3 రోజెస్ Part 2 13

చందు : తనే నేను ప్రేమించిన అమ్మాయి.. ఎలా ఉంది సుప్రైస్ అని అడుగుదామనుకున్నాను కాని నువ్వు ఆల్రెడీ గీత వాళ్ళ అమ్మతొ మాట్లాడేసావని తెలిసింది.

నాకేమని బదులు ఇవ్వాలో తెలీలేదు, లోపలికి వచ్చి బ్యాగ్ విసిరేసి కూర్చుంటే ఇద్దరు నా చెరో పక్క కూర్చున్నారు.

గీత : అలిగావా.. సారీ.. నీకు చెప్పకపోవడం తప్పే

వినయ్ : ఈ లోకంలొ నాకు ఇష్టమైన వాళ్ళు మీ ఇద్దరే అన్న సంగతి మీకూ తెలుసు, మీరిద్దరూ ఒకటి అవుతారంటే నాకంటే ఎక్కువ సంతోష పడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అది కూడా మీకు తెలుసు, అయినా నా దెగ్గర దాచారు. మీరు కాకుండా వేరేవాళ్ళు నాకు చెపుతుంటే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా అంటుంటే గీతా, చందు ఇద్దరు వినయ్ ని దెగ్గరికి తీసుకున్నారు.

చందు : లేదురా నీకే మొదట చెప్పాలని అనుకున్నాం, కానీ నువ్వు చిన్నపిల్లాడివి కదా బైటికి చెప్పేస్తే ఎక్కడ దాని వల్ల బాధ పడాల్సి వస్తుందో, గీత వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎక్కడ గీతా నేను దూరం అయిపోతామేమోనని భయమేసింది, అందుకే దాచాం. ఇప్పుడు చెప్పు నువ్వు వద్దు అంటే ఇప్పుడే వదిలేస్తా గీతని అని లేచి నిలబడ్డాడు.

వినయ్ : వదిలేయి అయితే..

చందు : నిజంగా సీరియస్.. నీకు నచ్చలేదంటే నాకు అస్సలే వద్దు

వినయ్ : పో మావయ్యా అని లేచి బైటికి వెళ్ళిపోయి మెట్లక్కి కూర్చుంటే గీత వచ్చి పక్కన కూర్చుంది.

గీత : వినయ్.. అస్సలు నేను మీ మావయ్యకి నచ్చడానికి కారణమే నువ్వు తెలుసా.. ఆ రోజు మీ మావయ్య జైల్లో ఉన్నప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియకపోయినా నేను నిన్ను నా దెగ్గర పడుకోబెట్టుకున్నానని నా మీద అభిమానం పెంచుకున్నాడు. నాతొ స్నేహం పెరిగాక మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నామని తెలిసాక మీ మావయ్య నన్ను అడిగినది ఏంటో తెలుసా.. రేపు పెళ్ళైనా నిన్ను ఇలాగే ప్రేమగా చూస్తానా లేదా అని.

తన ప్రతీ పనిలో, ఆలోచనలో నిన్నెప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. మన ఇద్దరినీ అంత స్నేహం చేయించింది కూడా అందుకే.. నా వల్ల లేదా తన వల్ల నీకు బాధ కలగకూడదని మన ఇద్దరినీ ఫ్రెండ్షిప్ చేసేలా చేసాడు. అందుకే మనం ఇద్దరం ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు అడిగినా కాదనకుండా పంపేవాడు. నిజం చెప్తున్నా మీ మావయ్యకి నాకన్నా నువ్వుంటేనే ఇష్టం.

వినయ్ : ఆ విషయం నాకు తెలుసులే

గీత : నువ్వింత బాధ పడతావ్ అని మేము ఊహించలేదు వినయ్.. సారీ..

వినయ్ : బాధ కాదు కానీ.. నాకు ఎవరో చెప్పేసరికి అలా అనిపించింది, మీ అమ్మే అనుకో.. అయినా కూడా.. సరే పదండి పార్టీ చేసుకుందాం.

గీత : చెప్పు.. నువ్వేక్కడికంటే అక్కడికి అంటుంటే చందు కూడా బైటికి వచ్చాడు.

వినయ్ : నీ లాకెట్ ఇవ్వు అని అడిగితే గీత నవ్వింది, చందు కూడా నవ్వుతూ తీసి ఇస్తే అది చూస్తూనే గీతని గట్టిగా గిచ్చాడు. అరుస్తూనే లేచి చందు పక్కకి వచ్చేసింది. నాకు టైం వచ్చినప్పుడు నేనూ చెప్తా మీ సంగతి అని గీత కోసం చూస్తుంటే చందు మధ్యలో అడ్డు పడ్డాడు, చందు నడుముని కూడా గట్టిగా గిచ్చేసాడు కసితీరా

ముగ్గురు ఆయాస పడుతూ లోపలికి వెళ్లి కూర్చుంటే వినయ్ లేచి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు.

వినయ్ : ఇంతకీ పెళ్లి ఎప్పుడు

చందు : త్వరగానే మంచి ముహూర్తం ఉంటే పెట్టేస్తాం అన్నారు

2 Comments

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *