హాసిని : అవును అన్నయ్యా ……. , డాడీ తోపాటు అందరమూ ఒక్కమాటగా ఇష్టంతో wait చేస్తున్నాము .
Sorry చెల్లీ – అక్కయ్యా …… , సర్ కు వెంటనే sorry చెప్పాలి .
హాసిని : నో నో నో అన్నయ్యా …… , బుజ్జిదేవుడు లేకుండా నేను తినను మీరు కావాలంటే తినండి అని డాడీ నే మొదట అన్నది , ఇక అందరికీ అదేఇష్టం కాబట్టి ఇలా బయట మా అన్నయ్యకోసం వేచిచూస్తూ ఉన్నాము .
9 గంటలు అవుతోంది , ప్చ్ …… నావల్లనే ఆలస్యం , ఇక ఏమాత్రం ఆలస్యం కాకూడదు ……..
ఆ కేకలకు నా దేవత – బామ్మ – మిస్సెస్ కమిషనర్ మేడం బయటకువచ్చారు . దేవత కరెక్షన్ చేస్తున్నట్లు రెడ్ పెన్ చేతిలో ఉంది .
హలో బుజ్జిహీరో …… స్టాప్ అంటూ దేవత ఆర్డర్ వెయ్యడంతో మెయిన్ గేట్ దగ్గరే ఆగిపోయాను – పెద్దహీరోలా …… కొత్తగా అడుగుపెట్టిన ఇంటిలో పాలు పొంగించాలి కానీ నాన్ వెజ్ వద్దని వంత పాడావు , ఇప్పుడేమో బయటకువెళ్లి కబాబ్ తినివచ్చి అదే ఇంటిలోకి అడుగుపెట్టబోతున్నావు .
లేదులేదు మేడం ……. మన ప్రియమైన చెల్లి తమ్ముడు కొత్తగా అడుగుపెట్టిన ఇంట్లోకి నాన్ వెజ్ తిని ఎలా వస్తాను చెప్పండి , ఫ్రెండ్స్ అందరూ తిన్నారు కానీ నేను మాత్రం కేవలం గోబీ మాత్రమే తిన్నాను ప్రామిస్ ప్రామిస్ అంటూ తలపై ఒట్టు వేసుకున్నాను .
దేవత : అయ్యో బుజ్జిహీరో …… ఒట్టు వేసి చెప్పమని చెప్పానా ? అంటూ దగ్గరికివచ్చి చేతిని తీశారు .
అక్కయ్య : తమ్ముడూ …… ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు అంటూ ప్రాణంలా హత్తుకుని కురులపై ముద్దులుపెట్టారు .
అక్కయ్యా ……. మీకోసం – మేడం కోసం – చెల్లి కోసం గోబీ కూడా తీసుకొచ్చాను అని అక్కయ్యకు అందించాను , భలే టేస్టీ గా ఉంది .
హాసిని : Wow గోబీ ……. , లవ్ యు అన్నయ్యా …….
దేవత : స్టూడెంట్స్ – చెల్లీ …… మనమే గెలిచాము యాహూ ……. అంటూ నలుగురూ సంతోషంతో కేకలువేస్తూ కౌగిలించుకున్నారు .
బామ్మ – మిస్సెస్ కమిషనర్ : కబాబ్ అంటే పిల్లలు ఎంత ఇష్టపడతారు ప్చ్ ….. పో బుజ్జిహీరో మమ్మల్ని ఓడించావు – మాకోసం ……. లవ్ యు బుజ్జిహీరో అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి లోపలికి వెళ్లారు మిస్సెస్ కమిషనర్ మేడం – శ్రీవారూ …… మన బుజ్జిహీరో మిమ్మల్నే గెలిపించాడు .
చెల్లీ ……. సర్ కూడా …….
హాసిని : అవును అన్నయ్యా ……. , అన్నయ్య – అక్కయ్య – మేడం – నేను – డాడీ ……. అందరమూ నాన్ వెజ్ తినరని , బామ్మ – మమ్మీ తింటారని …… బెట్ వేశారు.
Sorry లవ్ యు బామ్మా ………
బామ్మ : మా బుజ్జిహీరో బంగారం అంటూ కురులను ప్రాణంలా నిమిరారు .
చెల్లీ …… సర్ ఎక్కడ ఉన్నారు ? .
హాసిని : లోపల హాల్లో న్యూస్ చూస్తూ సిటీ మొత్తం అలర్ట్ చేస్తున్నారు అన్నయ్యా – రండి పిలుచుకుని వెళతాను అని చేతినిపట్టుకుని లాక్కునివెళ్లింది .
సర్ ముందువెళ్లి తప్పుచేసినవాడిలా చేతులుకట్టుకుని తలదించుకుని sorry చెప్పాను . సర్ ……. నేను కాదు ఫ్రెండ్స్ …….
కమిషనర్ సర్ : ప్చ్ …… నువ్వు కాదా ……. , నువ్వని ఎంత ఆనందపడ్డానో తెలుసా ? …… , నెక్స్ట్ టైం మాత్రం నువ్వే చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ……
దేవత : అలా బయటకు వెళ్ళావో లేదో అంతలోనే ప్రాబ్లమ్ క్రియేట్ చేసేసావన్నమాట …… , అయినా మీరు ప్లీజ్ అనడం ఏమిటి సర్ కాస్త భయపెట్టొచ్చుకదా …….
హాసిని : డాడీ డాడీ ……. అన్నయ్య ఏమిచేశారు ? .
కమిషనర్ సర్ : ఏమీలేదు తల్లీ …… , అదీ చెకింగ్ లో …….
సర్ సర్ ……. దేవత …….
కమిషనర్ సర్ : ఏమీలేదు ఏమీలేదు ఆకలి ఆకలి , శ్రీమతిగారూ …… మీ బుజ్జిహీరో వచ్చేశాడు కదా ఇకనైనా వడ్డిస్తారా లేదా …….
దేవత : చివరికి కమిషనర్ సర్ దగ్గర కూడా అల్లరి అంటూ నా బుగ్గను గిల్లేసారు నా దేవత . వెళ్లి డైనింగ్ టేబుల్ పై పార్సిల్స్ అన్నింటినీ వేడివేడిగా రెడీ చేశారు .
హాసిని : అన్నయ్యా – అక్కయ్యా ……. రండి అంటూ మా ఇద్దరి చేతులను అందుకుని డైనింగ్ టేబుల్ పై చెరొకవైపున కూర్చోబెట్టుకుంది .
కమిషనర్ సర్ : నిన్నటివరకూ …… అలా నన్ను పిలుచుకునివెళ్లి కూర్చోబెట్టేది నా తల్లి ప్చ్ …….
Sorry sorry సర్ అంటూ లేచి నిలబడ్డాను .
కమిషనర్ సర్ : బుజ్జిహీరో ……. , నా మనసులో ఉన్నదే నా తల్లి చేస్తోంది లవ్ యు తల్లీ అంటూ మా ఎదురుగా కూర్చున్నారు – ప్రక్కనే విక్రమ్ కూర్చున్నాడు .
బామ్మలూ – మేడం గారూ – శ్రీమతిగారూ ……. మీరూ కూర్చోండి .
మిస్సెస్ కమిషనర్ మేడం : మేమంతా కలిసి తరువాత తింటాము – మా ముచ్చట్లు మీరు వినలేరు లేండి అంటూ ముసిముసినవ్వులతో వడ్డించారు .
అక్కయ్య : అయితేనేనుకూడా వడ్డిస్తాను .
దేవత : చెల్లీ …… డాక్టర్ గారు వచ్చి పర్ఫెక్ట్ అనేంతవరకూ నువ్వు …… మా అందరి బుజ్జాయివే ……. అంటూ నుదుటిపై ముద్దుపెట్టి కూర్చోబెట్టారు .
హాసిని – విక్రమ్ : మమ్మీ మమ్మీ …… మొదట అన్నయ్య తెచ్చిన గోబీ వడ్డించు ……
మిస్సెస్ కమిషనర్ మేడం : అన్నయ్య అన్నయ్య అన్నయ్య ……. మీకు మీ అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదు – మిమ్మల్ని మీ అన్నయ్య వశం చేసేసుకున్నాడు ……
Sorry sorry మేడం అంటూ లేచి నిలబడ్డాను .
మిస్సెస్ కమిషనర్ మేడం : మరీ ఇంత మంచివాడివి అయితే కష్టం , మాకంటే …… నువ్వంటేనే వారికి ఇష్టం – అదే నాకు , మీ సర్ కు కూడా ఇష్టం – ముందు నువ్వు కూర్చుని కడుపునిండా తిను ……. , నువ్వు తినకపోతే వీరిద్దరూ కాదు కాదు కావ్య తోపాటు ముగ్గురు తినరు …….
కమిషనర్ సర్ : నన్ను కలపడం మరిచిపోయారు శ్రీమతీ …….
మిస్సెస్ కమిషనర్ : విన్నావా బుజ్జిహీరో …… , మీ సర్ కూడా తినరట …… , దీనికి కూడా sorry చెబుతావేమో ………
Sorry …… థాంక్యూ మేడం అంటూ కళ్ళల్లో చెమ్మతో సంతోషంగా నవ్వాను .
అక్కయ్య : నా తమ్ముడికి ఇంత మంది ప్రేమ లభించింది – sooooo హ్యాపీ తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
దేవత : వడ్డిస్తూనే ……. , బుజ్జిహీరో …… ఒక్కరోజులో సర్ ను కూడా బుట్టలో వేసుకున్నావన్నమాట , నువ్వు మామూలోడివి కాదు …… , సెంటిమెంట్ తో పడేస్తావు …….
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
మేడం ……. మీకు రెండు థాంక్స్ లు…….. .
దేవత : రెండు దేనికి బుజ్జిహీరో ……..
ఒకటి ఇప్పుడు పొగిడినందుకు మరొకటి వచ్చేసి నేను నాన్ వెజ్ తినను అని నమ్మినందుకు ……..
దేవత : మా బుజ్జిహీరో అల్లరి చేసి కోపం తెప్పిస్తాడు కానీ ఇలాంటి విషయాలలో బాధపెట్టేలా ప్రవర్తించడు ………
యాహూ ……. అంటూ లేచి అక్కడికక్కడే డాన్స్ చేసాను .
దేవత : మొదలెట్టేసాడు అల్లరి , అనవసరంగా పొగిడాను – హలో బుజ్జిహీరో గారూ ……. ముందు భోజనం చేయండి .
అందరూ నవ్వుతున్నారు .
హాసిని – విక్రమ్ : మమ్మీ మమ్మీ …… గోబీ .
మిస్సెస్ కమిషనర్ : మీ నలుగురే మొత్తం తినేస్తారా …… ? , మీ అన్నయ్య …… మీకోసం మాత్రమే కాదు అందరికోసం తీసుకొచ్చాడు – మీ డాడీ కూడా గులుక్కుమంటూ తినేసారు ………
లేదు మేడం …… , చెల్లీ – తమ్ముడు – అక్కయ్య మరియు మరియు …….
మిస్సెస్ కమిషనర్ : అర్థమైంది అర్థమైంది , వీళ్ళకేమో …….. అన్నయ్య అంటే ఇష్టం ఇక అన్నయ్యకేమో వీళ్ళంటే ప్రాణం …….. , మీరే మొత్తం తినెయ్యండి అంటూ గోబీ పార్సిల్ మొత్తం డైనింగ్ టేబుల్ మధ్యలో ఉంచేశారు .
హాసిని – విక్రమ్ : లవ్ యు మమ్మీ ……. , లవ్ యు అన్నయ్యా …… మొత్తం మేమే తినేస్తాము .
మిస్సెస్ కమిషనర్ : ఏదో మోహమాటానికి అంటే మొత్తం తినేసేలా ఉన్నారు అంటూ మళ్లీ తీసేసుకున్నారు .
హాసిని : మమ్మీ ప్లీజ్ ప్లీజ్ మరొక్కటి మరొక్కటి …….
మిస్సెస్ కమిషనర్ : మరీ అడగకూడదు , మీ అన్నయ్య ప్రేమతో తీసుకొచ్చిన గోబీలో ఒక్కొక్కటైనా తింటాము .
హాసిని : ఎనఫ్ ఎనఫ్ మమ్మీ లవ్ యు లవ్ యు ……..
అక్కయ్య : అక్కయ్యా …… నాకు ? .
మిస్సెస్ కమిషనర్ : ఉమ్మా …… అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి , చెల్లీ …. ఒక్కటే అంటూ వడ్డించారు .
కమిషనర్ సర్ : శ్రీమతి గారూ …….. ? .
మిస్సెస్ కమిషనర్ : తమరికి కూడానా ……. ఇక కరెక్ట్ గా మా నలుగురికి ఒక్కొక్కటి మాత్రమే మిగిల్చారు – బుజ్జిహీరో …… తెలుసుకదా ఇంతమంది అభిమానులం అని కాస్త ఎక్కువ తీసుకురావాల్సింది .
Sorry మేడం ……. డబ్బు అంతే ఉంది అని బాధపడుతూ చెప్పాను .
మిస్సెస్ కమిషనర్ : అయ్యో ఏమైనా తప్పుగా మాట్లాడానా …… ? .
నో నో నో మేడం ……. నేనే ……..
మిస్సెస్ కమిషనర్ : sorry చెప్పాల్సింది నేను బుజ్జిహీరో ……. , ఈ ఆనందంలో ఏమి మాట్లాడుతున్నానో నాకే తెలియదు . Sorry బుజ్జిహీరో …..
నో నో నో మేడం …… , మీరు , నాకు sorry చెప్పడం ఏమిటి ? ఇంతకుముందే చెప్పాను మీరు – సర్ …… ఎప్పుడూ అంత ఎత్తులో ఉండాలి అంటూ లేచిమరీ మేడం పాదాలను స్పృశించాను .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరో ……. అంటూ లేపి ఆప్యాయంగా హత్తుకుని భోజనం మధ్యలో లేవకూడదు అంటూ కూర్చోబెట్టి ఆనందబాస్పాలతో వడ్డించారు , శ్రీవారూ ……. ? .
కమిషనర్ సర్ : అర్థమైంది అర్థమైంది శ్రీమతిగారూ ఈ ఒక్క రాత్రి సమయం ఇవ్వండి – ఇంకా గోబీ పీస్ వడ్డించలేదు .
మాకు కూడా వడ్డించలేదు మమ్మీ ……. అంటూ హాసిని ప్లేట్ చూయించింది .
మిస్సెస్ కమిషనర్ : దెబ్బలు పడతాయి , ఓన్లీ మీ డాడీ కి మాత్రమే అంటూ ఒకే ఒక చిన్న పీస్ వడ్డించారు .
అక్కయ్య – దేవతతోపాటు నవ్వుకున్నాను .
మిస్సెస్ కమిషనర్ : హమ్మయ్యా ….. బుజ్జిహీరో నవ్వేశాడు – ఏంటి శ్రీవారూ ప్లేట్ వైపు అలా చూస్తున్నారు .
కమిషనర్ : మై డియర్ శ్రీమతీ ……. , ప్రపంచంలో ఎవ్వరైనా దీనిని గోబీ పీస్ అంటారా తమరే చెప్పండి .
అక్కయ్య – దేవతతోపాటు పిల్లలిద్దరూ ప్లేట్ వైపు చూసి నవ్వుతూనే ఉన్నారు .
కమిషనర్ : పిల్లలిద్దరికీ ముద్దులుపెట్టి పెద్ద పెద్ద పీసస్ వడ్డించారు – నీ చెల్లి కావ్యకు కూడా ఇంత పెద్దది వడ్డించి ప్రాణమైన ముద్దుపెట్టారు ఎలాగో గోబీ అయినా వడ్డించలేదు కనీసం ఒక ముద్దైనా అంటూ బుగ్గను చూయించారు .
అక్కయ్య – దేవత : సంస్కారవంతమైన కోరిక తప్పేలేదు అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ అంటూనే ఇష్టమైనట్లు సిగ్గుపడుతూనే లవ్ యు శ్రీవారూ అంటూ సర్ బుగ్గపై ముద్దుపెట్టబోతే సర్ …… సడెన్ గా మేడం వైపు ఫేస్ టర్న్ చెయ్యడంతో ఫ్రెంచ్ కిస్ ………
కమిషనర్ సర్ : ప్చ్ ……. లవ్లీ లవ్లీ , గోబీ పీస్ చిన్నదైనా మధురమైన ముద్దు అంటూ భోజనం కంటిన్యూ చేశారు .
దేవత – అక్కయ్య …… అవాక్కై ముసిముసినవ్వులతో సిగ్గుపడుతున్నారు , పిల్లలం ముగ్గురమూ కళ్ళుమూసుకుని నెమ్మదిగా కళ్ళుతెరిచి చూసి నవ్వుకుంటూ తింటున్నాము – అన్నయ్యా ……. డాడీ ఎప్పుడూ ఇంతే బ్రేక్ఫాస్ట్ , లంచ్ , డిన్నర్ సమయంలో మమ్మీకి ప్రేమతో ముద్దుపెట్టేస్తారు .
కాసేపు పిన్ డ్రాప్ సైలెంట్ గా డిన్నర్ కానిచ్చాము .
పిల్లలు – బుజ్జిహీరో – చెల్లెళ్లు ఉన్నారు అంటూ మిస్సెస్ కమిషనర్ నిమిషానికోకసారి సర్ ను ప్రేమతో గిళ్ళుతూనే ఉండటం చూసి అందరమూ నవ్వుకుంటూ భోజనం పూర్తిచేసి హాల్లోకి చేరాము .
చెల్లెమ్మ – తమ్ముడు …… సర్ తోపాటు సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ అన్నయ్యా కూర్చోండి .
నో నో నో సర్ …….
కమిషనర్ సర్ : అయితే నేనే నిలబడతాను అని ఏకంగా పైకి లేచారు – మా బుజ్జిదేవుడు కూర్చుంటేనే నేనూ కూర్చునేది .
మేముకూడా అంటూ హాసిని – విక్రమ్ చెరొకవైపు నిలబడ్డారు లవ్ యు డాడీ అంటూ …….
నో నో నో సర్ అంటూ సోఫా చివరన కదిలితే చాలు కిందకు జారేలా కూర్చున్నాను .
కమిషనర్ సర్ : తల్లీ హాసినీ ……..
హాసిని : Ok డాడీ అంటూ నా చేతిని చుట్టేసి దగ్గరకు లాక్కుని కూర్చోబెట్టుకుని , అన్నయ్యా ……. అన్నింటిలోకీ మీరు తెచ్చిన గోబీనే సూపర్ లవ్ యు అన్నయ్యా ……..
లవ్ యు చెల్లీ …… , ఈ లవ్ యు లు అన్నీ సర్ కే చెందుతాయి – గోబీ వ్యక్తికి సర్ కు అని చెప్పాను అంతే …… , కొత్త కమిషనర్ సర్ కా …… ప్రాణాలకు తెగించి ఎంత ధైర్యం చేసారో న్యూస్ లో చూసాము – సర్ కోసం స్పెషల్ గా చేస్తాను అన్నాడు .
కమిషనర్ సర్ : మొదట ప్రాణాలకు తెగించి మనతోపాటు సిటీ ప్రజలందరినీ కాపాడినది ఎవరో …… ఎవరు తల్లీ …… ? .
హాసిని : మా అన్నయ్య – మా బుజ్జిదేవుడు .
కమిషనర్ సర్ : కాబట్టి లవ్ యు లన్నీ మా బుజ్జిదేవుడికే చెందాలి అంటూ నా కురులను స్పృశించారు .
