పెళ్లి తరువాత..పెళ్లి ముందు..4 128

వెళ్లి బైక్ ను పక్కన పడేసి కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసా. లోపల రూప స్టీరింగ్ మీద తల పెట్టుకుని పడుకోవడం కనిపించింది. తన కంట్లో నీళ్ళు కారుతున్నాయి. నేను గట్టిగా డోర్ ను తడుతూ యే రూపా, రూపా అంటూ పిలిచా. తను సడెన్ గా కళ్ళు తెరిచి నన్ను చూసింది. తనని చూస్తూ ఉంటే ఇక్కడ నేను అనుమానించింది ఎం జరగలేదు అని అర్దం అవుతూ ఉంది. అయినా కూడా నమ్మలేక తనని తెరువు అని అన్నా. తను నేను రావడాన్ని చూస్తూ కొంచెం ఆనందం తో తలుపు తెరిచింది. కానీ నేను ఉన్న పరిస్థితి తనకు తెలీదు. నేను కోపంగా తనని బయటకు లాగేసా.
తను హేయ్ ఎన్టీ ఏమైంది అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంది. నేను తన డ్రెస్ ను బాడీ నీ పరికించి పరికించి చూస్తూ తనకెలాంటి హానీ జరగలేదు అని కంటితో కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నా. తను నా వంక చూస్తూ నా ప్రేమను నిజం చేయటానికి నీకింత సమయం పట్టిందా అంది. ఆ మాట వినగానే నాకు చివ్వున కోపం వచ్చింది వెంటనే తలెత్తి తనని చూస్తూ తన చెంప మీద రెండు ఫట్ ఫట్ మంటూ కొట్టా. తనకి ఎం అర్దం కాలేదు. నేను తనని కోపంగా చూస్తూ నీ సెల్ ఎక్కడ అన్నా. తను తల దించుకుని ఎటో పడేశా అంది. నేను తనని చూసి బుద్ధి లేదు అంటూ ఇంకో రెండు సార్లు బలంగా కొట్టా. అలా కొడుతూ ఉంటే తన కంట్లో కన్నీళ్లు ఇంకా ముఖం లో ఆనందం రెండూ ఒకే సారి రావడం కనిపించింది. నేను అది చూసి కొడుతుంటే ఆ ఆనందం ఎంటే నీకు అన్నా. తను నా ముఖం లోకి చూస్తూ, నువ్విలా కొడుతుంటే నాకు నీ కోపం కాకుండా నీ ప్రేమ తెలుస్తూ ఉంది అంది. నేను ఉఫ్ అనుకుంటూ కోపంగా తన వంక చూసా..
చూస్తూ మనసులో అనుకున్నా నేను వచ్చిన పరిస్థితి ఏంటి ? తను ఎం వాగుతుంది అని. అలా అనుకుంటూ కోపంగా పక్కకు వచ్చి అక్కడే ఫుట్ పాత్ మీద కూర్చున్నా. తను కాసేపు ఆగి నా దగ్గరికి వచ్చింది. నేను తలెత్తి తనని చూసా. తను మౌనంగా ఉంది. నేను తనని కోపంగా చూస్తూ, అక్కడ ఒకపక్కఏమో మీ అమ్మ ఫోన్ లో కంగారు పడుతూ ఉంటే, ఇక్కడ నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంటే, అర్థరాత్రి నువ్వు ఒంటరిగా అదీ తాగుబోతులు తిరిగే చోట ఉన్నావ్ అని తలుచుకుంటూ ఉంటే నాకు ఒళ్ళంతా భయం తో చెమటలు పడుతుంటే కంగారు కంగారుగా ఇక్కడికి వచ్చా. వచ్చి నువ్వెలా ఉన్నావో చూస్తుంటే నువ్వేమో ప్రేమ దోమా అని అంటున్నావ్, నీకంత వెర్రి వాడిలా కనిపిస్తున్నానా నేను అన్నా. తను ఎం అనలేదు. నేను తన వంక అలాగే చూస్తూ నీకేమైనా అవుతుందేమో అని నాకిక్కడ గుండె దడ పుడుతు ఉంటే నీకేమో ఆనందంగా ఉంది కదా, అవునా అన్నా వెటకారంగా చూస్తూ..

17 Comments

  1. Story baga rasthunnaru kani edo miss ayina fell vasthundi inkochem vidamarichi rasthe ne kadha oka kaviga meru maku cheyagalige sahayam melo manchi kavi vunnaru na masuku hathukune lanti story indulo chala vishayalu na life ki sink avuthunnavi bt entha baga kadu na life lo no happiness

  2. Good story next update continue bro

  3. Bro stories చాల bagunnay.. Inka raandi bro

  4. Chaala cute ga vundhi story

  5. Konchem twaraga post chey bro story kosam chala waiting ikkada plss

  6. Vijayraj Nuthalapati

    Where is update man

  7. What’s happening bro where is the update

  8. Happy new year…bro pls update evadhi bro

  9. Bro update ivvu bro , story stop chestae kanisam comment lo reply ivvu bro , half half stories anti bro

  10. Super sir..hart tuching story

    Continue next parts pls

  11. Next part eppudu bro

  12. Next update ivvu bro story chala bagundi.

  13. 15days avuthundhi no update your bro

  14. Bro meku money prblm vunte gpay r phone pay pettandi kani ela madyalo vadileyam em baledu

  15. One month avuthundi no update y bro

Comments are closed.