వాళ్ళ అంగీకారాన్ని చిరునవ్వుతో తెలిపారు… అంతే సంతోషం వెల్లివిరిసింది అందరిలోనూ….రాజసింహుడికి ముగ్గురు రాణులు ఖరారు అయ్యారు.(అప్పుడు అర్థం అయ్యింది నాకు సివంగి,రాజన్న లు మాటిమాటికీ నన్ను మహారాజా అని ఎందుకు అన్నారో).
అప్పుడే కర్ణుడు తన చెల్లి ఉమామహేశ్వరిని నీకు నక్షత్రుడు అంటే ఇష్టమేనా అడగడంతో తను కూడా చిరునవ్వు నవ్వి సమ్మతాన్ని తెలియజేసింది…(అప్పుడు అర్థం అయ్యింది శ్రీదేవి ఎందుకు నన్ను ఉమా తో మధనం ఎందుకు చేయొద్దు అని చెప్పిందో అని)..
మొత్తానికి రేనాటిచోళ,మట్లి రాజ్యాలు సంతోషంతో ఆనందతాండవం చేసాయి…శిశుపాలుడు రాజ్యంతో సహా పద్మనాభుడి అర్ధ రాజ్యం కి మహారాజుగా రాజసింహుడు పట్టాభిషేకం చేసుకొని తన పాలన సాగించాడు అతి త్వరలో వివాహం కుదుర్చుకుని…
సూర్యకీర్తి(నాని) రాజసింహుడి రాజ్యానికి సకల సర్వ సైన్యాధ్యక్షుడు గా బాధ్యత తీసుకున్నాడు..
అలసట అనిపించగా బుక్ మూసేసి ఆలోచనలో పడ్డాను.. అంతా సవ్యంగా ఉన్నా ఈ నక్షత్రుడు,కర్ణుడి జాడలు ఇంకా నా జీవితంలో ప్రవేశించలేదు, ఇంతకీ ఎవరై ఉంటారు వీళ్ళిద్దరూ అని ఆలోచించసాగాను….
Sir meeru allredy chadivina episodes malli pedutunnaru