నిషా “వస్తున్నా” అని కేకేసి వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా క్రిష్ రెండు బ్యాగ్ లు పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఒకటి పెద్ద ట్రాలీ బ్యాగ్ సూట్ కేస్ లా మోస్తున్నాడు. మరొకటి భుజానికి తగిలించుకొని ఉన్నాడు. అది కూడా పెద్దగానే ఉంది.
నిషా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, తన ఆశ్చర్యాన్ని బ్రేక్ చేస్తూ తనను తప్పుకొని లోపలకు వచ్చాడు.
క్రిష్, నిషా వైపు చూస్తూ చమటలు తుడుచుకుంటూ “వాటర్ ప్లీజ్” అని అడిగాడు.
నిషా “హుమ్మ్” అంటూ వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది.
క్రిష్ చిన్న కర్చీఫ్ తో తన మెడ దగ్గర, నుదిటి పైన అయిన చమటలు తుడుచుకుంటూ ఉన్నాడు.
నిషా తనను చూస్తూ ఉంటే, క్రిష్ చూపు తన వెనక ఉంది, అందుకే క్రిష్ చూపును అనుసరించి వెనక్కి తిరిగి చూసింది.
కాజల్ పల్చటి వైట్ కలర్ పై, పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న సిల్క్ సారీ కట్టుకొని సిగ్గుపడుతూ తమ వైపే వస్తుంది. ఎదో మొగుడి కోసం ఎదురు చూస్తున్న పెళ్ళాం లా ఆ జడలో పూలు, నిండుగా గాజులు వేసుకొని, నడుము తిప్పుకుంటూ నడుచుకొని వస్తుంది.
క్రిష్ ఆదుర్దాగా కాజల్ దగ్గరకు వెళ్లి, “ఏంటి నీ దగ్గర ఎదో మెడిసెన్ వాసనా వస్తుంది” అంటూ దగ్గరకొచ్చి ఆమె నుదిటి మీద చేయి వేసి “ఎలా ఉంది” అన్నాడు.
కాజల్ “లైట్ గా ఫీవర్, ఇప్పుడు బాగానే ఉంది” అంది.
క్రిష్ “టాబ్లెట్స్ వేసుకున్నావా…. నిన్ను నువ్వు పట్టించుకోవాలి కదా ఏంజెల్” అన్నాడు.
కాజల్ తిప్పుకుంటూ “నువ్వు లేవు కదా… నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు… నిషా కూడా నన్ను చూసి విసుక్కుంది” అని కంప్లైంట్ చేసింది.
నిషా తన అక్క నటనాకౌశల్యం చూసి నోరు తెరిచింది.’
12. నా ఇష్టం
క్రిష్ “అబద్దాలు చెప్పకు…. ఆడపిల్లలు పుడతారు… నిషా నిన్ను బాగా చూసుకుంటుంది” అన్నాడు.
నిషాకి క్రిష్ మాటలు విని హాయిగా అనిపించింది.
కాజల్ కి మాత్రం కోపం వచ్చింది. బుంగ మూతి పెట్టి, అలిగినట్టు సోఫాలో కూర్చుంది.
నిషా “ముందు వెళ్లి స్నానం చెయ్” అంది.
క్రిష్ రెండు బ్యాగులు లాక్కొని వెళ్తూ గదిలో పెట్టుకొని స్నానం కోసం బాత్రూం లోకి వెళ్ళాడు.
కాజల్ తనతో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టు కోపంగా కూర్చొని ఉంది. పావు గంట గడిచింది అలానే ఉంది.
నిషా “వెళ్దామా గదిలోకి, నిద్ర పోవడానికి” అంది.
కాజల్ కోపంగా “ఏంటే, ఇంతకు ముందు ఎదో అన్నావ్ నన్నూ… పైగా అతని మందు నవ్వుతున్నావ్… చెప్పూ ఏంటి?” అంది.
నిషా “వెధవ డ్రామాలు వేయకు… నువ్వు కోపంగా ఉన్నావని నేను వెళ్తే క్రిష్ గదిలోకి దూరదాం అనేగా నీ ప్లాన్” అంది.
కాజల్ దొరికి పోయిన దొంగలా మొహం పెట్టినా వెంటనే “హా! ఏంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా… హా!” అంది.
నిషా “గుర్తు ఉంది కదా…. నువ్వేం చిన్న పిల్లవి కాదు అనేది గుర్తు ఉంది కదా… నీకూ అసలే బాగాలేదు, కాబట్టి నా దగ్గరకు వచ్చి పడుకో…. లేకపోతే…” అని వెళ్ళిపోయింది.
కాజల్ “హా! లేకపోతే…”
నిషా ఈవిల్ లా నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది.
కాజల్ కోపంగా “రాక్షసి” అనుకుంటూ నిషాని గొంతు పిసుకుతున్నట్టు పోజ్ పెట్టింది.
అప్పుడే గది నుండి బయటకు వచ్చిన క్రిష్ కాజల్ ని తన చేష్టలను చూసి నవ్వాడు.
నిషా వెనక్కి తిరిగి చూసి ఎదో జరిగింది అని అర్ధం అయినా పట్టించుకోకుండా క్రిష్ దగ్గరకు వచ్చి “తనకు ఫీవర్ గా ఉంది, గుర్తు పెట్టుకో…” అంటూ వేలు చూపించి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది.
కాజల్ స్పీడ్ గా తన దగ్గరకు వచ్చి, “ముందు నీ ఫోన్ నెంబర్ చెప్పూ” అంటూ నెంబర్స్ ఎక్సచేంజ్ చేసుకుంది.
క్రిష్ తన ఫోన్ లో “ఏంజెల్” అని సేవ్ చేస్తే… కాజల్ తన ఫోన్ లో “మై లవ్లీ పెట్” అని సేవ్ చేసుకుంది.
** ** **
ఇద్దరూ బెడ్ పై పక్కపక్కనే కూర్చున్నారు.
కాజల్ “ఎక్కడకు వెళ్ళావ్”
క్రిష్ “బ్యాగ్ లు తెచ్చుకోవడానికి…”
కాజల్ “హుమ్మ్” భామా ఎవరో తెలుసుకోవాలని మనసు ఉవ్విళ్లూరుతుంది.
క్రిష్ “రేపు షాపింగ్ వెళ్దాం వస్తావా”
కాజల్ “ఎక్కడకు…. నేను మంచిగా సెలక్ట్ చేస్తాను. నాకు తెలిసి కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. డిస్కౌంటు కూడా ఇస్తారు”
క్రిష్ “రిలాక్స్”
కాజల్ “ఏంటి?”
క్రిష్ “బైక్ కొనాలి అనుకుంటున్నా… కాలేజ్ కి వెళ్ళడానికి”
కాజల్ “ఓహో…. అయినా కాలేజ్ కి బట్టలు వేసుకొని వెళ్ళరా… నేను నిన్ను షాపింగ్ కి తీసుకొని వెళ్తాను”
క్రిష్ “వద్దు”
కాజల్ కొంచెం బాధ పడింది.
క్రిష్ “ఇప్పుడు వద్దు, త్వరలో నా పుట్టిన రోజు ఉంది”
కాజల్ “అవునా… ఎప్పుడూ”
క్రిష్ “XX-XX”
కాజల్ “ఇంకా ఇరవై రోజులు ఉన్నాయ్… గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం”
క్రిష్ “గ్రాండ్ …. ఎవరినీ పిలుస్తావ్”
కాజల్ ఆలోచించి ఆగిపోయింది.
క్రిష్ “నా మైండ్ లో వేరే సెలబ్రేషన్ ఉంది, కాకపోతే నువ్వు ఒప్పుకోవాలి”