వినయ్ : హా..
గీత : మావయ్య పిలుస్తున్నాడు
వస్తున్నా అని లేచాను. బాత్రూం కెళ్ళి అద్దంలో మొహం చూసుకుని మొహం కడుక్కున్నా. నిద్ర చాల్లేదు. మంచం మీద కూర్చుని లాప్టాప్లో ఏదో చేస్తున్నాడు.
వినయ్ : ఏమైంది ?
చందు : ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక నెల రోజులు ఇంట్లోనే ఉండి చేస్తావా.. నేను వేరేది చేస్తాను
వినయ్ : చేస్తాను. నాకూ వెళ్ళ బుద్ది కావట్లేదు.
చందు : లాప్టాప్ తెచ్చుకో వర్క్ పంపిస్తా అంటే లాప్టాప్ తెచ్చిచ్చాడు
వినయ్ మళ్ళీ పడుకున్నాడు. లేచేసరికి పదకొండు దాటింది. లేచి చూస్తే పక్కనే టిఫిన్ పెట్టి వెళ్ళింది గీత. స్నానం చేసి తినేసి లాప్టాప్ తెరిచి చూసాడు. చాలా పెద్ద పనే అని చూస్తూ మొదలుపెట్టాడు.
సాయంత్రం ముందుగా గీత వచ్చింది. అప్పటికే ఇంట్లో అంట్లు తోమేసి శుభ్రంగా ఊడ్చేశాడు. ఎప్పటిలానే నవ్వుతూ మెచ్చుకోబోయి సడన్ గా రాత్రి అభయ్ చెప్పింది గుర్తుకు వచ్చి ఆగిపోయింది. వినయ్ అస్సలు గీత వచ్చిందని కూడా చూడలేదు, వాడి పనిలో వాడు చాలా బిజీగా ఉన్నాడు.
లోపలికి వెళ్లి ఫ్రెష్ అయ్యి స్టవ్ వెలిగించింది. లైటర్ సౌండ్ అయితే కానీ వినయ్ తల తిప్పి చూడలేదు.
వినయ్ : ఎంత సేపైంది వచ్చి
గీత : ఇప్పుడే
వినయ్ : ఏమైంది ?
గీత : హా..
వినయ్ : అదోలా మాట్లాడుతున్నావ్
గీత : కొంచెం తలనొప్పిగా ఉంది
వినయ్ : కొంచెంసేపు పడుకోవచ్చు కదా మరి, తొందరేముంది.. డ్యూటీ ఎక్కేసావ్
గీత : చేసేస్తే అయిపోద్ది
వినయ్ మళ్ళీ పనిలో పడిపోయాడు. గీత పని చేసుకుంటూ మధ్యలో గమనిస్తూనే ఉంది. వినయ్ అస్సలు తల తిప్పడం లేదు. ప్యూర్ వర్క్ మోడ్ లో ఉన్నాడు.
ఎనిమిదింటికి బైటికి వెళ్లి తొమ్మిదింటికి వచ్చాడు. అప్పటికే చందు వచ్చేసాడు. ముగ్గురు తినేటప్పుడు ఏమి మాట్లాడుకోకుండానే తినేశారు. చందు గీత రూములోకి వెళ్ళిపోతే వినయ్ మళ్ళీ లాప్టాప్ ఎక్కేసాడు.
నైట్ అంతా పని, తెల్లారి పదకొండు ఆ టైములో లేచి టిఫిన్ తినేసి మళ్ళీ పని, సాయంత్రం ఓ గంట రెస్ట్ తరువాత మళ్ళీ రాత్రంతా పని. రెండు పూటలు మాత్రమే తింటున్నాడని రెండు మూడుసార్లు చెప్పింది గీత.
ఓ సాయంత్రం తడుస్తూ వచ్చింది గీత.
వినయ్ : ఏంటి వర్షం పడుతుందా
గీత : మాములుగా కాదు, పైన బట్టలు తీసావా
వినయ్ : నాకసలు వర్షం పడుతుందని కూడా తెలీదు, ఉండు తెస్తా
గీత : నేనెళ్తాలే ఎలాగో తడిచా కదా అని వెళ్లి బట్టలు తెచ్చి ఇంట్లో ఆరేసింది.
కాసిన్ని మంచినీళ్లు తాగింది, అక్కడి నుంచి మొదలు ఒకటే తుమ్మడం. వినయ్ లేచి టవల్ చేతికి విసిరేసాడు.
వినయ్ : నేను తుడవనా ?
గీత ఒకలా చూసింది వినయ్ వంక. నేను తుడుచుకుంటాలే అనేసి లోపలికి వెళ్ళిపోయింది. వినయ్ అనవసరంగా అడిగానా అనుకున్నాడు.. మళ్ళీ పనిలో పడితే లేచింది తినడానికే
తెల్లారి లేచి చూస్తే టైము పదకొండు దాటింది. రోజూలానే లేచి బాత్రూంకి వెళుతుంటే గీత పడుకుని ఉంది. లేపలేదు. ఫోన్ చూస్తే మావయ్య నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి.
చందు : అత్తకి జ్వరం, రాత్రి ఒక్క టాబ్లెట్ ఉంటే వేసుకుంది కాని తగ్గలేదు. నువ్వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చివ్వు అలాగే తినడానికి కూడా ఏమైనా తెచ్చివ్వు అప్పటికి తగ్గకపోతే నేనొచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్తా
వినయ్ : సరే..
గీతకి మెలుకువ వచ్చి లేచి పక్కనే టాబ్లెట్స్ టిఫిన్ ఉండటం చూసింది. అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాడు వినయ్. లాప్టాప్ మీద నుంచి లేచి దెగ్గరికి వచ్చాడు.
వినయ్ : లేపితే లేవలేదు.. ఎలా ఉంది, హాస్పిటల్కి వెళదామా.. దెగ్గరికొచ్చి కూర్చున్నాడు
గీత : కొంచెం నీరసంగా ఉంది
నుదిటి మీద చెయ్యి వేసి చూస్తే కాలిపోతుంది.
వినయ్ : అనవసరంగా తడిచావ్. వర్షం వస్తే చాలు హీరోయిన్స్ లా ఫీలింగ్ మీకు. మీ అమ్మని పిలవనా ?
గీత : వద్దులే ఓపిక లేకపోతే నేను ఫోన్ చేస్తాను
వినయ్ : ఏమైనా కావాలంటే పిలుపు అని మళ్ళీ పని మీద పడ్డాడు
సాయంత్రం వరకు పడుకునే ఉంది గీత. లేచి కూర్చుంటే ఒంట్లో కొంచెం ఓపిక ఉన్నట్టు అనిపించింది. అంట్లు తొమేసి ఉన్నాయి, ఆరేసిన బట్టలు మడత పెట్టేసి ఉన్నాయి, ఇల్లు ఊడ్చేశాడు. చూస్తే లాప్టాప్ లో పని చేసుకుంటున్నాడు. వెళ్లి పక్కన కూర్చుంది.
గీత : నేను చేసుకునేదాన్ని కదా
వినయ్ : ఏదో జ్వరం వచ్చిందని చేశా అంతే.. నీ మీద నాకంత సింపతీ లేదు
గీత : ఎందుకో.. అంతగా కాని పని ఏం చేశానని
Next part
Next part