నిషా చెవి ఆనించి మరీ… క్రిష్ ఏం చెబుతాడా అని వినాలని అనుకుంది. ఎప్పుడు అక్క తనని అడిగే ప్రశ్న.
క్రిష్ “నీకేం చేయాలని అనిపిస్తుంది…” అన్నాడు. ఆ సమాధానం కాజల్ కే కాదు నిషా కి కూడా షాకింగ్ గా అనిపించింది.
కాజల్ ఏం మాట్లాడలేదు.
క్రిష్ గొంతు “నీకం చేయాలనీ అనిపిస్తుంది” అని మళ్ళి అడిగాడు.
కాజల్ చిన్న గొంతుతో “సారీ చెప్పాలని ఉంది”
క్రిష్ “అయితే చెప్పూ, కాని నిజాయితీగా తప్పు ఒప్పుకొని చెప్పూ…… ఎందుకంటే నువ్వు ఎంత చెప్పినా ఏం చేసినా మనం అన్న మాట వల్ల అయిన గాయం మానిపోదు కాని కొంచెం అయినా తగ్గించే ప్రయత్నం చేద్దాం” అన్నాడు.
నిషాకి ఆ సమాధానం బాగా నచ్చింది.
కాజల్ “మ్మ్” అంది.
క్రిష్ “నీ మనసులో ఏమనుకుంటున్నావో…. నిక్కచ్చిగా నిజాయితీగా వెళ్లి చెప్పూ…” అన్నాడు.
కాజల్ కాన్ఫిడెంట్ గా నవ్వుతూ “మ్మ్ అలానే చేస్తా” అంది.
క్రిష్ మరియు కాజల్ ల ముద్దుల శబ్దం వినపడింది.
కాజల్ “థాంక్ యు” అంది.
నిషా నవ్వుకుంటూ టైం చూసుకొని “అమ్మో బ్రేక్ ఫాస్ట్ లేట్ అయిపోతుంది” అనుకుంటూ కంగారుగా వెళ్ళిపోయింది.