కానీ అప్పుడే భరత్ ఫోన్ బాగ్ లో కనిపించింది. ఇదేంటి వీడి ఫోన్ బాగ్ లో పెట్టుకుంది అని అనుకుంటూ దాన్ని తీసుకుంది. అక్కడ ప్రియ నుండి నాలుగు మిస్డ్ కాల్స్ కనిపించే సరికి ఎందుకో బిందు కు డౌటు వచ్చింది. వాడి ఫోన్ లాక్ ముందే తెలిసి ఉండడం తో ఫోన్ ఓపెన్ చేసింది. అక్కడ notification బార్ లో పొద్దున బేబీ ఇవ్వాళ కలుద్దామా అని ప్రియ పెట్టిన మెసేజ్ కనిపించింది. అంతే బిందు కు డౌటు పీక్స్ కు వెళ్ళిపోయింది. అంతలోనే ఎదో మెసేజ్ వచ్చింది మెసెంజర్ లో ప్రియ నుండి. మెసెంజర్ ఓపెన్ చేయగానే సరే వస్తున్నా అంటూ రెండు లవ్ సింబల్స్ కనిపించాయి.
అది చదివిన బిందు కు ఏమీ అర్దం కాలేదు వెంటనే దాని పై మెసేజ్ చదివింది భరత్ నుండి ఇంటికి రా అని ఉంది.
అది కూడా ఒక నిమిషం వెనుకే పెట్టిన మెసేజ్..
ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను ఉఫ్, పెద్ద గండం తప్పింది అని అనుకుంటూ వెళ్లి స్నానం చేశా. స్నానం చేస్తున్న నాకు అనిపించింది. అసలు ప్రియా ఎందుకు నా వెంట పడుతుంది, ముందు తనకు నేను ప్రేమించట్లేడు అని చెప్తే తన వైపు నుండి సమస్య రాదు కదా అని. వెంటనే ప్రియ ను కలుద్దాం అని చెప్పడానికి ఫోన్ తీసా, సారీ ఫోన్ తీయబోయా కానీ పాకెట్ లో ఫోన్ మేడం దగ్గర ఉంది అనేది గుర్తు రాగానే ఇప్పుడేం చేద్దాం అనుకుంటూ వెళ్లి డైరెక్ట్ గా కలిస్తే ఎలా ఉంటుంది అని అనిపించగానే బయటకు వెళ్ళా. అక్కడ బైక్ లో పెట్రోల్ తక్కువ ఉందని గుర్తొచ్చి మధ్యలో ఆగిపోతే కష్టం అని మళ్ళీ లోపలికి వచ్చేశా. అప్పుడే అక్కడ లాప్ టాప్ కనిపించింది. వెంటనే ఫేస్బుక్ ఓపెన్ చేసి ప్రియ కు మెసేజ్ చేశా ఇంటికి రా అని.
కాసేపటికి రిప్లై వచ్చింది సరే వస్తున్నా అంటూ..
ఆ రెండు మెసేజ్ లు చూసిన బిందు కు మేటర్ అర్దం అయిపోయింది. భరత్ గాడి ఫోన్ మేడం తీసుకున్నా కూడా ఇంకా బుద్ది రాక ఇంకెక్కడి నుండో మెసేజ్ చేస్తున్నాడు అని వెంటనే ఈ విశయం మేడం కు చెప్దామని చూసింది. కానీ ఎందుకో ఈ విశయం చెప్పడం కంటే డైరెక్ట్ గా లైవ్ చుపిస్తేనే ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది అని అనిపించి, అటు ఇటు తిరుగుతూ మేడం కోసం ఎదురుచూస్తుంది. కాసేపటికి మేడం రాగానే వెంటనే తనని ఎక్కించుకుని కార్ స్టార్ట్ చేసి స్పీడ్ గా పోనిచ్చింది. మేడం అది చూసి ఎంటి ఎందుకు అంత స్పీడ్ వెళ్తున్నావ్ అని అంది. బిందు మనసులో నవ్వుకుంటూ మేడం ను చూసి నిన్న మధ్యాహ్నం నీ ప్రియుడి గురించి ఎదో చెప్పావ్ గా వాడు ఇప్పుడు మారాడు ఇంకా వాన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అని అదెంత వరకు వచ్చిందో చూపిద్దాం అని అంది. మేడం కు ఏం అర్దం కాలేదు అప్పుడే పొద్దున ప్రియ మెసేజ్ చేసింది గుర్తు వచ్చింది వెంటనే బాగ్ లో చెక్ చేసుకుంది. ఫోన్ అక్కడే ఉండడం తో బిందు కు ఈ విశయం తెలీదు లే అని ఊరుకుంది.
కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి చూస్తే ప్రియ. తనని చూడగానే అసలు దీని కధ ఎంటో చూద్దాం అని ఎలాగో ఇంట్లో ఎవ్వరూ లేకపోయే సరికి లోపలికి రా అని తనని లోపలికి లాగా. ప్రియ లోపలికి రాగానే తలుపు వేసేసి తనని చూస్తూ అసలు ఎంటి నువ్వు అంటూ స్టార్ట్ చేశా. నేను మాట్లాడుతూ ఉంటే ప్రియ అబ్బా ముందు నేను నేను చెప్పేది విను అంటూ మాట్లాడడం మొదలు పెట్టింది.
Next episode bro
Bro super ga vundhi … Waiting for more updates as early as possible…
Bro next story apudu pedtha
Nice next part twaragaa post chy
Hii
Ippude chala interesting vundi , plz daily update ivvandi , tondaraga ivvandi update pls plz
Currect
Super bro
super story bro continue chyenadi
Bro pls konchem thondaraga upload cheyyi bro
Super story bro pls bro
Nice
Keep updating
Bro pls konchem thondaraga upload cheyyi next 15th episode pls bro I’m big fan of u bro pls
Bhayya story bagundhi next update kuda twaraga cheyandi nenu first story update chesina day nundi read chestunaa superb gaa undhi real ani pistundhi story
Very emotional very good. But pls upload next episode quickly.
nice story
మరీ అంత ట్రాజెడీ పనికిరాదు బ్రో.
Super continue story with long episode
Excellent please continue
Continue cheyyandi bro. Baagundhi story