అను – Part 5 361

తను సన్నగా నవ్వి, మీ పేరు వినయ్ కుమార్, ఏజ్ 45, గ్రాడ్యుయేషన్ చేసి కొన్ని స్పెషలైజేడ్ సబ్జెక్ట్స్ పై డిప్లొమాలు చేశారు, అడ్మినిస్ట్రేషన్ లో మీకు చాలా గ్రిప్ ఉంది, అందుకే సర్వీస్ లో త్వరగా పైకి వచ్చారు, మీరు ఏ సంబంధాన్ని త్వరగా వదులుకోరు అంది.

మీకు ఉన్నతంగా ఎదగాలని ఉంది, దానికోసం ఎంతైనా కష్టపడి సాధిస్తారు, మీరు కోరుకున్నది దక్కకపోవడం ఇప్పటి వరకు జరగలేదు, తోటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు వెనుకాడరు అంది.

నా మైండ్ బ్లాక్ అయిపోయి తన వైపు బిత్తరపోయి చూస్తున్న, వృత్తి పరంగా నేను వేల మందిని డీల్ చేసుంటాను, కానీ మొదటిచూపులోనే ఎదుటి మనిషిని అంచనా వేసిన తన ప్రతిభకు ముగ్ధున్ని అయ్యాను.

తెరుకుంటు నా చరిత్ర మొత్తం స్టడీ చేసారా అన్నాను.

తను చిరునవ్వుతూ మా ఆయన బాస్ మీరు అని చెప్పారు, ఇంటికి వచ్చాక మీ మంచితనం గురించి రోజు చెప్పేవారు, నాకు ఇంట్రెస్ట్ అనిపించి మీ గురించి కొంత మీ దగ్గర పనిచేసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్న 100% వాళ్ళు నిజం చెప్పారు అని నాకు ఇక్కడకు వచ్చాక తెలిసింది అంది.

మై గాడ్, మీతో జాగ్రత్తగా ఉండాలి, అవలిస్తే పేగులు లెక్కపెట్టేలా ఉన్నారు అంటూ కాస్త భయం నటించాను.

హాయిగా నవ్వి అలా ఏమీ లేదు సర్ అంది.

ముగ్గురం భోజనం కలిసి చేసాం, ఉన్ని ఎక్కువ మాట్లాడలేదు, మా ఇద్దరి మధ్య ప్రేక్షకుడు ఆయ్యాడు.

భోజనం తర్వాత మళ్ళీ మేము కూర్చుని మాట్లాడుకున్నాము, LKG నుండి P.hd వరకు, సినిమాల నుండి రాజకీయాల వరకు మా ఇద్దరి మధ్య రాని సబ్జెక్ట్ లేదు.

తన విషయ పరిజ్ఞానం చూసి ముచ్చటవేసింది,

తన వయసు మహా అంటే 27 ఉండొచ్చు, కళ్ళలో విజ్ఞానం, ముఖంలో ప్రశాంతత, కడలికల్లో హుందాతనం, చీరకట్టులో అణకువ, మాటలో మర్యాద ఇలాంటివి చాలా తక్కువ వాళ్ళల్లో కనబడతాయి.

మేము మొదటిసారి కలుసుకున్నట్లు కాక ఎన్నో ఏండ్ల పరిచయం ఉన్నట్లు అనిపించింది, నేను తనకు చాలా ప్రభావితమయ్యాను.

ఉన్ని నిద్రలో జోగుతున్నాడు, నేను ఉన్ని వైపు చూసి టైం చూస్తే 12.30 అవడం చూసి ఆశ్చర్యపోయాను.

దాదాపు 4 గంటల పైన మేము మాట్లాడుకుంటున్నాము.

ఉన్ని పరిస్థితి చూసి సరే అనుపమ మేడం, ఇక నాకు సెలవా అన్నాను.

తాను కూడ ఉన్ని వైపు చూసి అర్ధం చేసుకుని నో అనుపమ మేడం, కేవలం అను అని పిలవండి, ఇప్పుడు మనం ఫ్రండ్స్ అంది.

ఐతే మీరు కూడా నన్ను వినయ్ అని పిలవాలి అన్నాను,

సరే వినయ్, రేపు మళ్ళీ కలుద్దాం, గుడ్ నైట్ అంటు చేయి చాపింది.

గుడ్ నైట్ అను అంటూ నేను కూడా తనతో చేయి కలిపాను, తన చేయి చాలా మృదువుగా ఉంది.

బై

బై

3 Comments

  1. Koncham story length ga raydi

  2. Original story name cheppandi.. konni parts thisesaru kada andhukosam

  3. Remaining story update cheyandi

Comments are closed.