ఫ్రెండ్ మామ్ updated 965

ఒకరోజు సూర్య తాగి ఇంటికి వచ్చాడు.తన కొడుకు తాగి ఉండడం చుసిన సుమతి.

మల్లి ఎందుకని తాగావు సూర్య.

మద్యం మత్తులో తెలిసిందా…నేను తాగానని..నేను తాగానని నాన్నకి చెప్తే నేను ఇంట్లో ఉండను ఎక్కడికయినా వెళ్ళిపోతాను.

కోడుకు అంటే సుమతికి ప్రాణం.తన కొడుకు ఆలా అనేసరికి తన గుండె ఆగిపోయినట్టయింది.అంతే అప్పటినుండి ఇప్పటిదాకా ఏమిచెయ్యలేక తన కొడుకు తాగుడు మానేయాలని తనని ప్రేమతో అమ్మ అని పిలుస్తాడని,దేవుడికి పూజలు,వ్రతాలు చేస్తూ ఉంది.

అంతేకాదు సూర్య కాలేజీలో ర్యాగింగ్ చెయ్యడం మొదలుపెట్టాడు. తన కొడుకు ర్యాగింగ్ చేస్తున్నాడని తెలిసిన ఏమి చెయ్యలేని పరిస్థితి తనది.అలా ర్యాగింగ్ చేస్తూ రాజుని చాల సార్లు కొట్టాడు సూర్య.

ఇదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని సుమతి సోఫాలో నుండి లేచి వాష్రూంకి వెళ్లి మొకం కడుక్కొని హాస్పిటల్కి వెళ్ళింది.

హాస్పిటల్లో రాజు ఉన్న వార్డ్ లోకి వెళ్లి చుసింది.
బెడ్ మీద రాజు పడుకొని ఉన్నాడు.రాజు లేచేవరకు ప్రక్కన కుర్చీలో కూర్చొని ఉంది.

ఇంతలో డాక్టర్ వచ్చింది.సుమతి డాక్టర్ రావడం చూసి రాజుకి ఎలాగా ఉంది అని అడిగింది.

మీరు రాజు అనే పేషెంట్ కి ఏమవుతారు.

నేను రాజు స్నేహితుడు సూర్య అమ్మని.

పేషెంటు రాజుకి అమ్మ నాన్న ఎవరు లేరా..

ఉన్నారు..నాన్న దుబాయ్ లో ఉంటారు.అమ్మ కడుపుతో ఉండడం వలన పుట్టింటికి వెళ్ళింది.

ఓహ్.. నో.. అయితే ఇప్పుడు ఎవరు లేరా..

నేనున్నాను డాక్టర్ అసలు ఏమైంది రాజుకి చెప్పండి.రాజుకి నేనుకూడా అమ్మ లాంటి దానినే వాళ్ళ అమ్మ రాజు బాగోగులు చూసుకోమని నాకు చెప్పి వెళ్ళింది.

ఓకే.. రాజుని ౩౦ నిమిషాల తరువాత డిశ్చార్జ్ చేస్తాం.ప్రిస్క్రిప్షన్ ఎలా వాడాలో చెప్తాను నా కేబిన్ కి 5 నిమిషాల తరువాత రండి.అని డాక్టర్ తన క్యాబిన్కి వెళ్ళింది.

సుమతి 5 నిమిషాల తరువాత డాక్టర్ కేబిన్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టింది.

లోపలికి రండి..

సుమతి కేబిన్ లోపలికి వెల్లింది.

కుర్చొండి.

ఇంతకీ రాజుకి ఎలా ఉంది.

పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది..కానీ..

1 Comment

  1. Next parat

Comments are closed.