వినయ్ : అదే అనుకున్నా నేను కూడా.. రేపు రిసెప్షన్ కూడా ఉందిగా
గీత : వద్దు అనుకుంటున్నాం, బైట చిన్న కన్వెన్షన్ హాల్లో ఒక నాలుగు గంటల ప్రోగ్రాం అంతే.. ఇంటికి వచ్చేయడమే
వినయ్ : ఇంతకీ తిన్నారా మీరు
గీత : ఇంకా లేదు, వద్దంటే వినకుండా రూములొ పెట్టారు. వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక పోతున్నా అంటే నవ్వాడు.
★★★
పార్టీ అయిపోయింది, టైం చూస్తే రెండు దాటింది. ఫ్రెండ్స్ అంతా వెళ్లిపోయారు. మిగిలింది అభయ్ నేనే.. వాడు కొంచెం తాగేసి ఉన్నాడు.
అభయ్ : నీకేం అనిపించట్లేదా మామా
వినయ్ : తాగింది సరిపోలేదా
అభయ్ : ఏమైనా నువ్వు గ్రేట్ మామా.. సూపర్ రా నువ్వు.. తోప్ అంతే
వినయ్ : పొయ్యి దిండు చాప పట్టుకురాపో, నేను ఇది క్లీన్ చేస్తా
అభయ్ : ఇంట్లో పడుకోరా
వినయ్ : అరిపించకుండా పోరా
అభయ్ గాడు పక్కలు తెచ్చాక వాడిని ఉండనివ్వలేదు, గోడ చాటుగా పక్క వేసి మోకాళ్ళ మీద నిలబడి చూసాను. ఇంట్లో లైట్లు ఆగిపోయి ఉన్నాయి. గీత మావయ్యతొ మంచి కార్యంలొ ఉందేమో.. ఫోన్లొ ఉన్న గీత ఫోటోలు, గీతకి తెలియకుండా తీసిన ఫోటోలు అన్ని డిలీట్ చేస్తుంటే తెల్ల చుడిదార్లొ చున్నీ లేకుండా నాతో దిగిన ఫోటో చూసి ఆగిపోయాను.
ఫోన్ స్క్రీన్ మీద పడిన నీటి బొట్టు, చేత్తో తడుముకుంటే అది నా కంట్లో నుంచే వచ్చిందని తెలిసింది.
ఏయి.. విన్ను.. ఏంటిది కొత్తగా.. చేసిందే ఎదవ పని.. దాన్ని కప్పేసి దెగ్గరుండి పెళ్లి చేసి ఇప్పుడు ఏడిస్తే అది ఇంకా పెద్ద ఎదవ పని అవుద్ది.
అమ్మ కావాలని ఎన్నో రోజులు మావయ్యకి తెలీకుండా ఏడ్చాను, కొన్ని రోజులకి బైటికి వచ్చేసాను.
ఇంకో పెళ్లి కోసం నన్ను వదిలేసాడు నా నాన్న, ఆ కోపం కూడా మావయ్య ముందు చూపించలేదు, కాని కొన్ని రోజులకి బైటికి వచ్చేసాను. ఎన్నో వాటి నుంచి తేరుకొని బైటికి వచ్చేసాం ఇదో లెక్కా.. నా దృష్టిలో ఏడవటం అంటే మనిషిని సున్నితం చేసేస్తుంది, అందుకే అదంటే నాకు అస్సలు నచ్చదు.
ఫోన్ రింగ్ అవుతుంటే చూసాను. మావయ్య దెగ్గరి నుంచి ఫోన్ వస్తుంటే బాధ మొత్తం పోయింది, ఇలాంటి సమయంలొ ఏకాంతంగా పెళ్ళాంతొ ఏం చేస్తారో తెలుసు, అలాంటిది ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నాడు, పక్కన గీత.. గీత అక్క.. గీత అత్తయ్య.. అత్తయ్య.. తను కూడా ఆలోచిస్తూనే ఉంటుంది.
ఫోన్ ఎత్తి మాట్లాడటం కంటే ఫోన్ ఎత్తకపోతే పడుకుని ఉంటాడు అనుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అనిపించింది, ఎత్తకుండా పక్కన పడేసి పడుకున్నాను.
★★★
ఎండ కొడుతుంటే మెలుకువ వచ్చేసింది. లేచి పక్క బట్టలు మడతేసి కింద ఇచ్చేసి ఇంటి వైపు చూస్తే తలుపులు తెరిచే ఉన్నాయి. ఇంటి ముందు చుట్టాల హడావిడి. నేను రాత్రి ఇంట్లో పడుకోలేదని తెలిసి నన్ను మెచ్చుకుంటుంటే వాళ్ళందరి మీదా కంపరం పుట్టింది.
ఇంట్లోకి అడుగుపెట్టానో లేదో గీత బెడ్ రూములొ నుంచి బైటికి వస్తూ నన్ను చూసి నవ్వింది. చచ్చిపోవచ్చు ఆ నవ్వు కోసం. రేగిన జుట్టు ఇంకా సర్దుకోలేదు, ఇంకా నిద్ర మొహంలోనే ఉంది. బైట చుట్టాలు, వాళ్ళ అమ్మ అందరూ ఉన్నారు, అందరితో మాట్లాడుతుంటే కాసేపు ఉన్నాననిపించి బైటికి వచ్చేసాను.
మొహం అయినా కడుక్కోలేదు కాని బైట టిఫిన్ చేసి మాల్లో కాసేపు తిరిగి సినిమాకి వెళ్లి కూర్చున్నా.. అది అయిపోయాక ఇంకోటి అది అయిపోయాక ఇంకోటి. చివరికి సాయంత్రానికి మావయ్య నుంచి ఫోన్ వస్తే ఎత్తాను, గీత గొంతు వినిపించింది.
గీత : ఒరేయి అందరిని మా ఇంటికి తరిమేసాను, ఇంకెవ్వరు రారు, ఇంటికి రా నువ్వు.. అంటే సరేనని ఇంటికి బైలుదేరాను.
వినయ్ : రిసెప్షన్ అప్పుడు ఫోన్ చేస్తారు అనుకున్నా
గీత : ష్.. తరువాత చెప్తా మీ మావయ్య ముందు ఎత్తకు అంటే సైలెంటుగా ఉన్నాడు వినయ్.
తెల్లారి సెలవు పెట్టినా మావయ్య బైటికి వెళ్లడంతొ వెళ్లి గీత పక్కన కూర్చున్నా, అప్పటికే గీత వాళ్ళ అమ్మ ఒకసారి వచ్చి వెళ్ళింది.
వినయ్ : ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది రిసెప్షన్లొ
గీత : చిన్న గొడవ అయిందిలే.. మా అమ్మ ఊరికే ఉండకుండా నీ గురించి ఏదో అంది, అది మీ మావయ్యకి నచ్చలేదు. నీకోసం ఫోన్ చేస్తుంటే వద్దని ఆపేసాడు. నిన్న నీ మీద కూడా కోప్పడ్డాడు, రిసెప్షన్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలని తెలీదా ప్రత్యేకంగా పిలవాలా అని
వినయ్ : ఏమో ఆ చుట్టాలు అందరినీ చూసేసరికి నాకు ఎలాగో అనిపించింది. ఎప్పుడు అంత మందితొ ఉన్నది లేదు కదా
గీత : అది కూడా నిజమేలే.. అయినా ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ.. రేపు నాకు పిల్లలు పుడతారు, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు అవుతారు, మనది కూడా పెద్ద ఫ్యామిలీ అవుతుంది.. నువ్వు నలుగురిలో కలవకపోతే ఎలా
వినయ్ : అప్పుడు చూద్దాంలే
గీత : సరే ఇవ్వాళ మనం ముగ్గురమే.. ఎటైనా వెళదాం, ఎంజాయి చేద్దాం
వినయ్ : ముందు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆఫీస్ లీవ్స్ అన్ని సెట్ చేసుకుంండి, అప్పుడు వెళ్లొచ్చు. కావాల్సినంత టైం ఉంది మనకి
గీత : అవును నన్ను అత్తయ్య అని పిలవడానికి నామూషి ఏంట్రా నీకు
Next part
Next part