బామ్మ : నా చిట్టితల్లి బంగారం ……. ఆంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : చెల్లీ – బుజ్జిహీరో …… మనం సర్దుకోవడంలో అలసిపోయి ఉంటామని , మీ సర్ …… స్వయంగా డిన్నర్ తీసుకురావడానికి వెళ్లారు , వెజ్ & నాన్ వెజ్ …….
ఇంటిలో తొలిరోజు నాన్ వెజ్ వద్దు మేడం గారు – అక్కయ్యా …… అని అక్కయ్యతోపాటు చెప్పాను .
మిస్సెస్ కమిషనర్ : అవంతిక చెల్లి – బామ్మకూడా ఇలానే చెప్పారు కాబట్టి ఓన్లీ వెజ్ అంటూ సర్ కు కాల్ చేశారు .
అంతలో బెడ్ పైనున్న నా మొబైల్ రింగ్ అయ్యింది .
అన్నయ్యా …… నేను తెస్తాను మురళి నుండి అంటూ ఎత్తి స్పీకర్ ఆన్ చేసింది చెల్లి .
మురళి : ఇంతసేపైనా రాలేదంటే సెక్యురిటి చెప్పినది నిజమే అన్నమాట – రేయ్ మహేష్ …… మాదగ్గర ఉండకుండా కొత్తగా మన ఏరియా లో దిగిన వారికి హెల్ప్ చూస్తున్నావన్నమాట ……. , బయటకు రాకుండా పనిచేస్తున్నావన్నమాట ఉండు మమ్మీకి చెబుతాను .
నో నో నో మురళీ సర్ …… , హెల్ప్ చేస్తున్నది నిజమే కానీ మనకోసమే సంతోషంగా హెల్ప్ చేస్తున్నాను .
హాసిని : మురళీ సర్ …… ? .
దేవత : మురళీ సర్ …… ? .
మురళి : మనకోసమా ….. ? .
అవును మురళీ సర్ …… , కొత్తగా మన ఏరియా కు వచ్చినది ఎవరోకాదు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సర్ ….. , మనం హెల్ప్ చేస్తే సర్ ….. మనకు అందుబాటులో ఉంటారని ……
మురళి : కమిషనర్ సర్ నా …… ? , ok ok ok ….. స్పీకర్ ఆన్ చెయ్యలేదుకదా ? – సర్ ప్రక్కనే లేరు కదా ? .
హాసిని : భయపడుతున్నాడు అంటూ నవ్వుకుంది .
లేదు లేదు మురళీ సర్ …….
మురళి : హమ్మయ్యా ……. , ఫ్రెండ్స్ అందరమూ కబాబ్ తినడానికి కారులో వెళుతున్నాము – తొందరగా రా …….
ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను మురళీ సర్ అంటూ కట్ చేసాను .
హాసిని : మా అన్నయ్య లేకుండా బయటకు కూడా అడుగుపెట్టలేరు అన్నమాట ……..
అలాంటిదేమీ లేదు చెల్లీ …… , ఫ్రెండ్షిప్ …….
హాసిని : మాకు తెలుసులే అన్నయ్యా ……
దేవత : మురళి సర్ ఏంటి ? .
అదీ అదీ అలా పిలవమని తొలిరోజునే ఆర్డర్స్ మేడం ……
దేవత : కాలేజ్ కు రానివ్వు , వాడి సంగతి చెబుతాను .
నో నో నో మేడం ……. , మురళి ఏది చెబితే అది మేడం వింటారు – మేడం ఏది చెబితే అది ఫ్రెండ్స్ అందరి పేరెంట్స్ వింటారు – ఫ్రెండ్స్ పేరెంట్స్ ఏది చెబితే అది ఏరియా ప్రెసిడెంట్ వింటారు – కోపంతో ……..
దేవత : కోపంతో మమ్మల్ని బయటకు పంపించేస్తారని బాధపడుతున్నావు కదూ ……. , how స్వీట్ ఆఫ్ యు బుజ్జిహీరో …….
మిస్సెస్ కమిషనర్ : అది నిన్నటివరకూ బుజ్జిహీరో …… , ఇప్పుడు మీ సర్ కు నువ్వు ఎలాచెబితే అలా కదా …….
ఇలాంటి చిన్న చిన్న విషయాలలో సర్ ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదు మేడం …..- వదిలెయ్యండి .
మిస్సెస్ కమిషనర్ : how స్వీట్ ఆఫ్ యు …….
చెల్లీ …… మీరు డిన్నర్ కానివ్వండి , నేను వెళతాను .
బామ్మ : వెళ్ళొస్తాను అని చెప్పాలి ……
ఎంత సమయం అవుతుందో తెలియదు బామ్మా …… , గుడ్ నైట్ అంటూ చెల్లి – అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవతవైపు చూస్తూనే కిందకువెళ్లి , పరుగున ఫ్రెండ్స్ దగ్గరికివెళ్ళాను .
ఫ్రెండ్స్ : ఫ్రెండ్స్ – మురళీ ……. మహేష్ వచ్చేశాడు . ఏంటి మహేష్ ……. పనులన్నీ చేసి కమిషనర్ సర్ కు బాగా దగ్గరవుతున్నట్లున్నావు .
మనకోసమే ఫ్రెండ్స్ ……. , అప్పుడప్పుడూ సహాయపడవచ్చు అనే ఉద్దేశ్యంతో ఇష్టంగా చేస్తున్నాను – సర్ కు మనమంటే చాలా చాలా లైకింగ్ …….
వినయ్ – గోవర్ధన్ : కరెక్ట్ రా …… , కమిషనర్ సర్ మన వెనుక ఉన్నారంటే ఏమైనా చెయ్యొచ్చు – మురళీ ఏమంటావు …….
మురళి : కరెక్ట్ కరెక్ట్ అంటూ వచ్చి కారు ఎక్కాడు .
ఫ్రెండ్స్ : మహేష్ వెళదాము అంటూ కారులో కూర్చోమని చెప్పారు . మొత్తం మూడు కార్లలో బయలుదేరాము .
చిన్న చిన్న రోడ్డులలోనే కాదు ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే మెయిన్ రోడ్డులో కూడా అక్కడక్కడా తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు . కొద్దికొద్దిదూరాలకే సెక్యూరిటీ ఆఫీసర్ బందోబస్తు నిమిషానికోక సెక్యూరిటీ అధికారి వెహికల్ అటూ ఇటూ వెళుతూనే ఉన్నాయి .
మురళి : మనం కాబట్టి దైర్యంగా బయటకు వచ్చాము – బాంబ్ అటాక్స్ అని తెలియగానే జనాలంతా భయంతో ఇంట్లోనే దాక్కున్నారు అని నవ్వుతున్నాడు .
వినయ్ : మనం మినీ గ్రౌండ్ లో ఆడేటప్పుడు కమిషనర్ సర్ వచ్చి బాంబ్ డిటెక్టర్స్ ను పిలవగానే మహేష్ తప్ప మనమంతా భయంతో ఇళ్లకు పరుగుతీసాము – ఎవరి భయం వారిదిరా ……..
ఫ్రెండ్స్ : అవునురా మన మహేష్ కు ఏమాత్రం భయం లేదు .
మురళి : ఆపండ్రా ……. మనకు తెలియకుండా భయపడే ఉంటాడు .
అవునవును ఫ్రెండ్స్ …… ఉచ్చపడిపోయింది .
మురళి : విన్నారుకదా …… , ఇక పొగడటం ఆపండి .
చాలా భయం వేసింది ఫ్రెండ్స్ , కమిషనర్ సర్ ఉన్నారుకదా అందుకే అక్కడే ఉండిపోయాను ధైర్యం తెచ్చుకుని …
అంతలో కారు వేగం తగ్గింది . మురళీ సర్ ……. సర్కిల్ లో సెక్యూరిటీ ఆఫీసర్లు చెకింగ్ కోసం ఆపుతున్నట్లున్నారు – చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి మన వంతు వచ్చేసరికి గంట సమయమైనా పట్టేలా ఉంది అని డ్రైవర్ అన్న చెప్పి వెహికల్స్ వెనుక ఆపాడు .
వెహికల్స్ కు అటూ ఇటూ ఒక్కొక్క సెక్యూరిటీ అధికారి వెహికల్స్ ను క్యూ లో పంపిస్తున్నారు .
మురళి : గంటనా …… అనవసరంగా వచ్చాము , ఇప్పుడెలా …… వెనక్కు కూడా వెళ్లలేము వెనుక వెహికల్స్ వచ్చేసాయి , ఆ ఆ ….. కమిషనర్ సర్ కు మహేష్ అంటే చాలా చాలా లైకింగ్ అనిచెప్పాడు కదా , చూద్దాము ఎంత లైకింగో …… , నిజమో లేక మన నుండి తప్పించుకోవడానికి కమిషనర్ సర్ తెలుసని బిల్డప్ ఇచ్చాడో ఇప్పుడు తెలిసిపోతుంది .
మురళి సర్ …… ఇంకా ఫస్ట్ డే కదా నో నో నో ప్లీజ్ ప్లీజ్ ……
మురళి : నిజం ఏమిటో నిన్ను పొగిడే మన ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోతుంది , అప్పుడు మళ్లీ నేను చెప్పినట్లుగా వింటారు .
లైన్ లైన్ అంటూ లాఠీతో వెహికల్స్ ను కొడుతూ ఒక సెక్యూరిటీ అధికారి వచ్చారు .
మురళి : సర్ సర్ …… మేము అర్జెంట్ గా వెళ్ళాలి , మాకు సిటీ కొత్త సెక్యూరిటీ అధికారి కమిషనర్ గారు కూడా తెలుసు .
సెక్యూరిటీ అధికారి : కారులోని మా అందరినీ చూసి ఇంతలేరు అప్పుడే అపద్దాలు ……. , మీ వంతు వచ్చేవరకూ బుద్ధిగా కూర్చోండి అంటూ ముందుకువెళ్లారు .
మురళి : సర్ …… చెబుతుంటే వినపడటం లేదా ? , మమ్మల్ని ఆపారని తెలిస్తే మీకే డేంజర్ ……..
మురళి సర్ మురళి సర్ ……..
మురళి : చూసారా …… , ఎలా భయపడుతున్నాడు – మనదగ్గర మాత్రం తెగ బిల్డప్ ఇచ్చాడు – వీడి భండారం బయటపడాలి – మీరంతా మహేష్ గ్రేట్ మహేష్ గ్రేట్ అనడం ఆపాలి ……
సెక్యూరిటీ అధికారి : నాకు డేంజరా ……. , పిల్లలని ఊరికే ఉంటే extraa లు చేస్తున్నారు అంటూ ఆఫీసర్ ను పిలుచుకునివచ్చారు – సర్ …… విశ్వ సర్ తెలుసని నన్నే భయపెడుతున్నారు ఈ పిల్లకాయలు …….
మురళి : పిల్లకాయలు అనిమాత్రం అనకండి , అవును సర్ ….. మా మహేష్ సిటీ కొత్త సెక్యూరిటీ అధికారి కమిషనర్ బాగా తెలుసు కావాలంటే కాల్ చెయ్యండి , మహేష్ ను ఆపారని తెలిస్తే మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు జాగ్రత్త …….
మురళీ సర్ మురళీ సర్ …….
మురళి : ఇంతటితో మన మహేష్ అయిపోయాడు అంటూ నవ్వుతున్నాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : కమిషనర్ సర్ కు ఇప్పుడెకాల్ చేస్తాను , మీరు చెప్పేది అపద్దo అని తెలియాలి అప్పుడు మీసంగతి కాదు కాదు ఆ మహేష్ అనేవాడు జైల్లో ఉంటాడు .
మురళి : తిక్క కుదిరింది అంటూ నవ్వుతున్నాడు .
ఫ్రెండ్స్ : రేయ్ బిల్డప్ ఇస్తే ఇచ్చాడు – సెక్యూరిటీ ఆఫీసర్లతో ఇలా ఇరికించడం ఏమీ బాగోలేదు .
డ్రైవర్ అన్న : అవును మురళీ సర్ …….
మురళి : డ్రైవర్ …… మూసుకుని నీ పని నువ్వు చెయ్యి …….
పెద్ద సెక్యూరిటీ అధికారి వెంటనే మొబైల్ తీసి కాల్ చేసి విషయం చెప్పారు – yes సర్ ….. మహేష్ చిన్నపిల్లాడు మహేష్ ……. yes yes సర్ అంటూ కంగారుపడుతూ కట్ చేసి , బాబూ మహేష్ అంటూ సెల్యూట్ చేశారు .
పెద్ద సెక్యూరిటీ అధికారి సెల్యూట్ చెయ్యడంతో చిన్న సెక్యూరిటీ అధికారి కూడా వెంటనే సెల్యూట్ చేసాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : బాబూ మహేష్ …… sorry so sorry …… మిమ్మల్ని ఇక ఎవ్వరూ ఆపరు , ప్రక్కన మీరు వెళ్లిపోవచ్చు .
అంతలోనే చిన్న సెక్యూరిటీ అధికారి వెళ్లి బారికెడ్స్ ప్రక్కకు తొలగించి వెళ్ళమని సెల్యూట్ చేశారు .
సర్ ……. వెనుక రెండు కార్లు కూడా మావే …….
పెద్ద సెక్యూరిటీ అధికారి : Ok ok అంటూ మూడు కార్లనూ సైడ్ నుండి వదిలారు .
అంతే మురళితోపాటు ఫ్రెండ్స్ అందరూ అవాక్కై షాక్ లో ఉండిపోయారు – మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ ……..
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మురళీ సర్ …… అంటూ అందరినీ కదిల్చాను .
ఫ్రెండ్స్ : మేము చూసినది నిజమేనా అంటూ గిళ్ళుకుని స్స్స్ స్స్స్ అన్నారు . రేయ్ మహేష్ ……. ఎలా రా ? .
చెప్పానుకదా ఫ్రెండ్స్ …… , సర్ ఇంట్లో వస్తువులను సర్దడంలో చాలా సహాయం చేసాను అని – అందులోనూ సర్ పిల్లలిద్దరూ ఫుల్ క్లోజ్ అయిపోయారు – పిల్లలు ప్లీజ్ డాడీ అని చెప్పి ఉంటారు – సర్ ok అన్నారు – ఇదిగో మనం ఇలా త్వరగా బయటపడ్డాము .
ఫ్రెండ్స్ : ఏమోలే ఏదైనా జరగనీ …… , సూపర్ మైండ్ బ్లోయింగ్ అంతే – థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ సంతోషంతో అభినందించారు . చెకింగ్ వల్లనే గంటసేపు పడితే మనం కబాబ్ ఎప్పుడు తినాలి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి …… , సెక్యూరిటీ అధికారి చెప్పినట్లు ఇక మనల్ని ఎవ్వరూ ఆపరు ……. , మురళీ …… మహేష్ అంటే ఏమిటో అర్థమైందా ……. ? .
ష్ ష్ ష్ ఫ్రెండ్స్ ……..
మురళి : సైలెంట్ అయిపోయి తలదించుకుని మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు .
10 నిమిషాలలో ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడూ తినే కబాబ్ సెంటర్ కు చేరుకున్నాము.
కబాబ్ – లెగ్ పీస్ – లాలీపాప్ …… మ్మ్మ్ కుమ్మేయ్యాలి అంటూ ఫ్రెండ్స్ అందరూ కార్లు దిగి ఆర్డర్ చెయ్యడానికి వెళ్లారు – అందరూ సగం ఇక్కడ తినడానికి మిగతాసగం డిన్నర్ లో తినడానికి పార్సిల్ కూడా ఆర్డర్ చేశారు . మహేష్ …… నీకు ఏమి ఆర్డర్ చెయ్యాలి కబాబ్ or లెగ్ పీస్ …….
ఫ్రెండ్స్ …… ఈరోజు నో నాన్ వెజ్ , మీరు కానివ్వండి .
వినయ్ : నో నో నో నాన్ వెజ్ కాకపోతే వెజ్ అయినా తినాలి తప్పదు , ఇంతదూరం వచ్చినది నీవల్లనే నువ్వుతినకపోతే మేముకూడా తినము .
ఫ్రెండ్స్ : అవును తినము …….
Ok ok ఫ్రెండ్స్ అక్కడకువెళ్లి గోబీ తింటాను .
ఫ్రెండ్స్ : నీ ఇష్టం …… , బిల్ మాత్రం మాదే …….
ప్రక్కనే ఉన్న వెజ్ షాప్ లో గోబీ ఆర్డర్ చేసాను .
డ్రైవర్ అన్నయ్య వచ్చి నాతోపాటు గోబీ ఆర్డర్ చేశారు .
అన్నా …… ఈరోజు మీరుకూడా తినరా ? .
డ్రైవర్ : ఇంట్లో పూజ అందుకే …….
నాది కూడా అలాంటిదే అన్నా ……..
డ్రైవర్ : తమ్ముడూ …… నీపేరు చెప్పగానే సెక్యూరిటీ ఆఫీసర్లిద్దరూ కంగారుపడుతూ సెల్యూట్ చేసిమరీ మన వెహికల్స్ ను వదిలారు , నేను కూడా ఆశ్చర్యపోయాను .
చెప్పాను కదా అన్నా సర్ పిల్లల వలన ……..
డ్రైవర్ : గంటల్లోనే చాలా క్లోజ్ అయిపోయావన్నమాట , అయినా తమ్ముడికి నిమిషాలు చాలు మొదట నుండీ చూస్తున్నాను కదా – నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది తమ్ముడూ ……. , ఏమిటన్నా …… ఎప్పుడూ జనాలతో ఫుల్ గా ఉండేది ఇప్పుడేంటి ఎవ్వరూలేరు .
గోబీ వ్యక్తి : న్యూస్ లో అటాక్స్ గురించి చెప్పినప్పటి నుండీ జనాలు బయటకు రావడం లేదు ప్చ్ …… ఇలా అయితే మాకు కష్టమే …….
5 నిమిషాలలో మా ఆర్డర్ రావడంతో ఇద్దరమూ తిన్నాము . మ్మ్మ్ …… సూపర్ గా ఉంది ఈరోజు …….
గోబీ వ్యక్తి : ఎవ్వరూ ఆర్డర్ ఆర్డర్ అంటూ ఆత్రం పెట్టడం లేదు కదా బాబూ అందుకే సమయం తీసుకుని టేస్టీ గా చేసాను .
చెల్లీ తమ్ముడు అక్కయ్య దేవత గుర్తుకువచ్చారు , వెంటనే 250g గోబీ ఆర్డర్ చేసాను – గోబీ అన్నా …… ఇంతకంటే టేస్ట్ గా ఉండాలి కొత్త కమిషనర్ గారి పిల్లలకోసం ……..
గోబీ వ్యక్తి : మనకోసం ఆయన చేసిన ధైర్యం న్యూస్లో చూసాను – వారికోసమైతే ఇక చూసుకోండి ఎంత టేస్టీ గా చేస్తానో అని వేడివేడిగా వేసి ఫ్రెష్ గా రెడీ చేసి పర్ఫెక్ట్ గా పార్సిల్ చేసి ఇచ్చారు .
పెదాలపై చిరునవ్వుతో ఇద్దరమూ డబ్బు ఇచ్చాము .
గోబీ వ్యక్తి : సర్ కు అన్నారుకదా బాబూ వద్దులే …….
తీసుకో అన్నా …… జనాలు కూడా కొద్దిగానే వస్తున్నారు అంటూ అందించి కారు దగ్గరికి చేరాము .
వినయ్ : మహేష్ …… ఎంత పే చేసి వస్తాను .
పే చేసేసాను మై ఫ్రెండ్ ……..
ఫ్రెండ్స్ : నో నో నో మా ట్రీట్ అంటూ నా జేబులో డబ్బు ఉంచారు . అందరూ పార్సిల్స్ తీసుకున్నట్లు చేతులలో పార్సిల్ కవర్స్ తో కారులో కూర్చున్నారు – డ్రైవర్ ……. వేడి చల్లారేలోపు ఇంటికి తీసుకెళ్లండి .
( అవునవును వేడిగానే బాగుంటుంది థాంక్స్ ఫ్రెండ్స్ ……. )
వెళ్లిన మార్గంలోనే బయలుదేరాము – చెకింగ్ దగ్గరికి వెహికల్స్ రాగానే గుర్తుపట్టినట్లు దూరం నుండే సెల్యూట్ చేసిమరీ వెళ్ళమని సిగ్నల్ ఇవ్వడం చూసి , ఫ్రెండ్స్ అందరూ సూపర్ మహేష్ సూపర్ మహేష్ అంటూ కేకలువేస్తూనే ఇంటికి చేరుకున్నాము . వేడివేడిగా డిన్నర్ లోకి తినాలని కారు ఆగడం ఆలస్యం గుడ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అంటూ వారి వారి ఇళ్లకు పరుగులుపెట్టారు – మురళి కూడా అంతే వేగంతో లోపలికివెళ్లిపోయాడు .
నాకు కావాల్సినది కూడా అదే అని గోబీ పార్సిల్ తోపాటు కమిషనర్ సర్ ఇంటికి పరుగుతీసాను .
నా కోసమే ఎదురుచూస్తున్నట్లు మెయిన్ గేట్ దగ్గర చెల్లి – తమ్ముడు – అక్కయ్య ……. చలిలోనే కూర్చుని ఎదురుచూస్తున్నట్లు , అక్కయ్యా అక్కయ్యా …… అన్నయ్య వచ్చేసారు అంటూ సంతోషంతో కేకలువేశారు .
తమ్ముడూ …… అంటూ అక్కయ్య కౌగిలించుకుని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు – పదా లోపలికి వెళదాము నీకోసమని సర్ తోపాటు అందరూ డిన్నర్ చెయ్యకుండా వేచిచూస్తున్నారు .
నాకోసమా ……. ? .
