కాలేజ్ బాయ్ Part 1 100

11. సిగ్గు లేని జన్మ

నిషా “సిగ్గు ఉందా నీకసలు… అసలేం చేస్తున్నావో తెలుస్తుందా…” అని గట్టిగా అరుస్తుంది.

చేతులు రెండు నడుము మీద పెట్టుకొని కోపంగా కాజల్ వైపు చూస్తూ అరుస్తుంది. కాజల్ మంచంపై ముడుచుకొని కూర్చుంది.

కాజల్ “సారీ” అంది.

నిషా “ఏంటే సారీ…. అసలేం చేస్తున్నావో తెలుస్తుందా… ఇలా ప్రవర్తించడానికి నువ్వేమైనా టీనేజ్ అమ్మాయివా…” అని అరిచింది.

కాజల్ ఏమి మాట్లాడకుండా తల దించుకొని ఉంది.

నిషా “అలా మూగ మొద్దులా కుర్చుంటావే… చెప్పూ” అని అరిచింది.

కాజల్ “కాదు”

నిషా “ఏం కాదు”

కాజల్ విసుగ్గా “నేనేం టీనేజ్ అమ్మాయిని కాదు.. ఓకే నా”

నిషా “అతను ఎవరు?”

కాజల్ “ఎవరు?”

నిషా “క్రిష్”

కాజల్ “అతను క్రిష్”

నిషా “అతను ఒక కాల్ బాయ్…”

కాజల్ “హుమ్మ్” అని తలని మోకాళ్ళలోకి దించేసుకొని తల ఊపింది.

నిషా మోకాలు మడిచి కాజల్ పక్కనే మంచం పై కూర్చుంటూ “కాల్ బాయ్ అంటే…. ఇవ్వాళ నువ్వు… రేపు మరొకరు… నిన్నటి వరకు ఇంకెవరో” అంది.

కాజల్, మెల్లగా ఏడుస్తున్నట్టు ఎక్కిళ్ళు పెడుతూ “అవునూ” అంది.

నిషా, కాజల్ భుజం మీద చేయి వేసి “అతన్ని ప్రేమించడం నీకే నష్టం, ఇంకెప్పుడు ఇలా చేయకు…”

కాజల్, కళ్ళ నీళ్ళతో నిషా వైపు చూస్తూ “నేనేమి అంత బలహీనురాలీని కాదు, నీకూ అక్కని” అంది.

నిషా “అవునూ” అంటూనే మనసులో “నువ్వు మళ్ళి హార్ట్ బ్రేక్ అయితే నిన్ను చూస్తూ ఉండడం నా వల్ల కాదు” అనుకుంది.

కాజల్ “సరే, ఏమైనా తిందాం పదా…”

డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ “మగవాళ్ళకు ఎలా పడితే అలా తినే ఆడవాళ్ళూ నచ్చరు అంట” అంటూ ప్లేట్ లో అంతా పెట్టుకొని రెండు చేతులు హ్యాండ్ స్లీవ్స్ వెనక్కి మడుచుకొని, ఎలా పడితే అలా తింటుంది.

నిషా తనను చూస్తూ చిన్నగా తింటుంది.

కాజల్ తింటూ తింటూ మధ్యలో “క్రిష్ ఒక కాల్ బాయ్ కదా… నేను తినక పోతే ఎందుకు పట్టించుకున్నాడు, కలిపి ముద్దలు చేసి నోట్లో కూడా పెట్టాడు” అంది.

నిషా తననే చూస్తుంది.

కాజల్ తనలో తానె నవ్వుకుంటూ “పిచ్చోడు” అంది.

నిషా తనని చూస్తూ తల అడ్డంగా ఊపి తన ప్లేట్ ఫుడ్ తను తింటుంది.

కాజల్ “నేను తిట్టినా కూడా, విసుక్కున్నా కూడా ఏమి అనలేదు… నవ్వుతూ సరే అని వెళ్ళిపోయాడు”

నిషా తల కూడా ఊపలేదు, పట్టించుకోకుండా ఉంది.

కాజల్ “డబ్బు కోసం ప్రేమించే వాడు, ప్రేమని అమ్మే వాడు” అని కోపంగా పిడికిలి బిగించి మరీ అంది

నిషా తల ఎత్తి కాజల్ ని చూసి మళ్ళి తల దించుకుని తన పని తను చూసుకుంటుంది.

కాజల్ “మరీ ఎక్కువ తిట్టేసాను అంటావా…. అందుకే వెళ్ళిపోయాడా” అంది.

నిషా తల దించుకొని తన పని తను చూసుకుంటుంది.

కాజల్ “పోతే పోనీ… ఏమైపోతే నాకేంటి?…. హుమ్మ్” అని విసుక్కుంది.

నిషా తల ఎత్తనుకూడా లేదు.

కాజల్ “తిన్నాడో లేదో…”

నిషా కోపం ఆపుకుంటూ పిడికిలి బిగించింది.