కలిసి ఉందాము – మొదటి భాగం 301

నా తల్లి తండ్రులు నాపెళ్ళికి తొందర చెయ్యడం ఆరంబించారు, “నువ్వు పిల్లను చూసుకుంటావా? మమ్ములను చూడ మంటావా?” అని. ఆడపిల్లను పెళ్లి చేసుకుని సుఖపడేవిధం, ఎంత అద్భుతంగా కనబడుతున్నా, ఇప్పుడు నేను కల్యాణ్ పడే సుఖం వేరే రకం, అది కట్టుకున్న పెళ్ళాంతో రాదు, అలాఅని నేను, కల్యాణ్ ను పెళ్లిచేసుకోవడం కుదరదు, ఇంకా మన దేశం లో ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోడం ఇల్లీగలే. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియని సమయంలో నా జీవితం ఇంకో మలుపు తిరిగింది.
గౌతమి తో పరిచయం
ఆ రోజు మా టీం లీడర్ తన చాంబర్ కు పిలిస్తే వెళ్ళాను, అక్కడ అతను, అతని ఎదురుగా ఓ చక్కని అమ్మాయి ఉన్నారు. మా లీడ్, ఆ అమ్మాయితో దిస్ ఈస్ Mr. అశ్విన్ మా బెస్ట్ ప్రోగ్రామర్, అండ్ దిస్ ఈస్ మిస్ గౌతమి, మన నార్వే ప్రాజెక్టుకు టీం leader, అని introduce చేశాడు. పరస్పరం హలో హలో అంటూ చేతులు కలిపాము. అప్పుడు అతను ఆమెతో మీరిద్దరూ నార్వేదేశస్థులతో రోజూ డిస్కస్ చేయ్యాలిసి వుంటుంది, కాబట్టి మీ వర్కింగ్ టైమును మీరే ఫిక్స్ చేసుకోండి, మూడు నెలలోగా ఈ ప్రాజెక్టును ముగించాల్సి ఉంటుంది అన్నాడు.

సరేనంటూ ఇద్దరూ బైటకు వచ్చేశాము. వారం రోజులలోగా ఇద్దరూ ఒకరికొకరు చనువుగా ఉండడం మొదలుపెట్టాము.ఇదిచూసి కళ్యాణ్ గాడు నాతోప్రామిస్ తప్పుతున్నావు ఈవారం మన రివాజును వదిలి ఆ అమ్మాయితో holiday work చేశావు అని గొణుగుతుంటే, నేను వాడితో “ఒరేయి మనం ఇప్పుడు గడుపుతున్న అవతారాలను కంటిన్యూ చెయ్యడానికి ఓ మాంచి ప్లాను వేశాను. నువ్వు కొన్నాళ్ళు నాకు కోపరేట్ చెయ్యవలసి ఉంటుంది” అని చెప్పాను.

తరవాతి శనివారం శెలవు కాబట్టి గౌతమి నన్ను తన రూములో డిన్నరుకు ఆహ్వానించింది. నేను బాగా డ్రెస్ చేసుకుని గౌతమి రూముకు వెళ్లాను. గౌతమి ఇల్లు పెద్ద అపార్ట్ మెంట్ లో ఓ డబల్ బెడ్ రూం. బెల్ కొట్టగానే తనే తలుపు తీసి, ప్లీస్ కం, ఈ సోఫాలో కూచోండి, ఒక్క నిముషంఅంటూ లోపలి వెళ్ళింది. నేను హాలంతా పరీక్షించి చూశాను. టేబిల్ పై గౌతమి ఇంచుమించు అదేవయసులోఉన్న ఇంకో అమ్మాయి చెట్టాపట్టాలు వేసుకుని తీయించుకున్న పోటో వుంది.

ఆమె ట్రే లోరెండు కప్పుల కాఫీ తో వచ్చింది, అందులో నేనొకటి తీసుకుంటూ అడిగాను “ఆ ఫోటోలో ఉన్నది ఎవరని” గౌతమి చెప్పింది “నా ఆరోప్రాణం, ఇప్పుడు ఊరెళ్ళింది, రేపు వచ్చేస్తుంది” అని. సోఫాలో కూచుని కబుర్ల లో పడ్డాం.

అవీ ఇవీ కబుర్లతో ఆమె తన విషయాలు చెప్పుకువచ్చింది. ” నా చిన్నతనంలోనే తల్లి తండ్రులను పోగొట్టుకున్నాను, మా దూరపు బంధువులే పెంచి పెద్ద చేసి డిగ్రీ చేయించారు,. ఇప్పుడు వాళ్ళూ పోయారు. ఈ కంపనీలో పనిచేసున్నప్పుడు, కంపనీ తరపున నార్వే దేశం వెళ్లి అక్కడ రెండేళ్ళు ఉండి వచ్చాను, ఇక్కడే టీం లీడర్ గా ఉన్నప్పుడు తన జూనియర్ సుందరితో పరిచయం అయిన తరువాత, సుందరి తల్లితండ్రులు యాక్సిడెంట్లో పోయారు. ఆమెకు తన వాళ్ళెవరూ లేనందున అప్పటినుండి ఇద్దరూ కలిసే ఉంటున్నాము”.

అరె అప్పుడే ఎనిమిది గంటలయింది, రండి మనం డిన్నరు ఆరంభిద్దాము, అంటూ టేబిల్ పై అన్నీ సర్ది నాతో “అశ్విన్ నీకు మందు అలవాటుందా”అంటే నేను తలూపాను బీరువా తెరచి, నేను రెండు సంవత్సరాలు నార్వే లో ఉండి వచ్చాను అని మీకు చెప్పాను కదా, అప్పుడు అలవాటయింది వీకెండ్స్ లోతీసుకుంటాను. మీకేమీ అభ్యంతరం లేదుకదా అంటే నేనూఅంతే అనిచెప్పాను. దానికి ఆమె “ఇలా రండి, ఈ రోజు మీరు నాగెస్ట్ మీకు ఇష్టం అయిన మందే తీసుకుందాము చెప్పండి అంది, అక్కడున్న సరుకులో చివాస్ రీగల్ విస్కీ బాటిలు చూపించి ఇది అన్నాను.

ఆమె గుడ్ మంచిసెలక్షన్ అంటూ ఆ బాటిలు తీసింది రెండు చిన్న గ్లాసులు, జీడిపప్పు పాకెట్టు ఓపన్ చేసి రెండు ప్లేట్లలో వేసి అన్నీ టేబిల్ పైపెట్టి ఇక రండి అనింది. మరి సాఫ్ట్ డ్రింక్ లేదే అంటే ఆమె “I don’t use soft drinks” అంటూ ఫ్రిజ్ నుంచి ఐసుముక్కలూ సోడాబాటిలూ తీసింది. రెండు గ్లాస్లులో విస్కీ పోసి రెండు ఐసు ముక్కలు వేసి కాస్త సోడా కలిపి ఒకటి నాకు ఇచ్చి తానొకటి పట్టుకుని చీర్స్ అంది. నేనూ నా గ్లాసును ఆమె గ్లాసుకు చిన్నగా తగిలించి చీర్స్ అని సిప్ చేశాను.

1 Comment

  1. Excellent Stories. I am very interested in this group stories. Please continue

Comments are closed.