వినయ్ : దేనికి ?
గీత : నా ఫోన్లో ఫోటోలు డిలీట్ అయిపోయాయి నీ దాంట్లో ఉన్నాయి కదా
వినయ్ : లేవు.. మొన్న హ్యాంగ్ అయితే రిసెట్ కొట్టేసాను. అన్నీ పోయాయి.
చూస్తే నిజంగానే ఒక్క ఫోటో కూడా లేదు. గీతకి అర్ధమయ్యింది, ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది. రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళిపోయింది.
పన్నెండు తరువాత మావయ్యకి ఫోన్ చేసాడు.
చందు : చెప్పు
వినయ్ : ప్రాజెక్ట్ అయిపోయింది
చందు : అప్పుడే
వినయ్ : హా అయిపోయింది. నేను భద్రాచలం వెళదాం అనుకుంటున్నా
చందు : వీకెండ్ కలిసి వెళ్దాం
వినయ్ : లేదు నేను ఇప్పుడు వెళ్తాను
చందు : ఒక్కడివేనా
వినయ్ : ఫ్రెండ్స్ తొ వెళ్తా
చందు : సరే నీ ఇష్టం
వినయ్ : హా..
xxxxxxx
సాయంత్రం గీత వచ్చేసరికి వినయ్ లేకపోతే చందుకి ఫోన్ చేసింది.
చందు : వాడు ఫ్రెండ్స్ తొ భద్రాచలం వెళ్ళాడు
గీత : నాకు చెప్పలేదు, ఫోన్ చేస్తే ఎత్తలేదు కనీసం.
చందు : ఫ్రెండ్స్ తొ ఉన్నాడేమోలే
గీత : బండి నువ్వేసుకెళ్ళావా ?
చందు : లేదు.. ఇంటి ముందే ఉందిగా
గీత : లేదు..
చందు ఫోన్ కట్ చేసి వినయ్ కి చేసాడు ఎత్తలేదు. బండి మీద ఉండుంటాడు అందుకే ఎత్తలేదు అంటే బండి ఏసుకుని వెళ్ళిపోయాడు.
సాయంత్రం ఫోన్ చేసాడు వినయ్
చందు : బండి ఎందుకు తీసుకెళ్ళావ్
వినయ్ : ఫ్రెండ్స్ ని అడిగితే రామన్నారు. నేనొక్కడినే కదా అని బండి తీసుకెళ్లా
చందు : ఒక్కడివే బండి మీద అంత దూరం.. నీకేమైనా బుర్ర పని చేస్తందా
వినయ్ : జాగ్రత్తగానే ఉంటా
చందు : నీ మొహం.. భద్రాచలం లేదు ఏం లేదు వెనక్కి వచ్చేయి నువ్వు
వినయ్ : ఆల్మోస్ట్ వచ్చేసా నేను
చందు : రేపు సాయంత్రం వరకు ఇంట్లో ఉండాలి నువ్వు
వినయ్ సరే అని పెట్టేసాడు. చందుకి మాత్రం చాలా కోపం వచ్చింది.
భద్రాచలం వెళ్లినవాడు మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చాడు. చందు వినయ్ ని ఏమనకపోయినా మాట్లాడటం మానేశాడు. వినయ్ కి కూడా ఇంట్లో వాతావరణం మారిపోయింది ఇంతకముందులా లేదని అర్ధమయ్యింది. కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాడు.
ఇంకో నాలుగు రోజుల్లో గీత పుట్టినరోజు. ఎలాగైనా మళ్ళీ సంతోషంగా ఉండాలని చందు అటు గీతని ఇటు వినయ్ ని ఇద్దరినీ కలుపుకుని మాటలు మొదలుపెట్టారు. ఎంత ప్రయత్నించినా వినయ్ విషయంలో గీత ఎలా ఫీల్ అవుతుందో వినయ్ కూడా అలానే ఫీల్ అవుతున్నాడు. ఇంతకముందులా ప్రేమగా ఉండటం అనేది జరగదు అని ముగ్గురికి తెలుసు. ఎవరిలో వాళ్ళు మదన పడుతున్నారు.
గీత పుట్టినరోజు రానే వచ్చింది. గీత వాళ్ళ అమ్మ వాళ్ళతొ కలిసి చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు చందు. అత్తా మావయ్య ఇద్దరు నవ్వుతూ కేక్ కట్ చేస్తుంటే ఫోటోలు తీస్తున్నాడు వినయ్.
గీత కేక్ కట్ చేసి చందుకి తినిపించి ఇంకో ముక్క తీసి వినయ్ వంక చూసింది.
చందు : మీ అమ్మా నాన్నకి పెట్టు అని ముందుకు తోసాడు నవ్వుతూ
చివరిగా వినయ్ వచ్చి కేక్ తీసి గీత నోటికి పెడుతుంటే అప్పుడు చూసాడు మావయ్య మొహంలో రంగులు మారడం. వినయ్ చందు వంక చూస్తుంటే గీత లేట్ అవ్వకుండా వినయ్ చేతుల్లో కేక్ తినేసి చందు వైపు చూసింది. చందు నవ్వాడు.
చందు : వినయ్ ముగ్గురం సెల్ఫీ తీసుకుందాం
అలాగే అన్నాడు కానీ ఈ సారి ఎప్పటిలా మధ్యలో వెళ్లి నిలబడలేదు. గీత చందుకి ఆ పక్క ఉంటే వినయ్ ఈ పక్కకి వచ్చి నిలుచున్నాడు. వినయ్ నవ్వు మొహం పెట్టినా చందు బానే నటిస్తున్నా గీత మాత్రం నటించలేకపోయింది. ఇంకో ఫోటో తీసుకుందాం అంటుండగానే లోపలికి వెళ్ళిపోయింది గీత.
అందరు భోజనాలకి కూర్చున్నారు.. చాపల కూర.. వినయ్ తినలేడు. అయితే చందునో లేక గీతనో వలిచి పెడితే కానీ తినలేడు. ఇద్దరు చందునే చూస్తున్నారు. గీత వాళ్ళ అమ్మ వడ్డించగానే పులుసు కలుపుకుని తనే చాప ముళ్ళు తీసుకుని తినేసాడు. తిన్నాక ఒక్క నిమిషం కూడా ఆగలేదు, లేచి ప్లేట్ సింకులో వేసి బైటికి వస్తే కానీ ఊపిరి ఆడినట్టు లేదు. మళ్ళీ గీత వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళకుండా ఇంటికి వచ్చేసి మంచం ఎక్కాడు.
కాసేపటికి గీత వచ్చింది. చూసి నవ్వాడు.
వినయ్ : అప్పుడే తినేశావా ?
గీత : లేదు.. మావయ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఒక్కడివే ఉన్నావని వచ్చేసాను.
వినయ్ : మరీ అంత మర్యాద ఎందుకులే
గీత : నాకు గిఫ్ట్ ఏం తెలేదా.. ప్రతీ సంవత్సరం ఏదో ఒకటి ఇస్తావ్ గా
వినయ్ నవ్వుతూ లేచి గాజు తీసి ఇచ్చాడు. నవ్వుతూ తీసుకుంది.. ఎర్రది మట్టి గాజు, మధ్యలో చిన్న అద్దం అందులో గీతా love చందు అని రాసి ఉంది. వినయ్ వంక చూస్తే పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి.. నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి.. పండగ జరగాలి అని పాడుతుంటే ఆపుకోలేక నవ్వేసింది గట్టిగా.. ఒక అడుగు ముందుకు దెగ్గరికి వెయ్యగానే వినయ్ వెనక్కి జరిగాడు.
థాంక్స్ అంది.
వినయ్ : కాసేపు పడుకుంటా తల నొప్పిగా ఉంది, నిద్రొస్తుంది అని మాట్లాడుతూనే కళ్ళు తిరిగి పడిపోయాడు.
పడిపోతుండగానే పట్టుకుంది గీత, వినయ్.. వినయ్.. ఏమైంది.. గట్టిగా వాటేసుకుని మంచం దాకా తీసుకొచ్చింది. మంచం మీద పడుకోబెడుతూ తను కూడా వినయ్ మీద పడిపోయింది. అప్పుడే చందు లోపలికి వచ్చాడు.
చందు : ఏమైంది ?
గీత : కళ్ళు తిరిగినట్టున్నాయి.. తలనొప్పిగా ఉంది పడుకుంటా అని చెపుతూనే పడిపోయాడు
చందు వెళ్లి డాక్టర్ ని తీసుకొస్తే చూసాడు డాక్టర్.
Next part
Next part