయాలన్నీ మా ఆశ్రమంలోని ఒక విద్యార్థి ఔపోసన పట్టేసాడు మా నాన్నకు తెలియకుండా,అందులోనూ అతడు ఈ విద్యలని దుర్వినియోగం చేస్తూ ఉండటంతో మా నాన్న భయపడి నన్ను ఇక్కడికి పంపించాడు..

రాజసింహుడు : అయ్యో అలాగా, గురువునే ఏమార్చే విద్యలు అతడు ఎలా నేర్చుకున్నాడు??

సూర్యకీర్తి : అది వాడు సృష్టి రహస్యాలకి సంబంధించిన పుస్తకం ని మా నాన్న దగ్గర తస్కరించి అందులోని విషయాలని కంఠస్తం చేసుకున్నాడు..

రాజసింహుడు : సృష్టి రహస్యాలా?అవి వాడికి తెలిస్తే పెద్ద ప్రమాదం కదా మిత్రమా?అసలే చెడ్డవాడు అంటున్నారు..

సూర్యకీర్తి : నిజమే మిత్రమా,వాడు ఎలా ఉపద్రవాలు సృష్టిస్తాడో అని అంత విద్యలు తెలిసిన మా నాన్నే భయపడుతున్నాడు,అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది..

రాజసింహుడు : అయ్యో,అటులైన వాడిని నియంత్రించేందుకు ఏదో ఒక మార్గం ఉంటుంది కదా మిత్రమా??నీకు మీ నాన్న గారు చెప్పలేదా??

సూర్యకీర్తి : వాడిని నియంత్రించడం చాలా కష్టం అని చెప్పారు,ఇంకనూ అక్కడ ఈ రాజ్యపు యువరాజు నక్షత్రుడు, ఇంకనూ పక్క రాజ్యపు యువరాజు కర్ణుడు ఇద్దరూ వాడి విద్యలకి సంబంధించి ఏవో రహస్యాలు తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తున్నారు..ఇదిగో ఈ పుస్తకం తప్ప ఇంకేమీ నాకు ఇవ్వలేదు మా నాన్న..

రాజసింహుడు : అవునా? మిత్రమా నేను ఆ పుస్తకం ని చూడొచ్చా??

సూర్యకీర్తి : ఇదిగో మిత్రమా,నువ్వు అడగాలా మళ్లీ అంటూ పుస్తకాన్ని ఇచ్చాడు.

(ఈ జన్మలో చూపించే ప్రేమ,ఆ జన్మలోనూ చూపిస్తున్న నాని గాడి ప్రేమకి వాడి పైన ఇంకాస్తా అభిమానం పెరిగింది.. బహుశా నాని గాడికి గత జన్మ తాలూకు విషయాలు తెలిసే ఉంటాయి,అందుకే మంజులా దేవి ని రక్షించడానికి వెళ్ళాడు అని గుర్తొచ్చిన నాకు ఆశ్చర్యం వేసింది).

అంతలోపు అక్కడికి భేతాళుడు రావడం,ఆ పుస్తకాన్ని చూడటం,తెరవడం ఒక్కసారిగా ఆశ్చర్యం కి లోనై ఇద్దరినీ నివాసాల దగ్గరకు లాక్కొని వెళ్లడం జరిగాయి..

ఇక్కడ జ్యోతిరాదిత్యుడు విజయం తర్వాత కాసేపటికి సుధాముడు ఇద్దరి యువరాజులని తన రహస్య మందిరంలోకి పిలిచాడు..

కర్ణా,నువ్వేమి సంగ్రహించావ్ వాడితో యుద్ధం చేసేటప్పుడు??

గురువర్యా,నేను సంగ్రహించిన అతి ముఖ్య విషయం ఏంటంటే వాడు ఆవాహనా మంత్రం వేసేటప్పుడు వాడి కళ్ళు తీక్షణంగా అవ్వడం,ఇంకనూ మంత్రం వేసిన తర్వాత వాడు మొత్తం తన చేతి వేళ్ళతోనే నన్ను నియంత్రించడం గమనించాను..

ఖచ్చితంగా నేనూ అదే గమనించాను గురువర్యా,ఇంకనూ వాడి కాళ్ళు రూపు కొద్దిగా మార్చుకోవడం కూడా గమనించాను అన్నాడు నక్షత్రుడు..

భేషుగ్గా చెప్పారు వీరులారా,ఇప్పుడు మీకు అవగతం అయ్యుంటుంది వాడిని కొంచెం అయినా నిలువరించే ప్రయత్నం ఏంటా అన్నది..

అవును గురువర్యా,నాకొక సందేహం ఉన్నది చెప్పండి అన్నాడు కర్ణుడు..

చెప్పు కర్ణా,ఏంటా సందేహం??

గురువర్యా,మిమ్మల్ని అంతం చేస్తాడు అన్నది ఎంతవరకు నిజం?మీకు వాడి మహిమలని తట్టుకునే శక్తి ఉన్నప్పుడు ఎలా అంతం చేయగలడు వాడు?

మంచి ప్రశ్నే వేసావు కర్ణా,ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వాడికి అబ్బిన శక్తులలో ఒక్క భాగం కూడా వాడు ప్రయోగించలేదు నీ పైన,వాడికున్న శక్తికి దేవతలనే ఎదిరించి గెలవగల సత్తా ఉంది..అలాంటప్పుడు నేనెంత వాడి ముందు??

గురువర్యా ,ఏంటి మీరనేది?దేవతలనే ఎదిరించే సత్తా వాడిలో ఉందా?

అవును కర్ణా,సృష్టి రహస్యాలే వాడికి తెలిసిపోయాయి అందులో సందేహమే లేదు…పంచభూతాలు వాడు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి…వాడి శక్తి అపారం,అంతేలేనిది…కానీ ఈ శక్తులు అన్నీ వాడు ఇప్పుడే ప్రదర్శించడం అసాధ్యం.. అందుకు ఒక ముఖ్యమైన సమయం కావాలి..

అదేంటి గురువర్యా?సమయం దేనికి వాడికి?

నిజమే కర్ణా,ఇందులోని మంచి విద్యలు ఇప్పటికే వాడికి అబ్బి ఉంటాయి…దాని ఫలితమే ఈ ఆవాహన మంత్రం..ఈ మంత్రంలో దుష్టనీతి కూడా ఉంటుంది..అదేవిధంగా వాడికి దుష్ట విద్యలు అన్నీ అబ్బాలంటే కాళికా మాతని ప్రసన్నం చేసుకోవాలి,అందులకు సరైన సమయం అనేది చాలా ముఖ్యం..ఒక్కసారి వాడు ఆ శక్తుల కొలవు అయిన కాళికా మాతని సంతృప్తి పరిస్తే అప్పుడు వాడికి ఈ విద్యలన్నీ అబ్బి మహా శక్తిమంతుడు అవుతాడు..

ఇప్పుడు అర్థం అయ్యింది గురువర్యా,అయితే అందులకు అనువైన ముహూర్తం ఎప్పుడు ఉందో తెలియజేయండి..

ఆ ముహూర్తం సరిగ్గా ఒక ఏడాదికి వస్తుంది,అది అతి పవిత్రమైన పౌర్ణమి రోజు…ఆ రోజు వాడు పంచభూతాలు ని వశం చేసుకొని,కాళికా మాత అనుగ్రహం పొందితే ఎదురేలేకుండా అవుతాడు..ఆ పౌర్ణమి ప్రతి వెయ్యి సంవత్సరాల కి ఒక్కసారి వస్తుంది.. ఆ పౌర్ణమి నాడే ముక్కోటి దేవతలు వాళ్ళ అస్త్ర సన్యాసం చేసే సమయం..అది అనువుగా మలుచుకుంటే వాడికి విశ్వరాజు అయ్యే అవకాశం ఉంది.. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ దినమున ఒక తేజోవంతమైన వజ్రం ఉత్పత్తి అవుతుంది.. అలా ఉత్పత్తి అయిన ఆ వజ్రం ఒక మహా శక్తివంతమైన సృష్టి రక్షక కవచం..దాన్ని కూడా వాడు సాధించాలి.లేకుంటే వాడికి అన్ని విద్యలూ అబ్బవు..

గురువర్యా,ఇప్పుడు పూర్తిగా అర్థం అయ్యింది..ఆ పౌర్ణమి రోజు కన్నా ముందు వాడిని అంతం చేస్తే ఈ ఉపద్రవం నుండి మనకు ఉపశమనం లభిస్తుంది కదా?

అవును,కానీ ప్రస్తుతానికి వాడిని అంతం చేసే శక్తి ఎవ్వరికీ లేదు..దేవతల దృష్టిలో కూడా వాడు ఇప్పుడు ఉత్తముడు..ఎందుకంటే వాడింకా పంచభూతాలు ని వశం చేసుకోలేదు..వాడి దుష్ట బుద్ధి అనేది ఆ పౌర్ణమి నాడే తెలుస్తుంది.. అప్పటివరకూ వాడికి అంతం లేదు..ఎందుకంటే వాడు దుష్టుడే అవుతాడు అన్న ఆలోచన మనము ఖచ్చితంగా మాత్రం చెప్పలేము…ప్రస్తుత వాడి నడవడిక చూస్తుంటే దుష్టమార్గం వైపు వెళ్తున్నాడు అన్నది మాత్రం తెలుస్తోంది.. ఆ పౌర్ణమి వరకూ మనము వేచి చూడాల్సిందే..

శభాష్ గురువర్యా, భలే చెప్పారు నీ ప్రియ శిష్యులకు కర్తవ్య నిర్దేశనం హ హ్హా మీకా సందేహం అక్కర్లేదు నేను సంపూర్ణంగా ఈ విశ్వాన్ని జయించి సకల లోకాలకు అధిపతి ని అయ్యే అవకాశం కోసమే చూస్తున్నా, నువ్వన్నట్లు నేనూ ఆ పౌర్ణమి కోసమే ఎదురుస్తున్నాను..నాకు యుద్ధభూమిలోనే ఈ తుశ్చ కర్ణుడు పైన అనుమానం వచ్చింది నా ఆవాహనా మంత్రం పనిచేయలేదని,ఇప్పుడు మీ మాటలతో ఒక అవగాహన ఏర్పడింది అంటూ జ్యోతిరాదిత్యుడు గర్వంతో గురువుని దెప్పిపొడుస్తూ మాట్లాడాడు..

జ్యోతిరాదిత్యా, నువ్వు వెళ్లే మార్గం దుర్మార్గం బహు శోచనీయం..నువ్వు ఎంచుకున్న మార్గాన్ని విడనాడి ఈ విశ్వ కల్యాణం కోసం పాటుపడితే ఒక గురువుగా చాలా సంతోషిస్తాను..

హ హ్హా మీరు నాకు గురువా?ఎంతటి ఘోరమైన మాట?నా స్వశక్తితో నేను ఈ విద్యలన్నీ ఔపోసన పట్టాను..ఇందులో మీ ఘనత ఏంటి??

ఆపు రా దుర్మార్గుడా,గురువర్యుల నుండి పుస్తకం దొంగిలించి నేర్చుకున్న నీవు ఇలా గురువర్యులకి అవమానం కలిగిస్తే ఊరుకునేది లేదు అంటూ కర్ణుడు కోపోద్రిక్తుడు అయ్యాడు..

ఏమి చేయగలవు రా తుశ్చ కర్ణా?నువ్వొక అల్పుడువి నా ముందు..ముందుగా నీ అంతం అదిగో నీ బావ నక్షత్రుడు అంతం చూస్తాను మా తండ్రి కోరిక మేరకు, ఆ తర్వాత ఇదిగో మీ ప్రియ గురువు సుధాముడు వంతు..

నీ శక్తులు చూసి భయపడే పిరికి వెధవలము కాదు రా,రాజనీతి తెలిసిన ఒక వీర క్షత్రియుడను..నా కంఠం లో ప్రాణం ఉండగా నీ పని జరగదు..దమ్ముంటే నీ మాయమంత్రాలు ప్రయోగించకుండా నాతో తలపడు చూద్దాం అప్పుడు తెలుస్తుంది నీ వీరత్వం ఏంటో, ఎవరి అంతం ఏంటో అంటూ ప్రతిసవాల్ విసిరాడు కర్ణుడు..

ఆగు ఆగు కర్ణా,అక్కడికే వస్తాను…నేను నీ కన్నా ఉత్తముడిని,నీకన్నా ఎక్కువ విద్యలు తెలిసిన వాడిని..రాజనీతి ప్రకారం ఎవడు యోగ్యుడో వాడే విజేత అవుతాడు అన్నది నీకూ తెలుసు కదా?మరెందుకు నా విద్యలు ప్రదర్శించొద్దు అంటున్నావ్
?
నీతి మార్గంలో నువ్వు ఆ విద్యలు పొంది ఉంటే మాకూ సంతోషం,నువ్వొక దుర్మార్గుడివి అందుకే రా ఈ ప్రతిఘటన..

ఓహో అదా నీ సందేహం,నీతో మాటలేంటి నాకు?సిద్ధంగా ఉండు మరణించడానికి అంటూ వెళ్లిపోయాడు ఆ జ్యోతిరాదిత్యుడు..

వాడి మాటలు విన్న గురువర్యులు ఆందోళనలో మునిగిపోయాడు..

గురువర్యా,మీరేమీ చింతించొద్దు.మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ వాడిని అంతం చేయడానికే ప్రయత్నిస్తాము…నాదొక మనవి అంటూ కర్ణుడు శాంతింపజేసాడు..

కర్ణా,ఏంటి నీ మనవి చెప్పు..

గురువర్యా, ఆ కర్ణపిశాచిని విద్యలని మాకూ నేర్పించండి అదే మా యొక్క కోరిక..

అది విరుద్ధం కర్ణా,ఈ ఆశ్రమం లో ఒక్కడికి అబ్బిన తర్వాత మరెవరికీ ఆ విద్యలు అబ్బవు..

మరి మీరు ఇంతకుముందు ఎవరికీ ఈ విద్యలు నేర్పించలేదా?

ఈ విద్యలు సంపూర్ణంగా ఎవ్వరికినీ నేర్పించలేదు,ఎందుకంటే ఒక పరిమితి దాటితే వినాశనానికి దారి తీస్తుంది అన్న నెపంతో అలా చేసాను..కానీ ఈ దుష్టుడు మొత్తం ఔపోసన పట్టాడు అదే నా ఆందోళన అంతా..

అవునా,మరి మీరు ఇంతకుముందు ఎవ్వరికి నేర్పించారో వారి వివరాలు తెలపండి,మేము వాళ్ళ దగ్గర ఏవైనా తెలుసుకొని వాడిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాము..

కర్ణా,నీ ఉపాయం బాగుంది…ఇదివరకు తొమ్మిది మందికి ఈ విద్యలు నేర్పించాను.. వారి వివరాలు ఇదిగోండి…ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు వారి దగ్గర మాత్రం ఇవి నేర్చుకోవద్దు.వారిని మీకు అనుకూలంగా మాత్రం మలుచుకోండి..ఇంకనూ ఈ విద్యలు మీ ఇద్దరూ కాకుండా ఇంకొక వ్యక్తి నేర్చుకోవడం ఉత్తమం ఎందుకంటే నా ఆశ్రమం ధర్మం ప్రకారం ఇది జరగాలి…ఈ విద్యల తాలూకు కొద్ది సమాచారం మన సూర్యకీర్తి దగ్గర ఉన్న పుస్తకంలో ఉంది…

అదేంటి గురువర్యా?మేము నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకోవాలి??

అది దైవ నిర్ణయం కర్ణా,దైవత్వం ఉన్న రోజులూ ఏదో ఒకచోట ఇలాంటి దుష్టులని అంతం చేసే ఒక వీరుడు ఉదయిస్తూనే ఉంటాడు..ఆ వీరుడిని వెతికి పట్టుకోవడం మీ కర్తవ్యం..ఇక ఇందులో మినహాయింపు ఏ మాత్రం లేదు..

అలాగే గురువర్యా,మీరు చెప్పిన విధంగానే చేస్తాము…

సంతోషం యువరాజుల్లారా,కనీసం వాడిని ప్రతిఘటించి ఈ విశ్వ వినాశనాన్ని ఆపితే చాలు అదే పదివేలు..

అలాగే గురువర్యా,మేము ఈ కార్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు.

సంతోషం కర్ణా,కానీ వాడి చూపు మీ ఇద్దరి రాజ్యాల పైనే ఉంది…వాడి సంపూర్ణ శక్తులు మీ పైన పనిచేయవు..అందులోనూ వాడు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాడు.. మీరు జాగ్రత్తగా ఉండటం సమంజసం..

చిత్తం గురువర్యా,ఇక మేము మా రాజ్యాలకి బయలుదేరుతాము సెలవిప్పించండి..

విజయోస్తు,నేనూ తులసితో పాటు మా సూర్యకీర్తి దగ్గరికి వెళ్తాము..మా ఇద్దరినీ అక్కడే దింపి వెళ్ళండి యువరాజుల్లారా..

అలాగే గురువర్యా,పయనం కొనసాగిద్దాం వేగిరంగా..

సుధాముడు ఆశ్రమంలోని అందరు విద్యార్థులు కి తమ స్వస్థలాలు కి వెళ్ళమని చెప్పి బయలుదేరారు..

యోధ స్థావరంకి చేరుకున్న తర్వాత కాసేపటికి భేతాళుడు వచ్చి,రాజగురువులు సుధాముడు కి సుస్వాగతం అంటూ ఎదురొచ్చాడు..

భేతాళా,నువ్వు ఇంకనూ జీవించి ఉన్నావా?సుధాముడు కళ్ళల్లో ఒక ఆశ్చర్యం..

అవును గురువర్యా, దేవుడి దయ మెండుగా ఉండటం వల్ల బయటపడ్డాను..

నక్షత్రా,మీ రాజ్యపు సంరక్షకుడు భేతాళుడు గురించి తెలుసా నీకు??

లేదు గురువర్యా, మీరే చెప్పాలి ఆ యోధుడి కథ..

ఏమీలేదు నక్షత్రా,గుహుడు అని ఒక రాక్షసుడు గురించి చెప్పాను కదా మీకు, అతడితో తలపడటానికి వెళ్లిన భేతాళుడు ఆ రాక్షసుడి చేతిలో మరణించాడు అన్న వార్త మమ్మల్ని చేరింది,కానీ అదృష్టవశాత్తూ భేతాళుడు బ్రతికి ఉండటం చాలా సంతోషం..భేతాళా ఇంతకీ ఆ గుహుడు గురించి చెప్పవా?

గురువర్యా, ఆ గుహుడు నా చేతిలో మరణించాడు అతి భీకర యుద్ధం తర్వాత..తిరిగొచ్చిన నాకు మన మహారాజు రాజ్యవర్ధనుడు నుండి ఒక వార్త వచ్చింది కొద్ధి రోజులు అజ్ఞాతంలో ఉండమని అందుకే ఇలా ఉన్నాను అని ముగిస్తూ ఇంకొక ముఖ్య విషయం ఒకటి ఉంది గురువర్యా అని ఆపాడు..

ఏంటి భేతాళా??

మన శత్రురాజ్యం “అజీవిక” రాజు యొక్క పుత్రుడు “జ్యోతిరాదిత్యుడు” ఆ గుహుడు యొక్క శిష్యుడు అన్న విషయం నాకు ఆ యుద్ధంలో తెలిసింది..

సుధాముడు ఆశ్చర్యపోతూ,ఏంటి భేతాళా నువ్వన్నది నిజమేనా?

అక్షరాలా నిజం గురువర్యా,ఆ యువరాజు గుహుడు దగ్గర విద్యాభ్యాసం చేసినట్లు నేను నా కళ్లారా చూసాను..

నేనకున్నది నిజం అయింది భేతాళా,జ్యోతిరాదిత్యుడు కి ఇంత కపట బుద్ధి ఎలా వచ్చింది అని మదనపడ్డాను..ఇప్పుడు అవగతం అయ్యింది ఇదంతా గుహుడి మాయ అని..ఆ గుహుడు అంతం అయినా వాడి ఉద్దేశ్యంని జ్యోతిరాదిత్యుడు కి చెప్పి అంతం అయ్యాడు..

ఏంటి గురువర్యా మీరన్నది??వాడి దుష్ట ఆలోచన అయిన విశ్వ వినాశనం తాలూకు భావనలు జ్యోతిరాదిత్యుడు కి వచ్చాయా?

అవును భేతాళా,నువ్వు విన్నది సత్యం..మన ముందు ఒక మహా ఉపద్రవం పొంచి ఉన్నది ఆ జ్యోతిరాదిత్యుడు రూపంలో..ఈ విశ్వ కల్యాణం కి ఎల్లప్పుడూ సంరక్షణకర్తలు గా ఉన్న మీ వంశానికి మళ్లీ ఒక సవాల్ ముందు ఉంది..ఈ ఉపద్రవం ని ఎలా జయిస్తారో అర్థం కాకున్నది..

మీరేమీ దిగులు పడకండి గురువర్యా,మా ప్రయత్న లోపం ఎప్పుడూ ఉండదు..ఇలాంటివి ముందే ఊహించి తగిన జాగ్రత్తలు ముందుగానే చేసాను అంటూ “అహల్యా” అని పిలిచాడు…

(అహల్య మన సివంగి,ఆ సివంగి ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేము,నూనూగు ప్రాయంలో సాక్షాత్తూ దేవతలా ఉంది నయనానందం కలిగిస్తూ)..

గురువర్యులకి నమస్కారం అంటూ సుధాముడు యొక్క పాదాల పైన పడి ఆశీర్వాదాలు తీసుకుంది అహల్య..

లేవమ్మా అహల్యా,ఇంతకీ నీ విద్యలు పూర్తి అయ్యాయా?అంటూ ప్రేమగా అహల్యాని పైకి లేపాడు సుధాముడు..

గురువర్యా సకల విద్యలూ మా పిత నాకు నేర్పించారు,మీ ముందు నా విద్యలని చూపించే అవకాశం ఇవ్వండి అంటూ తల వంచి నమస్కరించింది..

వద్దమ్మా అహల్య, రాజగురువు అయిన నన్నే మించిన ప్రతిభావంతుడైన మీ పిత భేతాళుడు పైన నాకు సంపూర్ణ నమ్మకం ఉంది,విజయోస్తు అంటూ ఆశీర్వదించారు సుధాముడు..

కర్ణుడు,నక్షత్రుడు ఇద్దరూ ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ మాటలు అన్నీ విని..

భేతాళా,మా దత్త పుత్రుడు సూర్యకీర్తి ఎక్కడ??

గురువర్యా,మీ పుత్రుడు సూర్యకీర్తి ఒక కార్యాదక్షుడు..మీ విద్యల మహత్తు అతనిలో గోచరిస్తోంది..మీరు అతడికి ఇచ్చిన పుస్తకంని ఒక బహుమానంగా నేను భావించి అందులోని విద్యలను అన్నింటినీ నేర్పించే పనిలో ఉన్నాను. ఇక్కడే ఎక్కడో ఉన్నారు సూర్యకీర్తి అంటూ కేకేసాడు..

సుధాముడు కళ్లనీళ్లతో భేతాళుడు దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా అతడి చేతులు పట్టుకొని మంద్రమైన గొంతుతో, భేతాళా నీ ఉపకారం ఎలా తీర్చుకోమంటావ్ అనేసరికి అక్కడ ఉన్న కర్ణుడు,నక్షత్రుడు కి మాటలు రాలేదు ఆశ్చర్యం తో..

గురువర్యా, ఇది మా కర్తవ్యం..మాకున్న దైవ బలం కి ఉపకారం చేయడమే మా వంశస్థుల మొదటి కర్తవ్యం.. మేము మా కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నాము,ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు అంటూ వినమ్రంగా సమాధానం ఇచ్చాడు భేతాళుడు..

(రాజన్న ఇంతటి గొప్పవాడు అన్న విషయం ఇప్పుడు అర్థం అయ్యేసరికి ఆనందం వేసింది ఆశ్చర్యం తో)..

కర్ణా,నక్షత్రా ఇదిగోండి మన భేతాళుడు..మీరు మన సూర్యకీర్తి ని ఇక్కడకు తీసుకొచ్చి గొప్ప పనే చేసారు.. ఇతడు మన పక్షాన ఉంటే ఆ జ్యోతిరాదిత్యుడు ని విజయవంతం గా ప్రతిఘటించే సామర్థ్యం మనకు ఉన్నట్లే..దానికి అనుగుణంగా అహల్యాని తీర్చిదిద్దాడు.. ఇక నాకు ఏ చింతా లేదు అంటూ సుధాముడు ఆనందంగా మాట్లాడాడు..

అప్రయత్నంగా నే కర్ణుడు,నక్షత్రుడు ఇద్దరూ భేతాళుడు కి నమస్కరించారు వినమ్రంగా..

యువరాజుల్లారా, నేను మీ సేవకుడిని మీరు ఇలా నమస్కరించడం తగదు అంటూ వారిని సున్నితంగా వారించాడు..అంతలోపు సూర్యకీర్తి, రాజసింహుడు ఇద్దరూ అక్కడికి రావడంతో సుధాముడు రాజసింహుడు ని చూసి,ఇతడు ఎవరు భేతాళా అని ప్రశ్నించాడు..

గురువర్యా, ఇతడు రాజసింహుడు..మట్లి సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు ఒక అనాధగా నాకు పరిచయం అయ్యాడు..ఇతని తెగువని చూసి ముచ్చటపడి ఇక్కడికి తీసుకొచ్చాను…

అవునా భేతాళా,ఇటు రా రాజసింహా అంటూ పిలిచాడు..

రాజసింహుడు(సంజయ్) వినమ్రంగా నమస్కరించగా,నీ కుడి చేతిని ఇలా ఇవ్వు అని సుధాముడు ఆదేశించాడు..

రాజసింహుడు కుడి చేతిని చాపగా, సుధాముడు ఆ చేతిని గమనిస్తూ విపరీతంగా తన ముఖకవళికలు మారుస్తూ కాసేపటికి చూడటం పూర్తి చేసి,భేతాళా భేష్ మంచి పని చేసావ్ నువ్వు,ఇతడికి మహావీరుడి లక్షణాలు భేషుగ్గా ఉన్నాయి…నీ విద్యలు అన్నీ ఇతడికి నేర్పిస్తే విశ్వవిజేత అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది అని సంతోషంగా చెప్పాడు..

(ఇది చూసిన నాకు ఆశ్చర్యం అవధులు దాటింది నేను విశ్వవిజేత నా అన్నట్లుగా)..

గురువర్యా, మీరు చెప్పారంటే ఆ మాటకి తిరుగే ఉండదు..ఖచ్చితంగా ఇతడిని తీర్చిదిద్దుతాను ఇంకో విషయం ఏంటంటే మీ సుపుత్రుడు సూర్యకీర్తి(నాని) తనకు తెలిసిన విద్యలని ఈ రాజసింహుడు కి నేర్పిస్తుండటం ఒక సంతోషకరమైన విషయం.

భేష్ సూర్యకీర్త,మంచి అనేది ఎక్కడున్ననూ ఓకేచోటికి చేరుతుంది అని నిరూపించావ్ అంటూ సూర్యకీర్తి ని ప్రేమగా హత్తుకున్నాడు సుధాముడు సంతోషంతో..

సుధాముడు సంతోషంగా,యువరాజుల్లారా మీరు సరైన ప్రదేశంలో పడ్డారు..ఈ ప్రపంచానికి తెలిసిన ఒకేఒక గొప్ప గురువుని నేను..కానీ నన్ను మించిన గురువు ఎవరైనా ఉన్నారంటే అది మాత్రం నిస్సందేహంగా ఈ భేతాళుడు మాత్రమే.ఇక నుండి నా దగ్గర నేర్చుకోవాల్సిన విద్యలన్నీ ఈ గురువు దగ్గర నేర్చుకోండి మీరివురూ.ఇక మీరు విశ్రాంతి తీసుకోండి నాకు భేతాళుడు తో కొంచెం పని ఉంది అంటూ భేతాళుడు తో పాటూ ముందుకు సాగాడు..

అహల్య,రాజసింహుడు, సూర్యకీర్తి, కర్ణుడు,నక్షత్రుడు కాసేపటి సమయంలో మంచి మిత్రులు అయిపోయారు..నూనూగు యవ్వన ప్రాయంలో ఉన్న అందరూ కలిసిపోయి కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యం నాకు చాలా ఆనందంగా అనిపించింది…

అడవిలోకి వెళ్లిన సుధాముడు,భేతాళుడు ఒక బండరాయి పైన ఆసీనులు అయ్యారు..

భేతాళా,మీ అహల్య కి కర్ణపిశాచిని విద్యలు నేర్పావా?

లేదు గురువర్యా,దాని అవసరం ఏంటి మనకు ఇప్పుడు?

జ్యోతిరాదిత్యుడు విషయం అంతా మీకు తెలుసు గా భేతాళా,అలాంటప్పుడు మనలో ఒకరు ఆ విద్యలు నేర్చుకోవడం సమంజసం..నా ధర్మ నియమం ప్రకారం నా నుండి ఆ దుష్ట జ్యోతిరాదిత్యుడు నేర్చుకున్నాడు…ఇక నీ ధర్మం ప్రకారం ఆ దుష్టుడికి పోటీగా ఒకరికి నేర్పించక తప్పదు…

నిజమే గురువర్యా,ఆ దుష్టుడిని ఎదుర్కోవడానికి మనమూ సన్నద్ధం అవ్వాలంటే ఎవరో ఒకరికి నేర్పించక తప్పదు…

అవును,ఇంతకీ నీ దృష్టిలో అహల్య,రాజసింహుడు లలో ఎవరు ఉత్తములు అనుకుంటున్నావ్?

నేను ఇంకనూ ఆ విషయం ని గమనించలేదు గురువర్యా..

సరే,కానీ రాజసింహుడు యొక్క చేతి గీతలు అయిననూ గమనించావా?

లేదు గురువర్యా…

అతడి చేతిలో ఒక మహత్తు ఉన్నది,ఇప్పుడు నేను చూసిన వెంటనే బహు ఆశ్చర్యం వేసింది..అలాంటి రాత ఎవ్వరికీ ఉండకపోవచ్చును..

ఏముంది గురువర్యా రాజసింహుడు యొక్క చేతిలో??

అతడి చేతిలో సర్పరేఖ,గరుడరేఖ రెండూ కలిసి ఉండటం గమనించాను భేతాళా…

భేతాళుడు అతి ఆశ్చర్యం తో,నిజమా గురువర్యా మీరు అంటున్నది??అలా అయితే రాజసింహుడు ఒక అత్యద్భుతమైన వ్యక్తి అనడంలో సందేహమే లేదు.బహుశా దేవుడి వరమే నా మనకు??

అవును భేతాళా,ఇది దైవ ఆశీస్సు లా ఉంది.

అటులైన ఈ విద్యలు రాజసింహుడికే నేర్పిస్తాను గురువర్యా..

చాలా సంతోషం భేతాళా,నీవు ఇంత త్వరగా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు…

గురువర్యా మరి అలా రెండు రేఖలు ఉన్నవారికి అతి భయంకరమైన కాలదోషం ఉంటుంది కదా?

అవును భేతాళా,దానికి సంబంధించి నివారణా మార్గం మనం తెలుసుకుందాం…
(అప్పుడు అర్థం అయ్యింది మహాపతి, రుద్రపతి లు నా రేఖల గురించి శ్రీదేవి కి చెప్పిన విషయం).

కర్ణుడు, నక్షత్రుడు, సూర్యకీర్తి, రాజసింహుడు, అహల్య లు వరుస క్రమంలో కూర్చొని మాట్లాడుతూ ఉండగా ,అహల్య తన చూపుని రాజసింహుడు పైకి సారించింది అభిమానం గల కళ్ళతో..

కాసేపటికి రాజసింహుడు కూడా తన చూపుని తొలిసారి అహల్య వైపు సారించాడు..అతడి కళ్ళల్లో ఏదో ఒక ఆరాధనాభావం…

(సివంగి ఇప్పుడు ఎంత ప్రేమగా ఉందో అదే ప్రేమ అప్పుడు కూడా తన కళ్ళలో కనిపించింది)