కామదేవత – Part 8 96

ఓపక్క శారదతో మాట్లాడుతున్న మాధవి కళ్ళు సుందరం మీదనే వుండడం, అలాగే మాధవి బుగ్గలు ఎరుపెక్కి తెగసిగ్గుపడిపోతూ పదే పదే పైటసవరించుకుంటూ సుందరం వైపేచూస్తూ మాట్లాడుతుండడంతో శారద చేతిలో చెయ్యవేసి మాధవి గదిలోకి అడుగుపెట్టిన శారద చూసేవా మాధవి కళ్ళలో ఆ వెలుగూ ఆ సిగ్గూ అన్నట్లుగా సుశీల చేతిని మెత్తగా నొక్కుతూ సైగచేసేప్పటికి, నేనుకూడా గమనించేను అన్నట్లుగా సుశీల కూడా శారద చేతిని మెత్తగా నొక్కింది. విషయం అర్థమైన శారదా సుశీలలు ఓ రెండు నిమిషాలపాటు మాధవితో మాట్లాడి, ఇంక మేము వెళతాం, ఇంకా ఇంట్లో అందరికీ భోజనాల సంగతి చూడాలి అంటూ లేచేప్పటికి, మణి అందుకుంటూ, అదేంటి రాక రాక మాఇంటికి వొచ్చేరు కనీసం కాఫీనో టీ నో తాగకుండానే వెళతారా? అని అంటుంటే, శారద కాఫీ టీలదేముంది అన్నయ్యగారూ, మాధవికి వొంట్లో బాగున్నప్పుడు మరోమారు వొస్తాం అని అంటూ, ఈపూటకి ఇంక మీరు వొంట ఏర్పాట్లు ఎమీ చేసుకోవొద్దు మాఇంట్లోనించీ మీ ముగ్గురికీ భోజనం పంపించేస్తాను అన్నది.

శారద మాటలకి మణి మీకెందుకండీ శ్రమ అనేప్పటికీ.. శారద నవ్వుతూ శ్రమేముంది అన్నయ్యగారూ.. మా నలుగురికీ వొండుకునేదాట్లోనే మరో గుప్పెడు బియ్యం ఎక్కువగా వేస్తె అయిపోతుంది.. ఇప్పుడు మీరేమి చేతులు కాల్చుకుంటారులెండి.. మీ ముగ్గురికీ నేను భోజనాలు పంపించేస్తాను అన్నది.

శారద మాటలకి మాధవి నీకుందుకు శ్రమ శారద నెనే లేచి ఎదోవొకటి వొండేస్తాను అని మాధవి పక్కమీదనించీ లేవబోతుంటే సుశీల మాధవి భుజాలు పట్టుకుని మాధవి లేవకుండా ఆపుతూ, ఇకమీదటనించీ మనం మనం ఒకటి, ఇంక మాఇల్లు మీఇల్లు అని ఏమీలేదు. ఇకమీదటనించీ మా రెండు కుటుంబాలలాగే మీకుటుంబం కూడా మాకుటుంబంలో భాగమే అని చెపుతూ, వెనక్కి తిరిగి మొగుడి వైపు చూస్తూ నేను చెపితే మాధవి వినేట్లు లేదు మీరన్న చెప్పండి అని సుందరం కి చెపుతూ, మీరు కొద్దిసేపు ఇక్కడె వుండి మనం ఇంట్లో అనుకున్నట్లు మాధవిని వొప్పించండి అని కళ్ళతోనే సైగచేసి మణిని గది బయటకి తీసుకుపోవడానికని మణి వైపు అడుగులు వేసింది.

1 Comment

  1. Band ceyandi be nuvvu nee erripuku stories

Comments are closed.