కాలేజ్ బాయ్ Part 12 43

కాజల్ అతని చేతిని పెనవేసుకొని “అయితే నువ్వు రిచ్”

క్రిష్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి “మనం” అన్నాడు.

కాజల్ మురిసి పోతూ ఉంటే… ఈషా…. మేడం ఒక్క సారి పక్కకు వెళ్దాం అంటూ మళ్ళి తీసుకొని వెళ్ళింది.

అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న దుబ్బోడు P7 “డబ్బు బాగా ఉంది…. అది చూపించి మా మేడంని పడేసావ్…. మాతో ఆడుకుంటూ ఉంటే మజాగా అనిపించిందా… లోపల లోపల చిన్నగా నవ్వుకొని ఉంటావే” అన్నాడు.

క్రిష్ అతన్నే చూస్తూ ఉన్నాడు.

P7 “ఏదైనా తేడా వేస్తె.. తాటతీస్తాం… మా సర్కిల్ నీకూ తెలియదు…” అంటూ పైకి లేచి క్రిష్ చొక్కా పట్టుకున్నాడు, కొట్టడానికి.

అక్కడకు కొంచెం దూరంలో ఉన్న మేఘ ఆశ్చర్యంగా వాళ్ళ మాటలు విని నవ్వుకుంది.

కాజల్ మరియు ఈషా ఇద్దరూ ఎదో గొడవ జరుగుతుంది అన్నట్టు పరుగున వచ్చేశారు.

ఇంతలో ఒక బేరర్ వచ్చి “క్రిష్ సర్….” అంటూ వచ్చి “మీరేంటి సర్ ఇక్కడా….” అన్నాడు.

క్రిష్ “డిన్నర్ కి వచ్చాం” అన్నాడు.

బేరర్ “మీ మ్యాచ్ అద్బుతం సర్…. మళ్ళి ఎపుడు సర్…”

క్రిష్ “నేను మానేశాను”

బేరర్ “అదేంటి సర్… మీకు బాక్సింగ్ చేస్తూ ఉంటే…. కిరాక్ ఉంటుంది” అన్నాడు.

అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే… బేరర్ కాగితం మీద క్రిష్ సంతకం పెట్టించుకొని వెళ్ళాడు.

అందిర్ని చూస్తూ క్రిష్ “నాకు చిన్నప్పటి నుండి అలవాటు అంతే….”

P7 “ఏంటి?”

క్రిష్ “బాక్సింగ్” అని కాజల్ వైపు చూసి పక్కకు వెళ్ళమని సైగ చేశాడు.

కాజల్, ఈషాని పక్కకు వెళ్దాం అని తీసుకొని వెళ్ళింది.

క్రిష్ “రేయ్… నేను గొడవ ఎందుకు చేయలేదో తెలుసా… మనం ఉన్న ప్లేస్ CC కెమెరా కవరేజ్ ఉంది”

అందరూ చుట్టూ చూశారు.

క్రిష్ “తను నా మనిషి… నాకు బాగా కావలసిన మనిషి…. ఇంకొక్క సారి తను బాధపడింది అని తెలిసిందో…” అని చుట్టూ అందరిని చూస్తూ “CC కెమెరాలు పగిలిపోతాయ్” అని పైకి లేచి “బిల్ నేను పే చేస్తాను” అని వెళ్ళాడు

బయటకు వెళ్తూ వెళ్తూ మేఘ ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద చిన్నగా తట్టి ఆమెను చూడకుండానే సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

మేఘ భయం భయంగా అక్కడ నుండి బాత్రూంకి వెళ్ళిపోయింది. ఫోన్ లో భర్తతో “చూసేసాడు…. చూసేసాడు…. క్రిష్ నన్ను చూసేసాడు…. నాకు భయంగా ఉంది” అంటూ ఏడుస్తుంది.

భర్త “రిలాక్స్…. క్రిష్ చూస్తే భయం ఏముంది…. అయినా క్రిష్ మంచి వాడు… మాస్టర్ చూస్తేనే కదా….. సమస్య” అన్నాడు.

మేఘకి భయం అనిపించింది. ఎదురుగా అద్దంలో ఒక్క సారిగా ‘మాస్టర్ నూతన్’ మొహం కనపడింది. వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఎవరూ లేరు. అదంతా తన భ్రమ…

టాయిలెట్ వస్తున్నా ఆపుకొని….. ఇక అక్కడ ఉండకూడదు అన్నట్టు బయటకు పరిగెత్తింది.

కాజల్ “నీకూ నిజంగా బాక్సింగ్ వచ్చా…”

క్రిష్ “ఆ బేరర్ కి డబ్బులిచ్చా… అలా చెప్పమని” కాజల్ నవ్వేసింది.

కాజల్ “ఆ షేర్ మార్కెట్ డబ్బు…”

క్రిష్ “అదంతా ఉత్తుత్తే…. అయినా అంత డబ్బు ఉంటే నిన్ను ఎందుకు డబ్బు కోసం మోసం చేస్తాను…”

కాజల్ “కదా…” అని తల కొట్టుకొని క్రిష్ దగ్గరకు వచ్చి “అంటే నువ్వు రిచ్ కాదా….”

క్రిష్ “రిచ్…. హృదయం ఉంది” అన్నాడు.

కాజల్ కోపంగా “మడిచి…” అని వెళ్ళిపోయంది.

క్రిష్ నవ్వుతూ ఆమెను అనుసరించాడు “నీకూ రేపటి నుండి వాళ్ళ సమస్య ఉండదు”

కాజల్ “నాతో మాట్లాడకు అసలు నువ్వు… అన్ని అబద్దాలు చెబుతావ్…”

క్రిష్ “బేబి… బేబి… బేబి… ” అంటూ ఆమెను ఫాలో అయి వెళ్తున్నాడు.

కాజల్ “నాతో మాట్లాడకు అసలు నువ్వు…”