డిన్నర్ చేశాక నాకు ఒక మ్యాట్, పిల్లో మరియు బెడ్షీట్ ఇచ్చి టెర్రస్ మీద పడుకో బాబు ఇల్లు చిన్నది కదా అన్నారు. నేను సరే ఆంటీ అని చెప్పి వెళ్ళాను. దోమలు ఉన్నాయ్ కానీ తక్కువే ఉన్నాయి. నేను మ్యాట్ మీద పడుకొని అలా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను ప్రశాంతం గా. అపుడే సరయి వచ్చింది. టేబుల్ ఫ్యాన్ తీసుకొని. నువ్వు ఎందుకు అలా ఉన్నావు కూల్ గా ఉండు అంది. ఏమి లేదు కొత్త ప్లేస్ కదా మరియు నాకు ఎవరూ తెలియదు కదా అందుకే అన్నాను. తను నాతో అలా ఏమి అనుకోకు ఒక్క రోజు అంతే కదా రేపు రాత్రి కి వెళ్ళిపోతాం అంది. నేను తనతో అంటే రేపు పగలు అంతా ఇక్కడే ఉండాలా అని అడిగాను. అవును అంది. నేను తనతో ఉండలేను నేను పొద్దున్నే వెళదాం రాత్రికి ఇంటికి వెళ్ళిపోతాం కదా అన్నాను. రోజూ అంతా ప్రయాణం కష్టం కదా అంది. ఏమి కాదు ప్లీస్ ఏదో ఒకటి చెప్పు వెళ్లిపోవాలి పొద్దున్నే అన్నాను. తను సరే అయితే నేను మాట్లాడి వస్తాను అని వెళ్ళింది. కొంచెం సేపు తరువాత వచ్చింది. నేను ఒప్పించాను పొద్దున్నే 5 గంటలకి బస్ ఉంది అంట ఓకె నా అంది. హా సరే థాంక్స్ అని చెప్పాను. ఇక పడుకో పొద్దున్నే వెళ్ళాలి కదా అంది. గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. నాకు నిద్ర రావడం లేదు. 15 రోజుల తరువాత కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇక పడుకున్న బాగా ట్రై చేసి.
పొద్దున్నే 3:30 కి లేపి రెడీ అవ్వమన్నారు. లేచి రెడీ అయ్యి బస్ స్టేషన్ కి వెళ్ళాము. వాళ్ళ రిలేటివ్స్ తనని ఒక సీట్ లో నన్ను వేరే సీట్ లో కూర్చో పెట్టి ఊరికి వెళ్ళాక ఫోన్ చేయండి అని చెప్పి వెళ్లి పోయారు.
బస్ స్టార్ అయ్యాక నేను పడుకున్న. ఒక గంట తరువాత సరయు నన్ను పిలిచి తన పక్క సీట్ లోకి రమ్మంది. ఎవరో భార్యా భర్తలు పైర్ గా వస్తే. సరే అని తన పక్కన కూర్చున్న. తను నాతో మాట్లాడటం మొదలు పెట్టింది.
సరయి – నువ్వు ఎందుకు అంత భయపడతావు
నేను – అలా ఏమి లేదు కదా
స – చాలా మొహమాటం కదా
నే – అలా కాదు. కొత్త వాళ్ళతో ఎక్కువ మాట్లాడను
స – నేను కూడా కొత్త నా నీకు
నే – నేను వచ్చి 7 నెలలు అంతే కదా
స – అవును నీ లాగే కొత్తగా జాయిన్ అయిన జయంత్ ని చూసావా అందరితో బాగా కలిసి పోయాడు
నే – నాకు కొంచెం సిగ్గు ఎక్కువ
స – సిగ్గు కాదు అది గర్వం. బాగా చదువుతాను అనే గర్వం
నే – ఛీ అలా కాదు అలా ఎప్పటికీ అనుకోకు
స – అలానే అనుకుంటున్నారు కాలేజ్ లో
నే – అయ్యో అలా కాదు
స – నాతో కూడా సరిగ్గా మాట్లాడవు కదా
నే – నీకు నా మీద కోపం గా ఉంది అని చెప్పారు అందుకే
స – ఎవరు చెప్పారు అలా
నే – అంటుంటే విన్నాను
స – ఫస్ట్ లో ఉండేది కోపం కానీ అది కోపం కాదు. అది ఒక బాధ లాంటిది. నువ్వు ఫస్ట్ వచ్చి నా ప్లేస్ ని తీసేసుకున్నావ్ అని అంతే
నే – అందుకే నీతో మాట్లాడలేదు
స – సరే నీ గురించి చెప్పు
నే – ఏముంది చెప్పడానికి
స – మీ అమ్మ నాన్న అలా చెప్పు
నే – మా నాన్న రైతు. అమ్మ నాన్నని సహాయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ బాబాయ్ దగ్గర ఉంటున్న అంతే. నీ గురించి చెప్పు
స – మా నాన్న అమ్మ ఇద్దరు గవ్నమెంట్ ఎంప్లాయీస్. ఒక అక్క ఒక తమ్ముడు అంతే
నే – తనని ఎపుడు అబ్జర్వ్ చేయలేదు. గుడ్ ఫిజిక్. తెల్లగా బాగుంది.
మన క్లాస్ లో చాలా మంది లవర్స్ ఉన్నారు కదా
స – అవును నీకు బాగానే తెలిశాయి కదా
నే – తెలుస్తాయి కదా. నీకు ఎవరు లేరా మరి
స – లేరు అబ్బా. నాకు ఇష్టం లేదు అలా
నే – అవునా నిన్ను కుడా లవ్ చేసేవాళ్ళు ఉన్నారు మన క్లాస్ లో
స – తెలుసు కానీ వాళ్ళకి నా దగ్గరకి వచ్చి నాకు ప్రపోజ్ చేసే సీన్ లేదు లే
నే – హా తెలుసు నువ్వు ఫైర్ బ్రాండ్ కదా
స – హ్మ్మ్ టిఫిన్ చేద్దామా
నే – బస్ డ్రైవర్ స్టాప్ చేస్తాడు కదా ఎక్కడ అయినా హోటల్ దగ్గర
స – మా బంధువులు పార్సిల్ ఇచ్చారు
నే – అయితే నువ్వు తిను. నేను హోటల్ దగ్గర తింటాను
స – ఇద్దరికీ ఇచ్చారు
నే – ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టావు
స – నేను వద్దు అనే చెప్పాను కానీ వల్లే చేశారు
నే – సరే అయితే ఓపెన్ చెయ్
సరయు బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చింది. చపాతి ఉంది నేను పొద్దున్నే చపాతీ తినను. తనకి అదే చెప్పాను.
స – అవునా నాకు తెలియదు కదా. బస్ హోటల్ దగ్గర స్టాప్ చేసినపుడు తిను అయితే
నే – సరే ను తిను ఇపుడు
స – నేను కూడా అపుడే తింటాను
నే – ఏమి కాదు నీకు ఆకలిగా ఉన్నట్టు ఉంది తిను
స – అంటే నువ్వు ఒక్కడివే తినకుండా నేను ఎలా తినాలి
నే – ఏమి కాదు తిను
తను సరే అని బాక్స్ నుంచి చపాతి తీసి స్లో గా తింటుంది.తనకి వాటర్ కావాలి అంటే తీసి ఇచ్చాను
స – ఒక్క పీస్ తిను నాకు ఒక్కదానికే ఏదోలా ఉంది
నే – నేను ఏమి అనుకోను కదా
స – ప్లీస్ అని నా నోట్లో పెట్టింది.(మా క్లాస్ లో కామన్ అమ్మాయిలు అబ్బాయిలు అలా తినిపించుకింటారు. బట్ నాకు కొత్త)
నే – బాగుంది టేస్ట్
స – చపాతి నేనే చేశాను కర్రీ ఆంటీ వాళ్ళు చేశారు
నే – నైట్ పడుకోలేదు కదా మీరు
స – లేదు 3 కి లేచాము అని ఇంకో పీస్ పెట్టింది
నే – బాగుంది నిజంగా