ఇప్పుడు ఈమె ఏ మూడ్లొ ఉందొ అనుకుంటూనే అంటీ ఒకటి కిన్లే సోడా ఇవ్వరా అని అడిగితే నవ్వుతూ ఇచ్చింది. అయితే మంచి మూడ్లోనే ఉంది. ఫోన్పె స్కానర్ కొడుతుంటే వద్దులే.. చుట్టాల దెగ్గర తీసుకుంటే బాగోదు అంది వెటకారంగా
వినయ్ : పర్లేదు ఆంటీ తీసుకోండి, గీత ఉన్నప్పుడు ఎలాగో డబ్బులు ఇవ్వనుగా
అయినా బలే సెట్ చేసావ్రా ఇద్దరినీ, అప్పటికి అనుకుంటూనే ఉన్నా ఏదో జరుగుతుందని.
వినయ్ : దేని గురించి ఆంటీ
మీ మావయ్య, గీత అక్క గురించి. అంకుల్ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారుగా.. ఇందాక వచ్చాడు మీ మావయ్య.
వినయ్ : ఓహ్..
నువ్వే కదరా ఇద్దరి మధ్యా రాయబారాలు నడిపింది. అందుకే నిన్ను ఎప్పుడు అది పక్కన పెట్టుకుని తిరిగింది…
గీత వాళ్ళ అమ్మ ఏదేదో మాట్లాడుతున్నా నాకేం వినిపించట్లేదు. ఆ రోజు మావయ్య గీతా నవ్వుకున్న దెగ్గరి నుంచి నన్ను తన వెంట తిప్పుకోవడం, ట్యూషన్లొ చేరడం, మా ఇద్దరికి అంటే ఎందుకు అని అడగకుండా మావయ్య డబ్బులు ఇవ్వడం, మొన్న కొన్న ఆ షర్టు, మెడలో లాకెట్టు అన్నీ.. అన్నీ.. అంతా మోస్….
ఫోన్ మొగుతుంటే చూసాను, అభయ్ గాడు.
వినయ్ : చెప్పురా
అభయ్ : రేయి మీ మావయ్యా గీత అక్క ఇద్దరు బండి మీద వెళ్లడం చూసా ఇందాక
వినయ్ : నేను తరువాత చేస్తా రా అని పెట్టేసాడు.
గీత వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నా ఇంటికి వచ్చేసాను. మంచం ఎక్కి కూర్చుంటే బైట వినయ్ అన్న అభయ్ గాడి గొంతు వినపడింది. లోపలికి వచ్చాడు దొంగ నా కొడుకు వీడైతే.. నా లోకంలొ నేను సంతోషంగా ఉంటే.. పిచ్చ నా కొడుకు
అభయ్ : ఒరేయి..
వినయ్ : రా రా అక్కడ చీపిరి ఉంటది తీసుకురాపో
అభయ్ : ఏమైందిరా
వినయ్ : మా మావయ్య లవర్ గీతే..
అభయ్ : అమ్మ నీ యమ్మ, ఇప్పుడేం చేద్దాం. విడకొట్టేద్దామా
వినయ్ : చంపుతా నా కొడకా నిన్ను.. పెళ్లికి కూడా ఒప్పుకున్నారు.
అభయ్ : ఇప్పుడేం చేద్దాంరా
వినయ్ : పెళ్లి పనులు అప్పుడు పిలుస్తా వచ్చి చేసేళ్లు
అభయ్ : ఒరే సారీరా
వినయ్ గట్టిగా నవ్వితే అయోమయంగా చూసాడు అభయ్.
వినయ్ : ఎంత మంచి ఆలోచనరా వాళ్ళది.. లవ్ చేసుకున్నా బైటికి రానివ్వలేదు. ఇద్దరు జాబ్ వచ్చేదాకా ఓపిక పట్టారు. గీత అక్కకి జాబ్ వచ్చి మొదటి జీతం ఇంట్లో ఇచ్చాక అప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రేమ గురించి చెప్పి ఒప్పించింది. సూపర్ కదా వాళ్ళు
అభయ్ : మరి నువ్వు
వినయ్ : నాది ఏముందిరా, మా మావయ్య కంటే ఎక్కువా..
పొద్దున్నే వచ్చేయి గుడికి పోదాం
అభయ్ : ఎందుకురా
వినయ్ : పోయి నేను కూడా గీత అక్క లాంటి మంచి పిల్లని చూసుకుంటా
అభయ్ మనసులో బాధ, భయం వెంటనే ఎగిరిపోయాయి. సరే మామా అనేసరికి ఇంటికి వెళ్ళిపోయాడు. అభయ్ వెళ్ళిపోగానే వినయ్ మొహంలొ నవ్వు మాయం అయిపోయింది. లేచి మేడ మీదకి వెళ్లి చూస్తుంటే పది నిమిషాలకి మావయ్య, గీత ఇద్దరు బండి మీద రావడం కనిపించారు. గీత అక్క మొహం చాలా సంతోషంగా ఉంది, మావయ్య కూడా ఇద్దరు గీత అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోయారు. వెంటనే దిగి బ్యాగ్ తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయాను. అక్కడ కూడా ఉండాలనిపించలేదు, పిచ్చి పిచ్చిగా ఉంది. అభయ్ గాడికి ఫోన్ చేశాను. అవును ఇద్దరివి వేరే కాలేజీలు.
రేయి సినిమాకి వెళదాం వస్తావా అని అడిగితే వస్తానన్నాడు. థియేటర్లొ కూర్చుని సినిమా చూస్తుంటే ఆలోచనల వల్ల అలిసిపోయానేమో నిద్రొచ్చేసింది.
ఇంటికి వస్తుంటే చూసాను, గీత అక్క నుంచి మూడు మిస్డ్ కాల్స్ మావయ్య నుంచి ఐదు మిస్డ్ కాల్స్. వీధిలో నడుస్తుంటే మావయ్య బండి మా ఇంటి ముందే ఉంది. లోపలికి వెళ్లాను, గీత కూడా ఉంది. చెప్పులు విప్పి లోపలికి వెళ్ళగానే మావయ్య ఎదురు వచ్చాడు.
ఆయన మెడలో లాకెట్, G ఆకారంలొ పైన కర్వ్ లొ పచ్చ రాళ్లు పోగేసి ఉండటం చూసి అప్పుడు తెలీలేదు, ఇప్పుడు అర్ధమవుతుంది అది C అని. ఇద్దరు ఎదురు నిలుచుని నన్ను చూసి నవ్వుతున్నారు.