కాలేజ్ బాయ్ Part 10 19

64. క్యారక్టర్

అందరూ వెళ్ళగానే ఒక్క మౌస్ పై ఉన్న తన చేయి చిన్నగా వణికింది. ఎందుకంటే…. తను అసలు ఏ మ్యూజిక్ వినడం లేదు. అతనా గురించి అందరూ క్యారక్టర్ లెస్ అనుకుంటున్నారు అని తెలిసి బాధ పడింది.

సుహాస్ అందరితో కలిసి చిన్న మీటింగ్ రూమ్ లో ఉన్నాడు.

ఒకతను ముందుకు కాజల్ వచ్చి పిచ్చిగా మాట్లాడాడు.

సుహాస్ “నేను నీ మొహం మీద గుద్దితే నొప్పిగా ఉంటుందా” అన్నాడు.

అతను కోపంగా “కొట్టి చూడండి…. ఇక్కడ నుండి కూడా కదలరు” అన్నాడు.

సుహాస్ “పోనీ.. నిన్నూ” అంటూ ఈషా వైపు తిరిగాడు.

ఈషా అయోమయంగా పైగా ఆశ్చర్యంగా “సర్” అంది.

సుహాస్ “జస్ట్ చెప్పూ…. నొప్పిగా ఉంటుందా”

ఈషా “ఉంటుంది” అని అక్షరాలను విడి విడిగా పలికింది.

సుహాస్ “ఓకే… ఉంటుంది…”

సుహాస్ “ఇప్పుడు చెప్పండి… ఆ నొప్పితో కూడా మీరు నవ్వుతూ మాట్లాడగలరా….”

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.

సుహాస్ “మీరు అందరూ అనుకున్నట్టుగా ఆమె అలాంటిది కాదు…. తను ఒక డొమెస్టిక్ వయోలెన్స్ కి విక్టిం… ”

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.

ఒకతనూ “కానీ సర్… అలాగని అఫైర్ పెట్టుకుంటారా….”

సుహాస్ చేతులు అడ్డం చూపించి తను చెప్పడం మొదలు పెట్టాడు “తన చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంది. అ అబ్బాయికి ఒక అన్నయ్య ఉన్నాడు తనకు పెళ్లి అయితే వీళ్ళు జంట అవుతారు… సో ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్యకి మేడంని కలిపి పెళ్లి చేశారు. చెల్లెలు తన భర్తతో హ్యాపీగా ఉంది కాని తన పరిస్థితి మాత్రం….. ప్చ్…. మేడం గారి భర్త… ఒక రేప్యుటేడ్ డాక్టర్…. అలాగే ఒక సైకో….”

ఈషా “మరీ…” సుహాస్ “రోజు…. చేతి పై దెబ్బలు కవర్ చేసుకునేలా హ్యాండ్ మొత్తం కవర్ అయ్యే బట్టలు… నేక్ కవర్ అయ్యేలా మొహం పై పెద్ద కళ్ళజోడు మాస్క్ పెట్టుకొని వచ్చి ఏమి జరగనట్టు నవ్వుతూ పలకరించేది”

ఈషా “ఎవరికైనా చెప్పొచు కదా…. పోనీ…. విడాకులు తీసుకోవచ్చు కదా…”

సుహాస్ “తనతో పాటు తన చెల్లి కూడా లింక్ అయింది… ఏదైనా తేడా జరిగితే…. ఇద్దరి కాపురాలు కూలుతాయి…. పైగా విషయం తన అత్తగారికి చెప్పింది కాని ఉపయోగం లేదు”

ఈషా “మరీ…”

సుహాస్ “ఒక రోజు తన చెల్లి వచ్చే టైం కి మేడం స్పృహ తప్పి ఉంది…. ఆ రోజు ఆఫీస్ కి కూడా రాలేదు. చెల్లికి భయం వేసి హాస్పిటల్ లో చూపిస్తే… డొమెస్టిక్ వయోలెన్స్ అని చెప్పి ట్రీట్ మెంట్ చేశారు. అండ్….. తను ఇక జన్మలో తల్లి కాలేదు”

అందరూ షాకింగ్ గా చూస్తూ ఉన్నారు.

సుహాస్ “వాళ్ళ చెల్లి వచ్చి పోట్లాడింది. అందుకు గిఫ్ట్ మేడం గారి భర్త… తమ్ముడుకు కూడా చెప్పి అక్కచెల్లెళ్ళు ఇద్దరికి విడాకులు కేస్ వేశారు. ప్రస్తుతం కేసులు రన్ అవుతున్నాయి”

ఈషా “ఓహ్…”

సుహాస్ “సరిగ్గా ఈ మధ్య కాలంలో మేడం ఒకరిని ఇష్ట పడింది…. తప్పంటారా….” అన్నాడు.

ఈషాని చూస్తూ “అవునూ మీ మేడం కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. హస్బెండ్ లేడు…. విడాకులు…. ఓకే…”

అందరూ తల దించుకున్నారు.

సుహాస్ “తెలిసి తెలియకుండా ఎప్పుడూ ఎవ్వరిని అపార్ధం చేసుకోవద్దు” అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *