కాలేజ్ బాయ్ Part 10 19

చాటుగా మొత్తం విని కాజల్ అక్కడ నుండి వెళ్ళిపోయి తన సీట్ లో కూర్చుంది.

అందరూ వచ్చి ఆమెనూ చూస్తూ వెళ్లి తా క్యాబిన్ లలో కూర్చున్నారు.

ఆమె చేతులు వణకడం ఆగడం లేదు.

క్రిష్ నుండి ఫోన్ “బేబి…. ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది…. ఎక్కడకు అయినా వెళ్దాం”

కాజల్ “తీసుకెళ్ళు…. నేను వచ్చేస్తా…”

క్రిష్ “ఏమయింది…. ఎందుకు అలా ఉన్నావ్?”

కాజల్ “త్వరగా రా…. ఎంత సేపు పడుతుంది”

క్రిష్ “నేను… నీ ఆఫీస్ పార్కింగ్ దగ్గరకు వచ్చా…. నా బైక్ ఇక్కడ పార్క్ చేయొచ్చు కదా…. కారులో వెళ్దాం”

కాజల్ “వద్దు….. బైక్ పై వెళ్దాం….” చుట్టూ చూస్తూ “అందరూ చూస్తూ ఉండగా…”

క్రిష్ “నువ్వు ఓకే నా….”

కాజల్ “మనం ఎవ్వరికి భయపడొద్దు….. మనం లవర్స్”

క్రిష్ “సరే… త్వరగా కిందకు రా…”

కాజల్ పైకి లేచి గబా గబా బయటకు వెళ్ళిపోయింది.

సరాసరి క్రిష్ దగ్గరకు వెళ్తూనే అతడిని హాగ్ చేసుకొని ఏడ్చేసింది.

65. బంధం – అనుబంధం

క్రిష్ ముందు రోజు నిషాతో సెక్స్ చేయడం వల్లే ఏడుస్తుంది అని అనుకోని, సారీ చెబుతూ…. ఇంకెప్పుడు అలా జరగదని అలాగే డ్రింక్ తాగనని చెబుతాడు.

కాజల్ నవ్వేసి అతని బండి ఎక్కుతుంది. అలా ఇద్దరూ రోడ్ పై బైక్ పై వెళ్తూ ఉంటారు.

సాయం సాయంత్రం వేళ ట్రాఫిక్ మధ్యలో నుండి బైక్ నడిపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటే ఆమె అతడిని చూస్తూ “ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావ్” అని అడుగుతుంది.

క్రిష్ చుట్టూ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని వెనక్కి తిరిగి “ఎవరూ లేని ఒక మారుమూల ప్రాంతానికి… ఆ…” అని నవ్వుతాడు.

కాజల్ అతని నెత్తి మీద కొడుతుంది.

క్రిష్ బండి నడుపుతూ ఉంటే అతన్ని గట్టిగా పట్టుకొని వీపు పై వాలిపోయి కళ్ళు మూసుకుంటుంది.

కళ్ళు తెరిచే సరికి ఒక కిడ్స్ పార్క్ లో ఉంటారు.

తనను తీసుకొని వెళ్లి ఒక బెంచ్ పై కూర్చో పెడతాడు. చుట్టూ పిల్లలు అందరూ జారుడు బండల మీద ఆడుతూ… ఉయ్య్యాల ఊగుతూ… ఇంకా చాలా రకాల ఆటలు ఆడుతూ కనిపిస్తారు.

కాజల్, క్రిష్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే…. క్రిష్ “ఇక్కడే ఉండు… ఇప్పుడే వస్తా” అని అంటాడు.

క్రిష్ వెళ్లి సుమారు అయిదు నిముషాలు అవుతుంది. కాజల్ ఆలోచనల నుండి బయటకు వచ్చి తన ముందు చిన్నపిల్లలు ఆడుకోవడం, ఒకరిని ఒకరు తోసుకోవడం అలాగే తిట్టుకోవడం చూస్తుంది.

వెంటనే లేచి వెళ్లి వాళ్ళను ఆపుతుంది. అలాగే అలా చేయకూడదు అని చెబుతుంది. అంతలోనే కింద పడ్డ వాడు ఏడుస్తూ ఉంటాడు. అతడిని లేపి కూర్చోబెట్టి మాట్లాడుతుంది.

ఆ తర్వాత చుట్టూ చూస్తూ పిల్లలు మరియు వాళ్ళ పేరెంట్స్ ని చూస్తూ మాట్లాడుతూ వాళ్ళలో కలిసిపోతుంది.

సుమారు అరగంట గడుస్తుంది. క్రిష్ కోసం చుట్టూ చూస్తే దూరంగా ఉన్న ఒక బెంచ్ పై కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటాడు. కొద్ది సేపు తర్వాత…

కాజల్ నడుచుకుంటూ వెళ్లి అతని దగ్గర కూర్చొని “ఇప్పుడే వస్తా…. అని ఇక్కడ కూర్చున్నావా” అంటుంది. క్రిష్ సీరియస్ గా చదువుకుంటూ “ష్” అని డిస్ట్రబ్ చేయొద్దు అని చేయి అడ్డం పెడతాడు.

క్రిష్ చదువుకుంటూ ఉంటే, కాజల్ అక్కడే కూర్చున్నా వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంది. ఆమెకు బోర్ అని అనిపించడం లేదు.

క్రిష్ బుక్ మూసేసి ఆమెనే చూస్తూ ఉన్నాడు. కాజల్ ఒక సారి మళ్ళి వెనక్కి తిరిగి క్రిష్ వైపు చూసి తననే చూస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయి “అయిపోయిందా” అంటుంది.

క్రిష్ నవ్వేసి “హుమ్మ్” అంటాడు. కాజల్ “వెళ్దామా” అంటుంది. క్రిష్ “హుమ్మ్” అని పైకి లేపి, బయటకు కాకుండా…. మరో వైపు తీసుకొని వెళ్తాడు. కాజల్ “ఎక్కడికి?” అని రెండు సార్లు అడిగినా అతని చేయి పట్టుకొని వెళ్ళిపోతుంది.

ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. క్రిష్ “మనం కూర్చొని బాధపడాలా… లేక, బయటకు వచ్చి సంతోషంగా నవ్వుకోవాలా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి” అంటాడు.

కాజల్ ఏమి అర్ధం కాక “హుమ్మ్” అంటుంది.

క్రిష్ “నాకు బాధ అనిపించినపుడు… ఇక్కడకు వచ్చేస్తాను… ఎంత బాధ ఉన్నా…. కష్టం ఉన్నా కొద్ది సేపు మర్చి పోయి మామూలు అయిపోతాను.. హాయిగా నవ్వుకుంటాను… మైండ్ మొత్తం పీస్ గా అనిపిస్తుంది. అలాగే ఏదైనా బాధ కూడా వెళ్ళిపోతుంది”

కాజల్ “హుమ్మ్… అప్పుడు చదివితే బాగా గుర్తు ఉంటుంది”

క్రిష్ నవ్వేసి “ఇప్పుడు చెప్పూ”

కాజల్ “ఏం చెప్పాలి” అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పట్టుకొని అడుగుతుంది.

క్రిష్ “కవరింగ్ ఆపేసి చెప్పూ” అంటాడు.

కాజల్ కొంచెం హార్ట్ అయినట్టు ఫేస్ పట్టినా అతడి చేయి పట్టుకొని నలుపుతూ ఆలోచిస్తూ ఉంది.

క్రిష్ తన కోసమే అన్నట్టు వినడం కోసమే అన్నట్టు రెడీ గా ఉన్నాడు.

కాజల్ “నువ్వేమి వెళ్లి గొడవ పెట్టుకోవు కదా” అంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *