పెద్దమ్మ Part 20

అక్కయ్య : తమ్ముడూ …… బామ్మకు కూడా పంపించావు …….
నా మొదటి ఎమోషన్ – మనందరి పెద్ద ప్రాణం బామ్మనే కదా అక్కయ్యా , బామ్మకు తెలియకుండా ఇప్పటివరకూ ఏమీ చెయ్యలేదు .
బామ్మ : మా బుజ్జిహీరో బంగారం అంటూ దిష్టి తీశారు .
అక్కయ్య : తమ్ముడూ – చెల్లెళ్ళూ …… అక్కడ దేవత సంతోషంలో ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారో చూద్దాము రండి .

దేవత : సర్ ……. అంటూ ఆనందబాస్పాలతో అడిగారు .
కమిషనర్ సర్ : అవంతిక గారూ ……. చివరగా ఒకేఒక మాట చెప్పాడు బుజ్జిదేవుడు – ” ఈ బ్లాంక్ చెక్ అమౌంట్ ను అనాథ శరణాలయాలకు చేర్చి , కనీస అవసరాలు తీర్చుకోలేని పిల్లల పెదాలపై చిరునవ్వులు పూయించిన తరువాత మేడం – అక్కయ్యలు నిజమైన దేవతలుగా కొలవబడాలి – ప్రతీ అనాధ చిరునవ్వులో దేవత అక్కయ్య కనిపించాలి ” అన్నాడు . మీరు రెడీగా ఉంటే ఇప్పుడే మన బుజ్జిదేవుడి కోరికను తీర్చేలా అడుగులువేద్దాము .
దేవత : ఉద్వేగానికి లోనౌతూ ఆనందబాస్పాలతో ప్రక్కనే ఉన్న అక్కయ్య గుండెలపైకి చేరారు . చెల్లీ …… మనమంటే ఎందుకంత ఇష్టం .
బామ్మ : ఇష్టం కాదు బుజ్జితల్లీ ప్రాణం …… ప్రాణం కంటే ఎక్కువ – మీరు అడిగితే ప్రాణాలైనా ఇవ్వడానికి క్షణం ఆలస్యం చెయ్యడు .
చెల్లెళ్లు : ఉమ్మా ఉమ్మా ….. అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
దేవత : చెల్లీ – అక్కయ్యా – బామ్మా ……. నేను చేస్తున్నది చాలా తప్పు – గిల్టీ ……
బామ్మ – మిస్సెస్ కమిషనర్ : నో నో నో ఆ మాటను నోటిలోనే ఆపేసెయ్యి – చెప్పాముకదా ఈ మాటను కనుక మన బుజ్జిదేవుడు విన్నాడంటే చాలా చాలా బాధపడతాడు అంటూ వెంటనే నోటిని మూసేసారు .
( లవ్ యు బామ్మా ……. )
కమిషనర్ సర్ : అవును అవంతిక గారూ ……. , నాకు తెలిసి తను స్వయానా ఈ గౌరవం ఆస్వాదించినదానికంటే – తన ప్రాణమైన మీరు గౌరవించబడటం తనకు మరింత సంతోషాన్ని ఇస్తున్నదేమో ……..
అవునవును ……..
అందరితోపాటు దేవత నావైపు చూసారు – అక్కయ్య అయితే లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ సంతోషంతో పెదాలను కదిలిస్తూనే ఉన్నారు .
అదే అదే కమిషనర్ సర్ చెప్పినది అక్షరాలా సత్యం – ఒక్కొక్కసారి మనల్ని పొగిడించుకోవడం అభినందించుకోవడం కంటే మన ప్రాణం కంటే ఎక్కువైన వారు ఆ అదృష్టాన్ని ఆస్వాధిస్తుంటే మరింత ఆనందం కలుగుతుంది ఇక్కడ అంటూ హృదయాన్ని చూయించాను .
మొదట చెల్లెళ్లు ఆ వంటనే మిస్సెస్ కమిషనర్ – బామ్మలు – సర్ ……. చప్పట్లు కొట్టారు – చిన్నవాడైనా కరెక్ట్ గా చెప్పాడు ఎంతైనా బుజ్జిదే …… బుజ్జిహీరో కదా ….
మిస్సెస్ కమిషనర్ : చూడు చెల్లీ …… మనసులో ఏమీ పెట్టుకోకుండా బుజ్జిదేవుడు కోరుకున్నట్లుగా మనఃస్ఫూర్తిగా ఆచరించి బుజ్జిదేవుడిని ఆనందపెట్టడం నీకు ఇష్టం లేదంటే చెప్పు – నువ్వు చెప్పినట్లుగానే తప్పుచేస్తున్నట్లుగా నువ్వే ఫీల్ అయ్యి మనందరి బుజ్జిదేవుడిని బాధపెట్టు ……..
దేవత : నో నో నో బుజ్జిదేవుడు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి – మనవలన ఏమాత్రం బాధపడకూడదు – చెల్లీ …… నీకు ok కదా ……
అక్కయ్య : మాఅక్కయ్య మాటే నా మాట అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , సంతోషంతో కౌగిలించుకున్నారు .
చెల్లెళ్లు : యాహూ ……. దేవత – అక్కయ్య ఒప్పుకున్నారు అంటూ నన్ను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : అయినా ఒప్పుకున్నవాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటే మీరు ….. మీ అన్నయ్యకు ముద్దులుపెడతారేంటి , ఏ సంతోషం కలిగినా మీ అన్నయ్యతోనే పంచుకోవడం ఏమీ బాగోలేదు అంటూ నవ్వుతూ దేవత – అక్కయ్యను హత్తుకున్నారు . శ్రీవారూ ……. బుజ్జిదేవుడి కోరికను ఈ దేవత – దేవకన్యలతో ఇప్పుడే ప్రారంభించబోతున్నాము . ఇంతకూ బ్లాంక్ చెక్ పై ఎంత అమౌంట్ రాయబోతున్నారు నాకైతే తెగ టెన్షన్ గా ఉంది .
దేవత – అక్కయ్య : అనాథ శరణాలయాలను బట్టి ……..
కమిషనర్ సర్ : ఇంతకూ మన రాష్ట్రంలో ఎన్ని అనాథ శరణాలయాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటూ గూగుల్ చేస్తున్నారు .
సర్ అనాధనైన నన్ను అడగండి చెబుతాను అంటూ స్టేట్ వైడ్ అనాథ శరణాలయాల లిస్ట్ తోపాటు ప్రతీ అనాథ శరణాలయంలో పిల్లల కష్టాలు – రిక్వైర్మెంట్స్ …… గుక్కతిప్పుకోకుండా చెప్పాను .
అక్కయ్య – చెల్లెళ్లు : తమ్ముడూ – అన్నయ్యా ……. అంటే మీరుకూడా అంటూ కళ్ళల్లో చెమ్మతో అడిగారు .
లేదు లేదు అక్కయ్యా – చెల్లెళ్ళూ …….. మా శరణాలయంలో నేను యువరాజులా పెరిగాను .
బామ్మ : చిట్టితల్లీ – బుజ్జితల్లులూ ……. మీ తమ్ముడు – అన్నయ్య అన్నీ కష్టాలనూ ………
బామ్మా బామ్మా ……. అంటూ వెళ్లి నోటిని మూసాను .
అన్నయ్యా అన్నయ్యా …… అంటూ కన్నీళ్ళతో వచ్చి హత్తుకున్నారు .
చెల్లెళ్ళూ ……. బామ్మను – దేవతను – అక్కయ్యను – మిమ్మల్ని కలిశాక నా ప్రపంచమే స్వర్గంలా మారిపోయింది బాధపడకండి అంటూ కన్నీళ్లను తుడిచి , బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి నవ్వించాను .
అప్పటివరకూ అక్కయ్య కన్నీళ్ళతో దేవతను ప్రాణంలా హత్తుకుని చివరికి నవ్వుకున్నారు .
దేవత : sorry బుజ్జిహీరో కొట్టినందు …….
నో నో నో మేడం ……. , నా దేవ …… మా మేడం ప్రతీ దెబ్బా స్వర్గమే కదా – ఇంకొకటి కొట్టినా హ్యాపీనే అంటూ దగ్గరకువెళ్లి బుగ్గను చూయించాను .
దేవత : నువ్వు – నీ అల్లరి మారదు అంటూ నవ్వుకుని అక్కయ్యను సంతోషంతో కౌగిలించుకున్నారు .

బుజ్జిదేవుడి కోరికను మన బుజ్జిహీరో ముందుకు తీసుకెళుతున్నాడు చాలాచాలా సంతోషం – బుజ్జిహీరో లెక్కల ప్రకారం అనాథ శరణాలయానికి రెండు కోట్ల చొప్పున మొత్తం అమౌంట్ బ్లాంక్ చెక్ పై రాసిస్తే డ్రా చేసుకుని వచ్చేస్తాను – వెంటనే అమలుపరచవచ్చు .
దేవత : సర్ …… మధ్యాహ్నం లంచ్ అక్కయ్యా వాళ్ళింట్లో చేస్తామని మాటిచ్చాము – బిరియానీ వండటానికి అక్కడికే వెళుతున్నాము .
వైష్ణవి మమ్మీ : చెల్లీ చెల్లీ ……. లంచ్ ను డిన్నర్ కు పోస్ట్ ఫోన్ చేద్దాము – గుమ్మం దగ్గర అన్నీ విన్నాను . మొదట బుజ్జిదేవుడి కోరికను తీరుద్దాము – ఆ కోరిక ప్రకారం మా చెల్లెలిద్దరూ దేవతలుగా …….
అక్కయ్యా అక్కయ్యా …… ప్లీజ్ ప్లీజ్ అంటూ సిగ్గుపడ్డారు దేవత – అక్కయ్య ……
ముచ్చటేసి హృదయం పై చేతినివేసుకుని ప్రాణంలా చూస్తుండిపోయాను .

అన్నయ్యా అన్నయ్యా ఎంజాయ్ ఎంజాయ్ …….. , కానీ మీరు అనాథ శరణాలయాల గురించి తడబడకుండా చెబుతుంటే అందరమూ అవాక్కైపోయాము సూపర్ కేక అంటూ హత్తుకుని ముద్దులుపెట్టారు .
హాసినీ – వర్షిణీ ……. నేనైతే షాక్ …….
దేవత : నేనుకూడా …….
చెల్లెళ్లు : మేడం – అక్కయ్యా ……. మొదట అన్నయ్య పెరిగిన అనాథ శరణాలయానికే వెళదాము ప్లీజ్ ప్లీజ్ ……..
దేవత – అక్కయ్య నవ్వుకుని , దీనికి ప్లీజ్ ఎందుకు చెల్లెళ్ళూ ……. సంతోషమైనదే చెప్పారుకదా ఆర్డర్ వెయ్యండి .
లవ్ యు లవ్ యు మేడం అంటూ హాసినితోపాటు వైష్ణవి – వర్షిణి నాకు ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : అదిగో మళ్లీ మీ అన్నయ్యకే ముద్దులు ……. , ok అన్నది మీ మేడం – అక్కయ్య కదా ……..
దేవత – అక్కయ్యతోపాటు అందరూ నవ్వేశారు .

వర్షిని – వైష్ణవి : మేడం – అక్కయ్యా …… మమ్మల్ని కూడా పిలుచుకునివెళ్లండి ప్లీజ్ ప్లీజ్ …….
దేవత – అక్కయ్య : మీరు లేకుండానా ? , మీ మమ్మీ నో అన్నదంటే గదిలోకి వదిలి తాళం వేసుకుని వెళ్లిపోదాము అంటూ ప్రాణంలా హత్తుకున్నారు . అక్కయ్యా …… అందరమూ వెళుతున్నాము మీరుకూడా వస్తే బాగుంటుంది .
వైష్ణవి మమ్మీ : బుజ్జిహీరో అదే అదే బుజ్జిదేవుడి స్వచ్ఛమైన కోరిక ప్రకారం మరికొద్దిసేపట్లో దేవతలుగా రూపాంతరం చెందే మా ప్రియమైన చెల్లెళ్లకు సెక్యూరిటీగా నేను లేకపోతే ఎలా ……. – మీరు నో అన్నా వచ్చేస్తాను అని నవ్వించారు . చెల్లెళ్ళూ …… ఇలా వెళ్లి అలా యూనిఫార్మ్ లోకి మారి వచ్చేస్తాను అని వెళ్లారు .

కమిషనర్ సర్ : అవంతిక గారు – కావ్యా ……. మన బుజ్జిహీరో లెక్కలప్రకారం బ్లాంక్ చెక్ పై ఆ మొత్తం అమౌంట్ ను మీ చేతులతో రాసిస్తే బ్యాంకుకు వెళ్లి మీ ఇద్దరి పేర్లపై అకౌంట్ ఓపెన్ చేసి , వైజాగ్ సిటీలోని చిన్న – పెద్ద అనాథ శరణాలయాలకు అందివ్వబోతున్న అమౌంట్ ను తీసుకొచ్చేస్తాను .
దేవత : అక్కయ్య చెవిలో గుసగుసలాడారు .
అక్కయ్య : మా అక్కయ్య నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు – దేవత ఏమిచేసినా లోకకల్యాణం కోసమే కదా ……..
దేవత : చెల్లీ …… అంటూ సిగ్గుపడుతూనే లవ్ యు చెప్పారు . సర్ …… మా పేర్లపై కాకుండా బుజ్జిదేవుడు మరియు చెల్లెళ్ళ పేర్లతో అకౌంట్ తెరవండి .
కమిషనర్ సర్ : అలాచేస్తే బుజ్జిదేవుడు బాధపడతాడు – అందరూ సంతోషించేలా మీ పేర్లు – బుజ్జిదేవుడు మరియు మీ బుజ్జిచెల్లెళ్ల అందరి పేర్లపై అకౌంట్ తీరుస్తాను.
దేవత : సర్ ……. పిల్లలు , వాళ్ళ అన్నయ్య పేరు లేకపోతే మనపై కోప్పడతారేమో ……..
అన్నయ్య పేరు add చేసేశారుకదా ఎప్పుడో హ్యాపీ ………
దేవత : ఆశ్చర్యంగా చూసారు .
అక్కయ్య : అదే అక్కయ్యా …… బుజ్జిదేవుడు అందరికీ బుజ్జిదేవుడే కదా , బుజ్జిదేవుడి పేరు ఉంటే బుజ్జిహీరో పేరు కూడా ఉన్నట్లే అని చెల్లెళ్ళ అభిప్రాయం …….
చెల్లెళ్లు : అవునవును అంతే అంతే ……..
దేవత : హమ్మయ్యా ……. , మీ అన్నయ్య పేరు చెప్పలేదు అని నాపై కొప్పడతారేమోనని భయపడ్డాను . (అందరూ నవ్వుకున్నారు) చెల్లెళ్ళూ …… మీ పెన్ తో బ్లాంక్ చెక్ పై అమౌంట్ రాయాలని ఆశపడుతున్నాను .
చెల్లెళ్లు : లవ్ యు మేడం అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి వర్షిని – వైష్ణవి ఇంటికి పరిగెత్తి పౌచ్ తీసుకొచ్చి అందించారు .
దేవత : ఇంత సంతోషమైన మాట చెప్పినా …… , ముద్దులు మాత్రం మీ అన్నయ్యకే అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
చెల్లెళ్లు తియ్యదనంతో నవ్వుకుని , లవ్ యు మేడం – లవ్ యు అక్కయ్యా అంటూ ముద్దులు కురిపించారు .
దేవత – అక్కయ్య : లవ్ యు soooooo మచ్ – హలో బుజ్జిహీరో గారూ …… టోటల్ అమౌంట్ ఎంతో మరొకసారి చెబితే ……
చెల్లెళ్లు : అన్నయ్యా …… అమౌంట్ మాత్రమే కాదు అనాథ శరణాలయాల నుండీ మొత్తం చెప్పండి అంటూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లు ఇలా ప్రాణమైన ముద్దులుపెట్టి అడిగితే చెప్పకుండా ఏ అన్నయ్య అయినా ఉంటాడా …… లవ్లీ కిస్సెస్ ……
” మన స్టేట్ లో ఉన్న అనాథ శరణాలయాలు – వృద్ధాశ్రమాలు : *** …… మొదలుకుని మొత్తం వివరించాను ”
లవ్ యు అన్నయ్యా లవ్ యు అన్నయ్యా …… అంటూ చెల్లెళ్లు ఆనందిస్తుండగానే ……..
ఒక్కొక్క శరణాలయానికి – వృద్ధాశ్రమానికి 5 crores చొప్పున టోటల్ అమౌంట్ *** crores చెల్లీ , నేను అమౌంట్ రాస్తాను – నువ్వు వర్డ్స్ లో రాయి …….
5 క్రోర్స్ ……. ? అంటూ సంతోషం పట్టలేక చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెట్టాను .
అక్కయ్య : దేవత రాస్తేనే బాగుంటుంది .
దేవత : దేవత ఆర్డర్ …….
అక్కయ్య : అయితే ok అంటూ నావైపు ప్రాణంలా చూస్తూనే దేవతకు ముద్దుపెట్టి వర్డ్స్ లో రాశారు .
దేవత : లవ్ యు చెల్లీ ఉమ్మా …… , పిల్లలూ …… మీ డాడీ కి ఇవ్వండి – ఊ ఊ కానివ్వండి మీ అన్నయ్యకు చూయించకుండా ఇవ్వరని తెలుసులే ……..
చెల్లెళ్లు నవ్వుకుని అన్నయ్యా అన్నయ్యా అంటూ చూయించి , డాడీ – అంకుల్ అంటూ అందించారు . డాడీ డాడీ ……..
కమిషనర్ సర్ : 5 – 5 crores ………
దేవత : సర్ ……. ఎక్కువ అవుతుందా ? , సీఎం ఆఫీస్ నుండి సమస్య ……
కమిషనర్ సర్ : నో నో నో 5 క్రోర్స్ ….. wow అంటూ సంతోషంతో చప్పట్లు కొడుతూ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు . సీఎం సర్ బ్లాంక్ చెక్ ఇచ్చారు అంటేనే మన ఇష్టం అని – అదికూడా ఇంత మంచిపనికోసం అనితెలిస్తే వెంటనే కాల్ చెయ్యడమే కాదు మళ్లీ స్వయంగా వచ్చి కలిసినా కలుస్తారు . మన బుజ్జిదేవుడు ఎంత ఆనందిస్తున్నాడో ఊహించుకుంటేనే చాలా చాలా హ్యాపీగా ఉంది .
దేవత : ఎంత ఆనందిస్తాడో కనులారా చూడాలని ఉంది కమిషనర్ సర్ …….
కమిషనర్ సర్ : కనులారా …… ? .
చెల్లెళ్లు : దానికే అంత కంగారుపడతారు ఏంటి డాడీ ……. , మేడం …… మా అన్నయ్య ఆనందాన్ని చూడండి బుజ్జిదేవుడి ఆనందాన్ని చూసినట్లే …….
అక్కయ్య : అవును అక్కయ్యా ……. , తమ్ముడు పెరిగిన శరణాలయానికి 5 క్రోర్స్ అని తెలిసేసరికి ఎంత ఆనందిస్తున్నాడో చూడండి వదిలితే డాన్స్ చేసేలా ఉన్నాడు .
మేడం …… చెప్పానుకదా మీరు నిజంగా దేవతని , ల …… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంటూ ఆనందంతో చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెడుతూనే ఉన్నాను – చెల్లెళ్లతోపాటు వెళ్లి బామ్మా ……. చాలా సంతోషంగా ఉంది అంటూ హత్తుకున్నాను .
దేవత :హ్యాపీనెస్ మేము ఇస్తే ….. , మీ చెల్లెళ్లు ఏమో నీకు – నువ్వేమో …… మీ చెల్లెళ్లకు బామ్మకు ముద్దులు ……..
మీరు కోప్పడరంటే దేవతకు ముద్దులుపెట్టడానికి నేనెప్పుడో రెడీ …….
దేవత : నో నో నో …… , సంతోషంలో ఏమి మాట్లాడాను అంటూ అక్కయ్య గుండెలపైకి చేరి సిగ్గుపడుతున్నారు .
ఆఅహ్హ్ ……..

కమిషనర్ సర్ : ఆనందించి , శ్రీమతిగారూ ……. మీరు రెడీ కిందకువచ్చేలోపు మీకోసం వెహికల్స్ రెడీ చేసి , నేను బ్యాంకుకువెళ్లి పని పూర్తిచేసుకుని అటునుండి ఆటే అమౌంట్ తో బుజ్జిహీరో అనాథ శరణాలయానికి వచ్చేస్తాను .
సర్ ……. “అవ్వ అనాథ సరణాలయం ” .
కమిషనర్ సర్ : Ok బుజ్జిహీరో ……. , తల్లీ …… బై అనిచెప్పి వెళ్లారు .

మిస్సెస్ కమిషనర్ : రెడీ అవ్వడం ఏమిటి శ్రీవారూ ……. , మేమెప్పుడో రెడీ …… , ఇదిగో వచ్చేస్తున్నాము .
అక్కయ్య : దేవత బుగ్గపై ముద్దుపెట్టి , బామ్మ గుండెలపైకి చేరారు . బామ్మా …… డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటూ అందమైన సిగ్గుతో చెప్పారు .
మళ్లీ కార్పించేశాడా ……. ? , బయటే కదా …… ? , చిలిపి బుజ్జిదేవుడు – తెలియకుండానే చెయ్యాల్సినవన్నీ చేసేస్తున్నాడు – అందుకే దేవత …… ఇడియట్ అని ప్రేమతో తిట్టేది .
అక్కయ్య : హి హి హి ……. , అవునుబామ్మా …… , లోపల మొత్తం తడిచిపోయింది .
మిస్సెస్ కమిషనర్ : మరి అప్పటి నుండీ అలానే ఉన్నావా చెల్లీ ……. ? .
అక్కయ్య : తమ్ముడు వలన కదా హాయిగా ఉంది అక్కయ్యా …… , ఈరోజంతా ఇలానే ఉండాలని ఆశ కానీ తమ్ముడు పెరిగిన అనాథ శరణాలయానికి వెళుతున్నాము కదా – తమ్ముడి పెరిగిన శరణాలయం అంటే దేవాలయంతో సమానం – దేవాలయంలోకి ఇలా ……..
మిస్సెస్ కమిషనర్ : మా బంగారం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
బామ్మ : చిట్టితల్లీ లోపలికివెళ్లి ……..
అక్కయ్య : తెలుసు బామ్మా ……. , దైవమైన పెద్దమ్మను – ప్రాణం కంటే ఎక్కువైన నా తమ్ముడిని తలుచుకోవాలి . డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటూ కాస్త దూరంగా ఉన్న నావైపు కన్నుకొట్టారు .
చెల్లెళ్లు : అక్కయ్యా …… డ్రెస్ చేంజ్ అని వినిపించింది – ప్లీజ్ ప్లీజ్ వద్దు అక్కయ్యా , ఈ లంగావోణీలో అన్నయ్య చెప్పినట్లు దేవకన్యలా ఉన్నారు – అన్నయ్యకు కూడా బాగా నచ్చింది అంటూ కదలనీకుండా హత్తుకున్నారు .
అక్కయ్య : లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ ……. , ఈ డ్రెస్ ను వదిలి మీ అన్నయ్యకు మరింత నచ్చేలా పట్టు లంగావోణీ వేసుకుందామని ……..
చెల్లెళ్లు : యాహూ ……. అయితే రండి అక్కయ్యా మేమే తీసుకెళతాము అని ఒక్కొక్క చేతిని అందుకుని , మరొక చేతులతో నా బుగ్గలపై ముద్దులుపెట్టి గదివైపుకు తీసుకెళ్లారు .
అక్కయ్య : బామ్మా ……. పట్టు లంగావోణీ కావాలి .
బామ్మ : అయితే ఏమిచెయ్యాలో నీకు చెప్పనవసరం లేదుకదా ……..
అక్కయ్య : చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ …… ఒక్క నిమిషం అంటూ ఆగి , వెనక్కు నాదగ్గరికివచ్చి కౌగిలించుకున్నారు – తమ్ముడూ …… పెద్దమ్మకు చెప్పి ఆ గదిలోని బెడ్ పై పట్టు లంగావోణీ ఉండేలా చూడు అంటూ ముద్దుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ చెల్లెళ్లతోపాటు గదిలోకివెల్లారు . గదిలోనుండి యాహూ ……. లవ్ యు లవ్ యు తమ్ముడూ – బామ్మా అంటూ సంతోషమైన కేకలు వినిపించాయి ( చెల్లెళ్ళ కేకలు కూడా ) , అక్కయ్యా …… 15 మినిట్స్ ……..
చెల్లెళ్లకు కూడా అన్నమాట , థాంక్యూ పెద్దమ్మా ……. అని తలుచుకున్నాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *