కాజల్ “హుమ్మ్…” అంటూ ఫోన్ లో క్రిష్ కి మెసేజెస్ పంపుతుంది, కార్ కాగితాలు”
ఈషా “అతని మీ కార్ ఇస్తే సమస్య ఏం లేదా… అంటే…. జస్ట్ కాలేజ్ వెళ్ళే వ్యక్తీ అన్నారు కదా….”
కాజల్ “ఈషా”
ఈషా “మేడం”
కాజల్ “నీ పని నువ్వు చూసుకో…” అని నవ్వుతూనే చెప్పింది.
ఈషా తల దించుకొని “సారీ” చెప్పి వెళ్ళిపోయింది.
82. వార్నింగ్
కాజల్ “క్రిష్ వాళ్ళు ఏమైనా అన్నా కూడా పట్టించుకోవద్దు…”
క్రిష్ “నేనేమన్నా రౌడీలా కనపడుతానా….. ఎందుకు అలా చెబుతున్నావ్…”
కాజల్ “అలా అని కాదు…”
క్రిష్ “ఉఫ్ఫ్… పదా వెళ్దాం…”
మేఘ, కూడా వచ్చింది కాని క్రిష్ ని చూడగానే కళ్ళు పెద్దవి చేసుకొని అతను అవునా కాదా అనేది చూసుకొని…. అక్కడ నుండి లేచి దాక్కొని దాక్కొని వెళ్ళిపోయింది.
తనని ఎవరూ గమనించలేదు. బయటకు వెళ్లి ఫోన్ చేస్తూ “నేను క్రిష్ ని చూశాను, అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మా ఆఫీస్ లో టీం లీడ్…”
అవతలి నుండి మగ గొంతు ఆమె భర్త “దూరంగా ఉండు… వాళ్ళ జోలికి వేళ్ళకు… పోయిన సారి అయింది చాలదా….”
మేఘ చమటలు తుడుచుకుంటూ “సరే… సరే… సరే… కానీ…. మాస్టర్ కి విషయం తెలుసా…” కంగారు పడుతుంది.
భర్త దవడలు బిగుసుకున్నాయి “మాస్టర్ సిటిలోకి వచ్చారు… మళ్ళి వెళ్ళారు”
మేఘ “నా…. నాకు… భయంగా ఉంది. మనం వేరే ఊరు ట్రాన్సఫర్ పెట్టుకొని వెళ్ళిపోదాం”
భర్త “ముందు నువ్వు ఒక చోట కూర్చొని గాలి పీల్చి వదులు…. కూల్ అవ్వు”
ఈషా “మేడం… ఒక సారి నాతొ వస్తారా…” అంటూ కాజల్ ని తీసుకొని వెళ్తూ మిగిలిన స్టాఫ్ కి సైగ చేసింది.
కాజల్ వాళ్ళ సైగలను ఆమెను గమనిస్తూనే ఉంది. వాళ్ళ అందరి మధ్య క్రిష్ ని ఒంటరిగా వదలడం తనకు ఇష్టం లేదు కాని క్రిష్ హ్యాండిల్ చేయగలడు అని ఎందుకో మనసుకు అనిపిస్తుంది.
చుట్టూ ఉన్న అందరూ సడన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టారు. క్రిష్ కి ఇబ్బంది కలిగించాలని… అయితే క్రిష్ ఫుడ్ తింటూ చుట్టూ ఉన్న ఎవరినీ పట్టించుకోకుండా తింటున్నాడు.
అప్పుడప్పుడు ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక ఎంప్లాయ్ అతనికి సంబంధం లేని సబ్జెక్ట్ మాట్లాడి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయి “కమోడిటీస్…. షేర్స్…. మునాఫా రేటింగ్…. బాండ్స్” అని మాట్లాడుతున్నాడు.
క్రిష్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇంతలో కాజల్ మరియు ఈషా వచ్చారు. కాజల్ “ఏంటి… అలా సైలెంట్ గా ఉన్నావ్… నువ్వు షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తావ్ కదా….”
క్రిష్ “పెద్ద వాళ్ళు మాట్లాడేటపుడు సైలెంట్ గా ఉండాలి” అన్నాడు.
P1 “ఎంత ఇన్వెస్ట్ చేశావ్…”
P2 “కమాన్…. తను కాలేజ్ గోయింగ్ గై… ఎంత చేస్తాడు… వేలల్లో ఉంటుంది” అని నవ్వాడు.
P3 “నేను పది లక్షలు ప్రిన్సిపల్ పెట్టాను. అసలు వెనక్కి తిరిగి చూడను”
P4 “అప్పుడప్పుడు చూసుకోవాలి…. నేను పదిహేను….”
P5 “నేను పదిహేడు”
P6 “నేను పద్దెనిమిది…. కాజల్ మేడం మీరూ….”
కాజల్ “నేను బ్యాంక్ లో వేసుకుంటాను” అని నవ్వింది.
P1 “అదేంటి మేడం విడాకులు అయ్యాయి కదా… భరణం రాలేదా…” అన్నాడు.
P6 “మేడం నేను ఒకరి నెంబర్ పంపిస్తాను. ఇన్వెస్ట్ చేయండి బాగా లాభాలు వస్తాయి”
క్రిష్ ఆమె భుజం చుట్టూ చేతులు వేసి “భరణం తీసుకోవడం లేదు…” అన్నాడు.
P6 “ఓకే… ఇట్స్ ఓకే… కాని ఇన్వెస్ట్ చేయండి… మన ఆదాయంలో…”
క్రిష్ “ఇప్పటికే నేను చాలా ఇన్వెస్ట్ చేశాను. సుమారు పాతిక…”
P6 “పాతిక వేలకు ఏం వస్తుంది… చూడు… నా మాట వినూ….”
క్రిష్ “లక్షలు…”
అందరూ సైలెంట్ అయ్యారు.
కాజల్, క్రిష్ వైపు చూస్తూ “నిజం చెప్పూ… లేదంటే దెబ్బ అయి పోతాం…”
క్రిష్ ఆమె చెవిలో “నేను అబద్దం చెప్పడం లేదు…. బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేశాను…. సుమారు ఒక అయిదు సంవత్సరాల క్రితం…. అలా… అలా… అలా… ” అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఆమెకు చూపించాడు.