ఆది – Part 3

రమేష్ : చెప్పు.

రాము : ఇప్పుడు నాకు ఒక జాబ్ కావాలి, నీకు వదిన దెగ్గర కావాలి రెండిటికి నా దెగ్గర ఒక ప్లాన్ ఉంది.

రమేష్ : ముందు నా ప్లాన్ చెప్పు.

రాము : నన్ను వదినకి పరిచయం చేసి తనకోసం డ్రైవర్ ని తెచ్చా ఒంటరిగా డ్రైవ్ చెయ్యడం సేఫ్ కాదు అని చెప్పి ఒప్పించు దానితో వదినకి నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావని ఒక మంచి అభిప్రాయం కలుగుద్ది, ఇక నేను వదిన దెగ్గర జాయిన్ అయ్యాక నిన్ను తన దెగ్గర మోసే పనిలో ఉంటా నీ గురించి గొప్పగా చెప్పి నీ ప్రేమలో పడేలా చేస్తా… ఏమంటావ్?

రమేష్ : నువ్వు చెప్పిందంతా బానే ఉంది కానీ దీని వల్ల నీకేంటి లాభం?

రాము : ఏదో అన్నా… నీకోసం ఇంత చేస్తున్నా నాకోసం అప్పుడప్పుడు కొన్ని పై డబ్బులు ఇవ్వలేవా?

రమేష్ : యూ ఇంటెలిజెంట్ బాయ్ … రేపు వచ్చేయ్ మాట్లాడదాం. అని రమేష్ వెళ్ళిపోయాడు.

రాము పిచ్చి పిచ్చిగా నవ్వుకుని లోకంలో ఇలాంటి ఎర్రిమాలోకం గాళ్ళు కూడా ఉంటారని అనుకుని వెళ్ళిపోయాడు.

లంబసింగిలోకి ఎంటర్ అయ్యి చిన్న టెంట్ ఒకటి బుక్ చేసుకుని ఎదురుగా బైక్ పార్క్ చేస్తున్నాను, అంతా గోల గోలగా ఉంది కాలేజీ స్టూడెంట్స్ అనుకుంటా హడావిడి చేస్తున్నారు, రాత్రి వరకు వెయిట్ చేసి ట్రక్స్ వచ్చే టైంకి బండి రెడీగా పెట్టి సుస్సు పోసుకుని వచ్చి చల్లటి గాలిలో మంట ముందు కూర్చుని బీర్ వేస్తున్నాను… ఇంతలో వెనక నుంచి ఒక అమ్మాయి గొంతు..

“విక్రమ్ నువ్వింకా వెళ్ళలేదా?” అని.

వెనక్కి తిరిగాను…

“ఏంటి నువ్వు మందు తాగుతావా?”

ఆదిత్య : అవును ఇదే నా ఆఖరి మందు బాటిల్ ఇవ్వాల్టితొ మందు మానేస్తున్నాను అని ఆఖరి సిప్ వేసి బాటిల్ పక్కకి పెట్టి తన దెగ్గరికి వెళ్లాను…

ఆ అమ్మాయి నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది, ఏమైందో అని దెగ్గరికి వెళ్లాను… ఎవడో నా బైక్ అందుకుని సడన్ గా స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు..

ఆదిత్య : రేయ్ నా బైక్…

ఆ అమ్మాయి నా ముందుకి వచ్చి బండి తీసుకెళ్లిన వాడిని చూస్తూ “తను విక్రమ్ అయితే నువ్వెవరు?” అంది.

ఆదిత్య : నా పేరు ఆదిత్య, ఇంతకీ ఆ విక్రమ్ ఎవరు? అస్సలు నువ్వెవరు?

“నా పేరు మానస., కానీ మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నారు ఇదీ ఎలా సాధ్యం” అంది.

ఆదిత్య : తాగింది నువ్వా నేనా?

మానస : నిజం అండి కావాలంటే చుడండి అని ఫోన్ తీసింది.

ఇంతలో రెండు సుమోలు అందులోనుంచి పది మంది కర్రలు రాడ్లతొ దిగారు వాళ్ళని చూస్తూ ఆ అమ్మాయిని పట్టించుకోకుండా అటు వెళ్ళాను….

అక్కడున్న రౌడీలని కొట్టి అమ్మాయిలని రక్షించిన తరువాత, మానస ద్వారా అచ్చు నాలానే ఉండే విక్రమ్ ని కలుసుకున్నాను. నా కంటే వయసు తక్కువ వాడు కానీ వాడి ఆలోచనలు చేసే పనులు మాటలు అన్ని పెద్ద వయసు వారికి మల్లె ఉన్నాయి, ఒకానొక సమయంలో అన్నా అని పిలవబోయి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అది నాకు నచ్చలేదు.

అమ్మాయిలని డీసీఎం లోకి ఎక్కించి వారికి ధైర్యం చెప్పి, వారిని ఇంటికి చేర్చుతానని మాటిచ్చి బండి హైవే మీదకి ఎక్కించాను ఇంతలో ఫోన్ వచ్చింది. చూస్తే రాము.

ఆదిత్య : చెప్పు రాము.

1 Comment

  1. హలో పబ్లిషార్ నివ్వు ఎం స్టోరీస్ పెడుతున్నావు.. సెక్స్ స్టోరీస్ టైటిల్ పెట్టుక్కని లవదా లో స్టోరీస్ పోస్ట్ చేస్తున్నావు

Comments are closed.