3 రోజెస్ Part 2 13

వినయ్ : ఏమో.. ముందు అక్కా అని గీతా అని పిలుస్తూ ఇప్పుడు అత్తా అని రావట్లేదు

గీత : మనం ముగ్గురం ఉన్నప్పుడు పేరు పెట్టి పిలు, బైట వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అత్తా అని పిలువు

వినయ్ : సరేలే అత్తగారు, పిలుస్తాను ఓకేనా

గీత : ఓకే అల్లుడు గారు అని గట్టిగా నవ్వుతుంటే వినయ్ కూడా నవ్వాడు, అంతలోనే గీత నవ్వుతున్న మొహం అలా చూస్తూ ఉండిపోతే గీత కూడా నవ్వడం ఆపి చూసింది, ఏంట్రా..?

వినయ్ : ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండు. మావయ్య, నేను నిన్ను బాగా చూసుకుంటాం, అస్సలు బాధ పడనివ్వం అంటుంటే గీత వినయ్ భుజం మీద తల పెట్టుకుని ప్రేమగా చూస్తూ నాకు తెలుసు అంది. కొంచెం ఇబ్బంది పడి దూరం జరగబోతే అర్ధమయ్యి ఇంకా దెగ్గరికి లాక్కుంది గీత.

గీత : మీ మావయ్యని ఇల్లు సైజ్ పెంచమని చెప్పాను.

వినయ్ : ఏమన్నాడు

గీత : నన్నే లోన్ పెట్టమన్నాడు

వినయ్ : హహ

గీత : పెడతాను.. ఒరేయి ఇది చెప్పు ముందు, నీకు లవర్ ఉందా

వినయ్ : లేదు

గీత : నిజంగా

వినయ్ : లేదు.. ఉంటే నీ చుట్టూ ఎందుకు తిరుగుతా

గీత : అవునులే.. నీకెలాంటి అమ్మాయి కావలి

వినయ్ : అందంగా ఉండాలి, కొంచెం జాలి గుణం ఉండాలి అంతే

గీత : జాలి గుణం ఏంటి

వినయ్ : జాలి అనేది ఉంటే మంచితనం ఉన్నట్టే కదా, అది ఉంటే వాటితో పాటు ఓపిక అన్ని వస్తాయి

గీత : అబ్బో.. అయితే నువ్వు సెలెక్ట్ చేసే అమ్మాయి మామూలుది కాదు. కనీసం దిగి వచ్చిన దేవకన్య అయ్యుండాలి

వినయ్ : అవును అన్నాడు గీతని చూస్తూ.. (కానీ ఏం లాభం, ఇలాంటి బొమ్మని మళ్ళీ చెక్కడు కదా బ్రహ్మదేవుడు)

గీత : ఇంకా

వినయ్ : చెప్పు

గీత : ఏడి మీ మావయ్య

వినయ్ : ఏమో నాకేం తెలుసు.. నేను నిన్ను అడగాలి

గీత : అంత లేదులే.. మీ మావయ్య ఏం తక్కువోడు అనుకున్నావా

వినయ్ : పెళ్ళై ఒక్క రోజు దాటింది అంతే.. అప్పుడే కరివేపాకు చేస్తున్నావ్.. ఆడోళ్లంతా ఇంతేనా

గీత : అది కామన్ కదమా

మాట్లాడుతుంటే చందు కూడా వచ్చేసాడు. వస్తూనే టిఫిన్ తెస్తుంటే వినయ్ నవ్వాడు.

గీత : ఏంట్రా

వినయ్ : చూడు నీ కోసం టిఫిన్ తెస్తున్నాడు. అదే ఇంతకముందు అయితే సద్దెన్నంలొ పెరుగు కలుపుకొని తినేవాళ్ళం. ఎంతైనా పెళ్ళాం పెళ్ళామే.. నేను కూడా పెళ్లి చేసుకుంటా అంటే గీత నవ్వుతుంది

చందు : ఏంటో

గీత : వాడికి పెళ్లి కావాలంట

చందు : ఎందుకురా తొందర.. నాకు అయిందిగా.. చూడు రేపటి నుంచి నీ అత్త అస్సలు రూపం. నీతో నవ్వుతున్నట్టు ఉంటుంది అనుకుంటున్నావా. పెళ్ళై ఒక్క రోజు దాటింది అంతే.. చూడు టిఫిన్ కవర్లు మోసుకుంటున్నా

గీత : అబ్బో.. వచ్చాడమ్మా అమరప్రేమికుడు అంటే చందు కవర్లొ నుంచి వేడి సాంబార్ తీసి గీత వీపుకి ఆనించి పెట్టాడు. కెవ్వు మంటూనే చందుని కొట్టబోతూ లేచి మీద పడుతుంటే వినయ్ కి ఇబ్బందిగా అనిపించింది, కవర్లో ఉన్న వాడి టిఫిన్ అందుకుని హాల్లో వచ్చి కూర్చుంటే రెండు నిమిషాలకి అత్తా మామా ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుతు వచ్చి వినయ్ కి చెరో పక్క కూర్చుని తినేశారు.

తిన్నాక కాసేపు లూడో ఆడుకుంటూ గడిపేసి కొంచెంసేపు పడుకున్నాం. నేను బైట పడుకుంటాలే అంటే ఇద్దరు వదల్లేదు, చేసేది లేక ముగ్గురం ఒకే రూములొ పడుకున్నాం. ఎందుకో మధ్యలోనే మెలుకువ వచ్చేసింది, లేచి చూస్తే గీత మావయ్య గుండె మీద ప్రశాంతంగా నిద్రపోతుంది. వాళ్లిద్దరినీ అలా చూస్తూ కూర్చున్నాను.

సాయంత్రం సినిమాకి వెళ్ళాం, గీత నాకు మావయ్యకి మధ్యలో కూర్చుంది. అప్పుడే నాకు ఇంకో ఎదవ ఆలోచన వచ్చింది. ఎలాగోలా మావయ్య, గీతల కాళ్ళ మీద పడి గీతని నేను కూడా పెళ్లి చేసుకుంటే.. అనిపించింది. సినిమా చూసినంతసేపు ఆలోచించినా సినిమా అయిపోయాక ఆ ఆలోచన కొట్టేసాను. ఏం చేసినా గీత నాది అవ్వదు అని తెలుసు.

ఈలోపే ఆరు నెల్లు గడిచాయి. సెమ్ మొత్తంలొ నేను ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వలేదు. ఇద్దరు నా ఎదురు కూర్చున్నారు.

చందు : అంతక ముందు మూడు సెమ్ముల్లో అన్నింట్లో 80% పైనే వచ్చాయి కదా

గీత : ఈ మార్కులు ఏంట్రా.. చందు, రేపు ఒకసారి కాలేజీకి వెళ్లిరా

వినయ్ : తరవాత సెమ్ లొ కవర్ చేసేస్తాలే

చందు : నువ్వు తలుచుకుంటే కవర్ చెయ్యగలవని నాకు తెలుసు, ఈ సెమ్ లొ ఎందుకు తక్కువ వచ్చాయి.. అస్సలు ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వకపోవడం ఏంట్రా అని అడిగితే వినయ్ నేల ముచ్చు మొహం పెట్టాడు.

గీత : సరే పో.. అని పంపించేసింది వినయ్ ని

చందు : ఏంటి గీతా ఇది.. నేనింకా నమ్మలేకపోతున్నాను. నాకు ఎప్పుడైనా వర్క్ ఎక్కువ అయితే వాడితో చేయించుకుంటాను. అస్సలు వాడు ఫెయిల్ అవ్వడం ఏంటి

2 Comments

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *