1. అక్కా… అతనొచ్చాడు.
నిషా “హలో అక్కా…. అతనొచ్చాడు”
కాజల్ “ఎవరే…?”
నిషా “అతనూ…”
కాజల్ “హబ్బా… ఎవరో సరిగా చెప్పూ… నేను డ్రైవింగ్ లో ఉన్నాను”
నిషా “అతనూ… అక్కా అతనూ… ”
కాజల్ “ఇంటి వొనర్ ఆ… ఫోన్ పే చేస్తా అని చెప్పూ”
నిషా “కాదక్కా…. అతనూ…”
కాజల్ “ఎవరే… ఏంటి అంత హడావిడి… ముందు సరిగా చెప్పూ”
నిషా “డబ్బులు తీసుకోని వచ్చాడు”
కాజల్ “డబ్బులా ఏం డబ్బులు….”
నిషా “అబ్బా… నీకూ అసలు ఏం గుర్తు ఉండదా…”
కాజల్, కార్ హార్న్ కొడుతూ “షిట్ ఎవరో చెప్పూ… నేను ట్రాఫిక్ లో ఇరుక్కున్నా”
ఫోన్ అతను తీసుకొని కాజల్ తో “నేనూ..” అన్నాడు.
కాజల్ “ఎవరు మీరు నాకు గుర్తుకు రావడం లేదు”
అతను “నేను మేడం… మూడు నెలల క్రితం కలిశాం… ఒక డీల్ చేసుకున్నాం. డబ్బులు తీసుకున్నాను”
కాజల్ “ఏం డీల్… నాకు గుర్తుకు రావడం లేదు”
అతను “పర్సనల్ డీల్”
కాజల్ “మీరు బ్యూటి పార్లర్ మనిషా”
అతను “కాదు”
కాజల్ “మరి మీరు ఎవరండి?”
అతను “నేను క్రిష్ ని…”
కాజల్ “క్రిష్…. ఏ క్రిష్”
అతను “మూడు నెలల క్రితం… డబ్బు అడ్వాన్స్ తీసుకున్నాను…. పర్సనల్ డీల్… గుర్తు వచ్చానా”
కాజల్ “సారీ సర్ నాకు గుర్తు లేరు… కొంచెం మా చెల్లికి ఫోన్ ఇస్తారా..”
నిషా “హలో”
కాజల్ “ఎవరినీ పడితే వాళ్ళను ఇంట్లోకి రానిస్తున్నావ్… బయటకు పంపు అతన్ని… అసలు నవ్వు…”
నిషా “అక్కా.. అక్కా… లౌడ్ స్పీకర్ లో ఉంది” అంటూ ఫోన్ నార్మల్ లోకి తెచ్చుకొని మాట్లాడుతూ “హుమ్మ్…. అతను వెళ్తున్నాడు”
కాజల్ “పోనీ….”
నిషా “నువ్వు ఇలా ఉంటావ్ అని అనుకోలేదు”
కాజల్ “నేను ఇంతే లే వదిలేయ్…. హుమ్మ్… థాంక్ గాడ్… ట్రాఫిక్ క్లియర్ అయింది… నేను వచ్చేస్తున్నా…”
నిషా “సరే… రా… వేడి నీళ్ళు పెట్టాను. నీకూ ఇష్టమైన పాలక్ కర్రీ వండాను.. తినేసి స్నానం చేసి, దుప్పటి తన్ని పడుకుందాం ”
కాజల్ “దుప్పటి తన్ని పడుకోక ఇంకేం చేస్తాం… అయినా ఏంటో మన జీవితాలు… US వెళ్ళిన మొగుళ్ళు మనల్ని మోసం చేయడం ఏంటో… విడాకులు ఇవ్వకుండా అక్కడ నుండి రాకుండా అక్కడే ఉండిపోవడం ఏంటో… సరే అని మనం ఇక్కడ ఒకణ్ణి రమ్మంటే, డబ్బు తీసుకొని పారిపోయాడు… వాడు కనిపిస్తేనా…”
నిషా “అక్కా….”
కాజల్ “ఏంటి అంతలా అరిచావ్”
నిషా “ఏంటి? ఏంటే… పనికి మాలిన దానా… ఇప్పుడు నీతో ఫోన్ లో మాట్లాడింది అతనే…”
కాజల్ “అతను అంటే.. అతనా…”
నిషా “అవునూ… అతనే”
కాజల్ “ఫాస్ట్… ఫాస్ట్… అతన్ని పట్టుకో…. మన డబ్బులు… అసలు ముందు వాడిని తల పగలకోట్టాలి”
నిషా “సరే… ఉండు… నేను బయటకు వెళ్లి చూస్తాను”
కాజల్ “ఉన్నాడా…”
నిషా రొప్పుతూ “లేడక్కా…”
కాజల్ “ఆహ్… రేయ్ నీ యబ్బా కార్ అడ్డు తీయ్యరా… రోడ్ ఏమైనా నీ బాబు గాడి జాగీరా… తియ్… సాలె”
నిషా “ఎంత సేపట్లో వస్తావ్… నేను సందు చివరికి వచ్చి చూశాను లేడు”
కాజల్ “సందు ఆ చివర… అటు ఉన్నాడేమో… వెళ్లి చూడు”
నిషా “నీ యమ్మా.. సరే ఉండు చూస్తున్నా” అంటూ పరిగెత్తింది.
కాజల్ “నేను వచ్చేసాను”
నిషా ఒళ్లంతా చమటలతో “నీ యమ్మా… ఇంటి వరకు వచ్చిన వాడిని పంపించి నా చేత బజార్లు అన్ని వెతికించావ్”
కాజల్ “దొరకలేదా”
