ప్రేమ 575

తర్వాత రెండు రోజులు ఆయిల్ తో మసాజ్ చేసుకునేందుకు తరచుగా మాట్లాడాలనిపించేది.ఒకరకంగా సాయంత్రం పూట వాడి రాకకోసం ఎదుచూసేదాన్ని.ఉదయం, సాయంత్రం కూరలు తీసుకెళ్ళి ఇవ్వడం మొదలైంది.వాడు వద్దనేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం పూట నల్లా దగ్గర నీళ్ళు పడుతుండగా జారి పడిపోయాను.ఆ చప్పుడుకు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మెల్లిగా లేవదీశాడు.మెల్లిగా పట్టుకెళ్ళి సోఫాలో కూర్చుండబెట్టాడు.”దెబ్బ బాగా తగిలిందాక్కా?”అనడిగాడు. “లేదురా, అంతగా తగల్లేదు. “అన్నాను. సరే అని వాడే నీళ్లు పట్టి పెట్టాడు.”అక్కా హాస్పిటల్ కెళ్దమా?”అనడిగాడు. వద్దన్నాను.”సరే నేనెళ్తాన”ని వెళ్లిపోయాడు.మధ్యాహ్నానికే బాగా జ్వరమెచ్చింది.లేవలేకపోయాను.మా ఆయన ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ పడుకున్నాను.సాయంత్రానికి ఆయన రాలేదు కాని ప్రేమ్ గాడొచ్చిన చప్పుడయింది.బయటకొచ్చి నీరసంగా “ప్రేమ్ ఒకసారిలా రారా”అని పిలిచాను. “ఏంటక్కా”అంటూ దగ్గరకొచ్చాడు.నన్ను చూడగానే “జ్వరమొచ్చిందా?”అనడిగాడు .ఔనన్నట్లుగా తలూపాను.”హాస్పిటల్ కెళ్దామా?ఆటో తీసుకురానా”అంటూ నా సమాధానం కోసం కూడా చూడకుండా బయటికెళ్ళాడు.ఐదు నిముషాల్లో ఆటో తీసుకొచ్చి, హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్ ఒక ఇంజక్షన్, కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చింది.హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత వాడే నన్ను మెల్లిగా పట్టుకెళ్ళి పడుకోబెట్టి “ఇప్పుడే వస్తానక్కా”బయటికి పరిగెత్తాడు.పది నిమిషాల్లో ఏదో పార్శిల్ తీసుకొని వచ్చాడు. వంటింట్లో నుండి నీళ్ళ బాటిల్* ఒక ప్లేట్ తీసుకొచ్చాడు. “ఈ ఇడ్లీ తిని ట్యాబ్లెట్లు వేసుకోక్కా”అన్నాడు. “తర్వాతేసుకుంటా”అన్నాను. “అదేం కుదరదు ఇప్పుడే నా ముందే తిని, ట్యాబ్లెట్లు వేసుకోవాలి “.అన్నాడు. సరే అంటూ ప్లేట్ తీసుకుని ఒక ఇడ్లీ తిని “చాలు “అన్నాను. “ఇంకొకటి తినక్కా”అంటూ ఇంకో ఇడ్లీ ప్లేట్లోవేశాడు.వాడు తీసుకుంటున్న చనువు చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఇంకో ఇడ్లీ కూడా తినేశాను.ట్యాబ్లెట్లు అందిచ్చాడు.అవి వేసుకోగానే పడుకోక్కా అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఓ గంట తర్వాత “సంగీతక్కా”అని పిలుస్తూ తలుపు తట్టాడు. “లోపలికి రారా”అని పిలిచాను. లోపలికొచ్చి “ఎలా ఉందక్కా ఇప్పుడు “అనడిగాడు. “ఇప్పుడు పర్లేదు, జ్వరం తగ్గింది. ఇంతకు ఆటోకు డబ్బులు ఎన్నిచ్చావు”అంటూ డబ్బులు ఇవ్వడం కోసం లేవబోయాను.”నువ్ లేవకు,రెస్ట్ తీసుకో,నేను తర్వాత శేఖర్ బావ దగ్గర తీసుకుంటా”నంటూ వెళ్లిపోయాడు.రాత్రి ఎనిమిదిన్నరకు మాఆయనొచ్చాడు.జరిగింది చెప్పాను. “ఇప్పుడెలావుంది,జ్వరం తగ్గిందా”అంటూ చేయి పట్టుకొని చూసి, “ప్రేమ్ గాడు రూంలోనే ఉన్నాడా,డబ్బులిచ్చి థ్యాంక్స్ చెప్పోస్తానని”ఆయన వెళ్ళే లోపలే వాడే “ఇక్కడే ఉన్నా బావా”అంటూ వచ్చాడు. “చాలా థ్యాంక్స్ రా “అన్నారు. “మాటిమాటికి మీరిద్దరు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు. “అన్నాడు. “సరేగాని,అక్కెలాగు వంటచేయలేదని మెస్ నుండి పార్శిల్ తెచ్చాను. మీరు బయటి తిండి తింటారు కదా?”అనడిగాడు. మా ఆయన పార్శిల్ తీసుకొని “ఈ రోజు నువ్ కూడా ఇక్కడే తినురా”అన్నారు. “నేను తీనేసోచ్చాను,మీరు తినండి “అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి వాడిమీద అభిమానం ఇంకా పెరిగింది. వాడు నాకు ఒక అపురూపమైన వ్యక్తిలా అనిపించేవాడు.నేను మాట్లాడిస్తే తప్ప వాడు అనవసరంగా కల్పించుకొని మాట్లాడేవాడు కాదు.పిలిస్తేతప్ప మా పోర్షన్ వైపు వచ్చేవాడు కాదు.నాకేమో వాడితో ఎక్కువ సమయం మాట్లాడాలనిపించేది.ఎదురు పడితే నమస్కారమక్కా అని మాత్రం ఖచ్చితంగా విష్ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఇల్లు కడుగుతుండగా కాలు జారింది. పడిపోలేదు కాని కుడి కాలి కండరాలు పట్టేసుకున్నాయి.నడవడం చాలా ఇబ్బంది అయింది.ఎలాగోలా ఇల్లు కడిగి,ఇంటి పనులు చేసున్నాను.డాక్టర్ వెల్దామంటే వెళ్ళాలనిపించలేదు. ఆవిడ మాటలు గుర్తుకొచ్చాయి.ప్రేమ్ గాణ్ణే ట్రీట్మెంట్ చేయమనడిగితే సరిపోతుంది అనుకున్నాను. సాయంత్రం వాడు రాగానే పిలిచి నా పరిస్థితి చెప్పాను.వాడు ఒకసారి నిట్టూర్చి, కుర్చీలో కూర్చొని”చూడక్కా మడమ దగ్గర, మెడ దగ్గర మసాజ్ చేసినట్లు కాదు.కాలు నొప్పయిందంటే ఖచ్చితంగా తొడ కండరాలు పట్టేసి ఉంటాయి. అక్కడ మసాజ్ చేసి సరిచెయ్యడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.మగాళ్ళకైతే చెయ్యొచ్చు, కాని ఆడవాళ్ళకు కష్టం. నేను చెయ్యలేనక్కా,సారీ”అంటూ వెళ్ళిఫోయాడు.వాడు చెప్పింది నిజమే.తొడపై భాగం చీరెత్తి పట్టుకోవడం నాకు ఇబ్బందే,వాడితో ఆయిల్ తో మసాజ్ చేయించుకోవడం ఇంకా ఇబ్బంది. ఈ ఆలోచన నాకెందుకు రాలేదనిపించింది.ఇంట్లో పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్లు రెండేసుకున్నాను.రాత్రి వరకు కొంచెం నొప్పి తగ్గింది. ఉదయానికి నొప్పి ఇంకా ఎక్కువయింది.లేవలేకపోయాను.మాఆయనడిగితే వంట్లో బాగోలేదన్నాను.ఆయన ఫ్రెషపయ్యి హోటల్* నుండి టిఫిన్ పార్శిల్ తీసుకొచ్చి, “ముఖం కడుక్కుని టిఫిన్ తిను హాస్పిటల్ కెళ్దాం”అన్నారు. “వద్దు మీరు డ్యూటీ కెళ్ళండి.తగ్గకుంటే సాయంత్రం చూద్దాం “అన్నాను.అయిష్టంగానే సరే అని మార్నింగ్ షిప్ట్ కు వెళ్ళిపోయారు.ఇబ్బంది పడుతూనే లేచి ముఖం కడుక్కొని టిఫిన్ తిన్నాను. కొద్దిగా నడవడానికి కూడా చాలా కష్టమవుతోంది.ఇక ఆగలేకపోయాను.వాడేమనుకున్నాసరే అని నిర్ణయించుకొని “ప్రేమ్ …ఒకసారి ఇలా రారా”అని పిలిచాను.