ఇది తప్పెనా? 2 436

ఇద్దరం టిఫిన్ చేసి, జె ఎన్ టి యు కి చేరుకొన్నాం.

నాకు ఐ ఐ టి ఖరగ్ పూర్ లొ సీటొచ్చింది.నాకు అస్సలు ఇష్టం లేదు,నాన్న కి కూడ ఇస్టం లేదు.

కాని వేరె ఆప్షన్ లేదు.

అమ్మ వాళ్ళ మేన మామ రైల్వేస్ లొ రిటైర్ అయ్యి ఖరగ్ పూర్ లొ సెటిల్ అయ్యారు.అ ధైర్యంతొనె నాన్న కూడ ఒకె చెప్పాడు.

బయటకొచ్చి ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు నాన్న.అమ్మ ఎడ్చేసింది.నాతొ కూడా మాట్లాడింది.
“చిన్నా నిన్ను అంత దూరం పంపాలా ,నా వల్ల కాదు రా.”

నేను అమ్మకి ధైర్యం చెప్పా.నాక్కూడా ఏడుపొస్తోంది. కాని వొర్చుకొన్నా.

మర్నాటికల్లా మా వూరొచ్చేసాము.

ఇంట్లోకి రాగానె అమ్మ నన్ను పట్టుకొని యెడ్చేసింది.