ఆ మాట అన్న మరుక్షణమే ఆమె ఆనందంతో నా దగ్గరకు వచ్చి నన్ను లేపి గట్టిగా హత్తుకుపోయింది గువ్వ పిల్లలా..
ఒక్కసారిగా ఆమె చేసిన పనికి,నాలో నాడులు అన్నీ ఆగిపోయాయి ఆమె బిగి కౌగిలికి..
ఆ కౌగిలి స్పర్శ అంత మధురంగా ఉంది..
ఆమె కౌగిలింతలోని ప్రేమ,బాధ,అభిమానం ని అర్థం చేసుకున్న నేను నా మనసు చెప్పే మాట వినకుండా ఆమె తల పైన చేయి వేసి,ఏంటండీ మరీ చిన్న పిల్లలా .ఏమీ కాదు ధైర్యంగా ఉండండి అంటూ ఆమె భుజాల్ని నా నుండి విడిపించే ప్రయత్నం చేసా..
నా ప్రయత్నం ఫలించలేదు ఆమె బిగి కౌగిలి ముందు..కానీ ఆమె అలా కౌగిలించుకొని ఉండడం వల్ల తీయని భావనలు అధికం అవుతున్నాయి..
ఎంత సేపటికీ ఆమె పట్టు వదలలేదు..ఏమి చేయాలో అర్థం అవ్వడం లేదు.
చివరగా,ఇదిగో ఇంద్రాణి గారు మీరు ఇలా హత్తుకొని ఉంటే నాలో ఏదేదో జరుగుతోంది అన్నా..
అనడం ఆలస్యం,నా నుండి విడిపోయి గబగబా నా దగ్గర నుండి వెళ్ళిపోయి ఆమె ముందున్న స్థానం లో కూర్చుంది బుద్దిగా..
హ హ్హా ఆమె లోని ఆడతనం ని చూసి ముచ్చటేసి నవ్వా..
ఆమె బుగ్గలు ఈసారి సిగ్గుతో ఎరుపెక్కాయి..
ఆమె మొహంలో ఏదో తేడా,అది సిగ్గుతోనా?తమకం తో నా???.
అంతకు ముందున్న ఆమె మొహం లోని సీరియస్ నెస్ ఇప్పుడు లేదు,ఆమె శ్వాస లోనూ తేడా..
ఆమె ఇది వరకు లాగా నా కళ్ళల్లోకి చూడలేక పోతోంది..
వామ్మో ఇక్కడ ఉంటే కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి అని వెనుదిరిగిన నాకు ఆమె అన్న మాట మళ్లీ ఆగిపోయేలా చేసింది
ఆమె అన్న మాట నాలో ఉత్సాహాన్ని నింపేసింది..
“నా గురించి తెలుసుకోవా?? అప్పుడే వెళ్లిపోతున్నావ్ అన్నది ఆమె మాట”..
నేను లోలోపల ఆనందపడి,మీరే అన్నారు గా నేను చెప్పేవరకు అడగొద్దు అని,అందుకే కామ్ గా వున్నా లేకుంటే విసిగించి మరీ తెలుసుకునేవాన్ని అన్నా నవ్వుతూ..
హ్మ్మ్ విసిగిస్తావా??ఎలా విసిగిస్తావ్?? ఆమె కళ్ళు ఎగరేస్తూ..
నాకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు,అదీ ఎలా అంటే … అంటూ నసుగుతున్నా..
నా బాధ అర్థం చేసుకున్న ఇంద్రాణి,సరే నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ముందు జరిగే సంఘటనలు గురించి,అందుకే చెప్పాలి అనుకుంటున్నా .
హబ్బా అదేదో ముందే చెప్పుండొచ్చు గా అండీ,ఇంత సేపు నన్ను టెన్షన్ పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నా.
హ్మ్మ్ ముందే చెప్తే,టెన్షన్ తో పారిపోతావని చెప్పలేదు అంది కాస్త నవ్వుతూ.
నేను అలాంటోన్ని అయితే ఇంతవరకు రాను ,భయపడే టైప్ కాదు అన్నా నవ్వుతూ.
సరే అవి ఎందుకు ఇప్పుడు,ఇలా కూర్చో అని చెప్పేసరికి ఆమె కు ఎదురుగా కూర్చొని వినడం మొదలుపెట్టా..
“నేను నువ్వు అనుకొనే సువర్ణా వాళ్ళ అమ్మ కి స్వయానా కూతురిని”.
ఆమె మాటకి ఆశ్చర్యపోయి,మరి అదేంటీ “సువర్ణా” ఎవరు???
ఆ విషయం తర్వాత చెప్తా ముందు నా గురించి విను..
12 సంవత్సరాల ముందు పూజ జరగలేదు కదా,ఆ విషయం గుర్తుందా నీకు??
హా గుర్తుంది,మా ఊరి కొండా రెడ్డి మనుషులు ఏదో ఇబ్బంది చేసి పూజ జరగకుండా చేసారు అని విన్నా.
హ్మ్మ్ నిజమే,కానీ ఆ పూజ లో నేనే ఆ కన్య ని,అయితే ఆ పూజ జరగలేదు దురదృష్టవశాత్తు.
అవునా,జరగకపోతే మరి మీరెందుకు ఇలా బయట వున్నారు??బయట బ్రతికే అవకాశం మీకు లేదు గా??
అవును మేము బయట ఉండటానికి అవకాశం లేదు,కానీ ఒక మా వంశపు ఆడ మనిషి ప్రాణ త్యాగం చేస్తే కన్య అయిన అమ్మాయి బయటికి వెళ్లొచ్చు.
అదేంటీ,కన్య బయటికి వచ్చేస్తే నెక్స్ట్ పూజ కి కన్య ఉండాలి గా,అదెలా సాధ్యం??? అన్నా.
ప్రతి 12 సంవత్సరాలకు ఒక పుష్పవతి అయిన కన్య ఎలా వస్తుంది అన్నదే గా నీ సందేహం,అదీ చెప్తా విను..
ప్రతి పూజ కీ ఒక కన్య మా వంశంలో అందుబాటులో ఉంటుంది, అది పూజ మధనుడి తో జరిగినా ,జరగకపోయినా..
హబ్బా కన్ఫ్యూజింగ్ గా ఉందండి,మధనం జరగకపోతే అమ్మాయి ఎలా పుడుతుంది అన్నా..
నిజమే కానీ,మా పూజ కి ఆటంకం కలగకుండా మాకు ఒక వరం ఉంది, దాని వల్లే ప్రతి 12 సంవత్సరాల కి ఒక కన్య తప్పక ఉంటుంది అందుబాటులో..
ఏంటా వరం???
Em swamy story రాసేది koncham speed ga rai ledante dengey…endi sodi
Bro next part kuda complete cheya bro