కాజల్ “తినే ఉంటాడు లే…”
నిషా కోపం ఆపుకుంటూ పైకి కాజల్ వైపు చూసింది.
కాజల్ “పాపం జేబులో డబ్బులు ఉన్నాయో లేదో… డబ్బులు లేక… భోజనం చేయక పోతే…” అంది.
నిషా, కాజల్ మొహాన్ని తీక్షణంగా చూస్తుంది.
కాజల్ “ఆకలితో ఉండిపోయి ఉంటాడా” అంది.
నిషా, కాజల్ మొహాన్ని చూస్తూ కోపం పోయి జాలి అనిపించింది.
కాజల్ “ఆకలి అనిపించి వస్తాడేమో… ఎక్స్ట్రా వండావా” అంది.
నిషా, కాజల్ ని చూస్తూ సున్నితంగా మాట్లాడితే పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది అని అర్ధం అయి “లేదు…” అని విసుగ్గా చెప్పి, ప్లేట్ ని సింక్ లో పడేసి చేతులు కడుక్కుంది.
కాజల్ తన ముందు ఉన్న గిన్నె లో ఫుడ్ చూసి తన ప్లేట్ లోది కొంచెం వెనక్కి పెట్టింది.
నిషా గొంతు కటినంగా “ఫుడ్ మిగిలింది అంటే చంపేస్తాను” అని హుకుం లా వినిపించింది.
కాజల్ భయం భయంగా ప్లేట్ లో పెట్టుకొని తింటుంది.
కొద్ది సేపటికి కాజల్ తన ప్లేట్ తీసుకొని వచ్చి సింక్ లో పడేసింది.
నిషా తల నుండి కారుతున్న చమట చీర పవిటతో తుడుచుకుంటూ అంట్లు తోముతూ ఉంది.
కాజల్ వెళ్లి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది.
నిషా పని అవ్వగోట్టుకొని వచ్చి సోఫాలో తన అక్క పక్కనే కూర్చుంది.
కాజల్ మెల్లెగా జారి నిషా వొళ్ళో తల పెట్టుకొని పడుకుంది.
కాజల్ “నేనిక అతని గురించి ఆలోచించను…” అంది.
నిషా ఏమి మాట్లాడలేదు.
కాజల్ “నిజంగా నిజం…. అస్సలు ఆలోచించను” అంటూ కళ్ళు మూసుకుంది.
నిషా టీవీ ఆన్ చేసింది.
కాజల్ “ప్రామిస్.. నీకూ తెలుసుగా నేను మాట అంటే మాట”
నిషా టీవీ చూస్తుంది. కాజల్ మాటలకు రెస్పొంద్ అవ్వలేదు. తన చేతులు తన అక్క భుజం పై వేసి ఉంచింది.
కాజల్ “ఎదో ఒకటి చెప్పూ” అంది.
నిషా చిన్నగా “మ్” అంది.
కాజల్ తనకు తాను సర్దుకొని పడుకుంది.
** కొద్ది నిముషాల తర్వాత **
కాజల్ సడన్ గా పైకి లేచి నిషా కళ్ళలోకి షాక్ గా చూస్తూ ఉంది.
నిషా “ఏమయింది?”
కాజల్ “వాడోచ్చాడు” అంది.
నిషా బ్రెయిన్ ఇంకా తన అక్క బిహేవియర్ లో వచ్చిన మార్పునే ప్రాసెస్ చేస్తుంది.
కాజల్ ఒక్క సారిగా నవ్వేసి “వాడోచ్చాడు… వాడోచ్చాడు… ఇప్పుడెలా… ఇప్పుడెలా… ” అని చుట్టూ చూసుకుంటూ ఉంది.
నిషా అయోమయంగా ఉంటే ఇంటి కాలింగ్ బెల్ మోగింది.
కాజల్ హడావిడిగా పైకి లేచి నిషాతో “డైరక్ట్ గా రూమ్ లోకి వస్తాడేమో, మాటల్లో పెట్టు… ఒక అయిదు నిముషాలు… ఏంటి… సరేనా” అని ఆర్డర్ వేసి నట్టు వేసి గదిలోకి వెళ్ళిపోయింది.
నిషా అయోమయంగా కాజల్ వెళ్ళినవైపే చూస్తూ ఉంటే కాలింగ్ బెల్ మళ్ళి మోగింది.