వినయ్ : పనుంది
గీత : తొక్కలో పని.. టైపింగ్ యేగా నువ్వు చేసేది
వినయ్ : వెళ్లి పని చూసుకో
వినయ్ ఆపకుండా పని చేస్తూనే ఉన్నాడు. మొదటిసారి.. వినయ్ అలా అనడం, లేచి వెళ్ళిపోయింది. రాత్రి వరకు జ్వరం పూర్తిగా తగ్గి బాగుంది గీత.
తిన్నాక వినయ్ పనిలో పడ్డాడు మళ్ళీ.. చందు గీతా రూములో లైట్ ఆపేసారు, తలుపు పెట్టేసి వచ్చాడు చందు. మంచం ఎక్కి ఫోన్ చూస్తుంటే కదిలించింది గీత.
గీత : వాడి విషయం ఏం చేద్దాం
చందు : ఏమైనా తప్పుగా చూడటం, తప్పుగా ప్రవర్తించడం లాంటివి చేశాడా
గీత : లేదు
చందు : మరి.. వాడే మర్చిపోతాడులే
గీత : నాకెందుకో సరిగ్గా అనిపించట్లేదు
చందు : హాస్టల్లో వేద్దామా మరి.. లేదంటే పంపించెయ్యనా ఇంట్లో నుంచి
గీత : ఏంటి అలా మాట్లాడతావ్ నువ్వు ?
చందు : నువ్వు అంత చనువు ఇచ్చావ్ కాబట్టే కదా వాడు అలా తయారు అయ్యింది.
గీత : నా తప్పా
చందు : కాదా.. ఎదిగే పిల్లలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదా.. నీ ఫోన్లో చూసా కదా వాడిని వాటేసుకుని ఫోటోలు దిగడాలు, ముద్దులు పెట్టడాలు. నీ చున్నీతొ వాడు ఆడుకోవటాలు అన్నీ చూసా నేను. ఒక్కసారి నాకే అనిపించింది మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉందేమోనని
గీత : ఇంక ఆపేయి..
గీత ఇంకో వైపుకి తిరిగి పడుకుంది. చాలాసేపటి మౌనం తరువాత చందు భుజం మీద చెయ్యేస్తే విసిరి కొట్టేసింది. అర్ధరాత్రి చందు పూర్తిగా పడుకున్నాక లేచి కళ్ళు తుడుచుకుంది. నీళ్ల కోసమని వెళ్లి చూస్తే వినయ్ లాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు, వాడి చేతులు లాప్టాప్ మీద లేవు, వాడి కళ్ళు వేరే వైపు చూస్తున్నాయి. గోడ మీద ఫోటో ఫ్రేమ్.. చందు, గీత దండలతొ నిలుచుంటే మధ్యలో వినయ్ మోకాళ్ళ మీద నిలుచున్న ఫోటో.. జూమ్ చేసి ఫ్రేమ్ చేశారు.
వినయ్ ఫోటో ఫ్రేమ్ చూసి నవ్వుతుంటే గీతకి ఆ రోజులు జరిగింది గుర్తొచ్చింది. చందు : గాడిద ఎత్తు ఉన్నావ్, మోకాళ్ళ మీద కూర్చో అని కసిరాడు.. దానికి కోపం వచ్చింది వినయ్ కి, చందుని పక్కకి తోసి దండ లాక్కుని వాడి మెడలో వేసుకుని గీత పక్కన నిలబడ్డాడు. గీత భుజం మీద చెయ్యేసి నువ్వు తీ అన్నా ఫోటో అని నవ్వుతుంటే చందు వినయ్ ని తన్ని దండ లాక్కుని వేసుకున్నాడు.
అదంతా గుర్తుకు రాగానే నవ్వొచ్చింది గీతకి, వినయ్ వంక చూస్తే వాడు కూడా నవ్వుకుంటున్నాడు. వినయ్ వంక బాధగా చూసి లోపలికి వచ్చేసింది.
ఫోనులో ఫోటోలు చూస్తూ ఒక్కోటి డిలీట్ చేస్తుంది. ఒక ఫొటోలో గీత మెడకి చున్నీ చుట్టి ఉరేస్తున్నట్టు, ఇంకో ఫోటోలో వెనక నుంచి వాటేసుకుని, ఇంకో ఫొటోలో తన ఒళ్ళో పడుకుని, అన్నీ వాడితోనే ఉన్నాయి. చాలా ఫోటోలు ఉండడం చూసి పిచ్చి లేచి సెలక్ట్ ఆల్ పెట్టేసి డిలీట్ కొట్టేసింది. గాలరీలో ఉన్న అన్ని ఫోటొలు డిలీట్ చేసేసింది.
తెల్లారి లేవగానే అడిగాడు చందు.
చందు : ఫోటోలు మొత్తం డిలీట్ చేసేసావ్. నిజాలు కప్పేస్తే అబద్దాలు అయిపోతాయా
గీత : అంటే నాకు వినయ్ కి మధ్య లింక్ ఉంది అంటున్నావా చందు
చందు : కాదు, నువ్వు ఫోటోలు ఎందుకు డిలీట్ చేసావ్ ?
గీత : వాడిని పెంచిన నీకే అనుమానం వచ్చింది అన్నావ్. ఇక బైట వాళ్ళు చూస్తే ఎందుకు అనుకోరు.. అందుకే తీసేసా
చందు : అన్ని ఫోటోలు తీసేసావ్
గీత : చాలా ఉన్నాయి, డిలీట్ ఆల్ కొట్టేసాను. నీ ఫోన్లో ఉన్నాయిగా
చందు : ఆఫీస్ కి వెళ్తున్నావా
గీత : వెళ్తాను, ఇంట్లో ఉంటే ఇంకా పిచ్చి ఎక్కిపోద్ది.
చందుని మాట్లాడనివ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. చందు వెళ్ళిపోయాక వినయ్ దెగ్గరికి వెళ్ళింది. పడుకుని ఉన్నాడు. వాడి ఫోన్ తీసి లాక్ తీస్తుంటే రాలేదు.
వినయ్ : ఏం కావాలి అత్తా నీకు
గీత : దీని లాక్ ఓపెన్ చెయ్యి అంటే చేసి ఇచ్చాడు
Next part
Next part