పెద్దమ్మ Part 23

మినీ బస్ విత్ లేడీ డ్రైవర్ …….
థాంక్యూ కమిషనర్ సర్ – డాడీ ……..
కమిషనర్ సర్ : ఇది మినీ బస్సు మాత్రమే కాదు లోపల అన్నీ ఫెసిలిటీస్ తో కూడుకున్న చిన్నపాటి మూవింగ్ హౌస్ …… , మీ అన్నయ్య కోరికప్రకారం మీకోసం – మీ అక్కయ్యల కోసం ప్రత్యేకంగా రెడీ చేయించాను .
చెల్లెళ్లు : Wow లవ్ యు sooooo మచ్ డాడీ అంటూనే నన్ను హత్తుకుని ముద్దులు కురిపించారు .
దేవత : కష్టపడింది మీ డాడీ అయితే ముద్దులు మాత్రం మీ అన్నయ్యకా ? .
కమిషనర్ సర్ : ప్లాన్ – ఐడియా మొత్తం బుజ్జిదే ….. బుజ్జిహీరోదే కాబట్టి ముద్దులుకూడా ……..
దేవత : ఎందుకో ఏమిటో మీ ఫుల్ సపోర్ట్ ఈ అల్లరి పిల్లాడికే ఉంటుంది – మీ ముద్దులన్నీ కూడా లాగేసుకుంటున్నా కనీసం ఫీల్ కూడా అవ్వరు .
కమిషనర్ సర్ : I ఎంజాయ్ …… , తల్లులు …… బుజ్జిహీరోకు ఎన్ని ముద్దులుపెడితే అంత సంతోషం …… , ఎన్ని ముద్దులుపెడితే రుణం తీరేను …….
దేవత : ఋణమా ……… ? .
కమిషనర్ సర్ : అలా అన్నానా లేదే అంటూ చెల్లెళ్ళవైపు చూసి నవ్వుకున్నారు .

అంతలో ఒక ఆమె వచ్చి అక్కయ్యకు సెల్యూట్ చేసి అక్కయ్య చేతిలోని కాలేజ్ బ్యాగ్ అందుకున్నారు .
అక్కయ్య : మీరు ……. ? .
ఆమె : నా పేరు మల్లీశ్వరి – 24/7 మీకు తోడుగా ఉండబోతున్న సెక్యూరిటీ కావ్య మేడం …….
అక్కయ్య : తమ్ముడూ …… అంటూ చెల్లెళ్లను ప్రక్కకు లాగేసి ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
చల్లెళ్లు నవ్వుకుని అక్కయ్యా ….. మేముకూడా అంటూ మాఇద్దరినీ గట్టిగా చుట్టేశారు .

దేవత : చెల్లీ ……. this is too bad , నువ్వు కూడానా ……. థాంక్స్ చెప్పాల్సినది కమిషనర్ సర్ కు కదా అంటూ మమ్మల్ని విడదీశారు .
థాంక్యూ దేవతా అంటూ చెల్లెళ్లు …… నన్ను హత్తుకుని నవ్వుతున్నారు .
అక్కయ్య …… దేవత గుండెలపైకి చేరి మావైపు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు – ఎంజాయ్ చెల్లెళ్ళూ …… మీ అన్నయ్యకు , నాముద్దులు కూడా పెట్టండి .
చెల్లెళ్లు : అలా అన్నారు బాగుంది , అన్నయ్యా ……. ఇవి మా ముద్దులు – ఇవి అక్కయ్య దేవత ముద్దులు …….
దేవత : నా ముద్దులు ……. ఆ అల్లరిపిల్లాడికి ఎందుకు క్యాన్సిల్ క్యాన్సిల్ ……..

బామ్మ : వద్దులే తల్లులూ క్యాన్సిల్ చేసేయ్యండి – తెగ ఫోజ్ కొడుతోంది – అతి తొందరలోనే నేను నేను అంటూ మిమ్మల్ని తోసేయ్యడానికి వస్తుంది అప్పుడు మీరు ఒక ఆట ఆడుకోండి – బుజ్జిహీరోకు ముద్దులుపెట్టడం ఎంత అదృష్టమో అప్పుడు తెలిసొస్తుంది మీ అక్కయ్యకు …….
దేవత : బామ్మలూ ……. మీరుకూడానా ? .
బామ్మలు : మీ చెల్లెళ్ళలా …… మా తొలిప్రాణం మా బుజ్జిహీరో ఆ తరువాతనే ఎవరైనా …….
నో నో నో బామ్మలూ ……..
బామ్మ : నో అన్నా yes అన్నా అదే నిజం – నీ తొలిప్రాణం …… నీ దేవత అయినప్పుడు , మా అందరి తొలిప్రాణం నువ్వే …….
చెల్లెళ్లు : అవునవును లవ్ యు బామ్మలూ …….
మిస్సెస్ కమిషనర్ : అవునవును …….
అక్కయ్య : లేదు లేదు నా తమ్ముడిలా …… నా తొలిప్రాణం మాఅక్కయ్య అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టారు .
బామ్మలు : మీ అక్కయ్య కోప్పడుతుందని అలా అపద్దo చెబుతున్నావుకానీ నీ ప్రాణం ఎవరో ఇక్కడున్న అందరికీ తెలుసులే ……..
లేదు లేదు బామ్మలూ ……. అక్కయ్య తొలిప్రాణం దేవతనే నాకు తెలుసు .
బామ్మలు : నీ దేవత సంతోషం కోసం ఏమైనా చేస్తావని మాకు తెలుసులే …….
అక్కయ్య : తమ్ముడి ఇష్టమే నా ఇష్టం అంటూ దేవతను మరింత గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు .
బామ్మలు : అలా చెప్పు – మాకు తెలుసులే …….
దేవత : నాకంతా తికమకగా ఉంది చెల్లీ …….
బామ్మ : పేరుకి మేడం – ఈ మాత్రం కూడా అర్థం కాలేదు . ఇంతకూ నీ ప్రాణం ఎవరు చెప్పు …….
దేవత ……. అక్కయ్య – చెల్లెళ్ళవైపు చూసి , బుజ్జిదేవుడు అన్నారు .
అంతే విజిల్స్ – సంతోషపు కేకలు – చప్పట్లతో దద్దరిల్లింది .
అక్కయ్య – చెల్లెళ్లు : సూపర్ సూపర్ కొద్దిరోజుల్లో అంతా మారిపోతుందిలే అక్కయ్యా – దేవతా అంటూ చెల్లెళ్లు కూడా వెళ్లి దేవతను చుట్టేశారు , దేవతకు ముద్దులే ముద్దులు …… , మేముకూడా అదే చెబుతున్నాము మనందరి తొలిప్రాణం బుజ్జిదేవుడు – అతి త్వరలో ……

దేవత : మీ ఇండైరెక్ట్ మాటలు నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు వదిలెయ్యండి ఏమైనా అంటే చాలు కొద్దిరోజుల్లో – అతి త్వరలో అంటారు , చెల్లికి తోడుగా మల్లీశ్వరి ఉండబోతున్నారు అని తెలిసాక కానీ మనసు కుదుటపడలేదు – అన్నీ ముందుగా భలేగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు – expext చెయ్యనేలేదు – చెల్లి గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు థాంక్యూ థాంక్యూ సర్ ……
కమిషనర్ సర్ : ఈ నిర్ణయం ……..
సర్ సర్ …….
కమిషనర్ సర్ : ప్చ్ …… , అవంతికా …… ఈ నిర్ణయం మీ ప్రాణమైన బుజ్జిదేవుడు తీసుకున్నది – నేను జస్ట్ అమలుపరిచాను అంతే …….
థాంక్యూ సర్ అంటూ పెదాలను కదిపాను .
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిదేవుడా …… , చెల్లీ ….. చాలా చాలా సంతోషం వేస్తోంది , ఇంకా మన గురించే ఆలోచిస్తున్నాడు అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దు ……. , అలానే చెల్లెళ్లకు కూడా కమిషనర్ సర్ ……
చెల్లెళ్లు : అన్నయ్య ఉండగా మనకు సెక్యూరిటీ ఎందుకు దేవతా …….
దేవత : అల్లరి చెయ్యకుండా ఉంటే చాలు ……
అక్కయ్య : అదృష్టం అంటే మీదే చెల్లెళ్ళూ – అక్కయ్యా ……. అంటూ నావైపు ప్రాణంలా చూస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *