త్రిష “అదేం లేదు లెండి…. నేను జనరల్ గా చెప్పాను”
సుహాస్ కోపంగా “నేను అదే ఆలోచనలో ఉన్నాను” అన్నాడు.
త్రిష “అఫైర్….”
సుహాస్ “మోసం చేసింది…. నమ్మక ద్రోహి… ఛీ….” అంటూ బూతులు మింగాడు.
త్రిష “మీ భార్య మీతో ఎలా ఉండేది… అంటే ఎవరి నైనా ప్రేమిస్తున్నా అని చెప్పిందా”
సుహాస్ “ఇంకా తన గురించి ఎందుకు మేడం….”
త్రిష చిన్నగా నవ్వి “చూడండి…. ఇవ్వాళ మీరు నాతో ఓపెన్ అయి మాట్లాడితే ఆ గెట్ దాటి మీరు వెళ్ళేటపుడు మీ జీవితం మారిపోతుంది” అంది.
సుహాస్ “ఏం మారుతుంది?”
త్రిష చిన్నగా నవ్వి “మీకే తెలుస్తుంది…..”
సుహాస్ ఆమెనూ చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు.
త్రిష “దాని కోసం మీరు నాతో అన్ని పంచుకోవాల్సి ఉంటుంది”
సుహాస్ “హుమ్మ్” అని తల ఊపాడు.
త్రిష “మీ భార్య మీతో ఎలా ఉండేది?”
సుహాస్ “ఎలా అంటే?” అని కోపంగా అడిగాడు.
త్రిష విసుగ్గా “చూడండి… నా కౌన్సిలింగ్ కోసం చాలా డబ్బు పే చేస్తారు…. అలాంటిది నేను మీకు ఫ్రీ గా చెబుతున్నా…. నాకు కో ఆపరేట్ చేస్తే మీకే మంచిది” అంది.
ఆమె కళ్ళలో విసుగు చూడగానే సుహాస్ కొంచెం వెనక్కి తగ్గి చెప్పడం మొదలు పెట్టాడు “ఆమె నాతో బాగానే ఉండేది…. నాకు అసలు అనుమానం రాలేదు… కానీ ఆ రోజు….”
త్రిష “ఆ రోజు…” అని అడిగింది.
సుహాస్ “ఆ రోజు నా ఫోన్ కి ఎవరో కొన్ని ఫోటోస్ పంపారు. అందులో ప్రియ….” అంటూ మొహం చీదర గా పెట్టాడు.
త్రిష “వేరే వాళ్లతో…”
సుహాస్ మొహం అదోలా పెట్టి ఇక అక్కడ కూర్చోలేక పైకి లేచాడు.
త్రిష అతనితో పాటు పైకి లేచి “పూర్తిగా సెక్స్ ఫోటోస్ పంపారా….”
సుహాస్ “నేను వాటిని ఆన్ లైన్ లో చెక్ చేయించాను. అవి వరిజినల్ వే…. నే… నేను తనని నమ్మాను. నేను వెళ్ళాక తను ఇంట్లో ఇలా…..” అని ఆగిపోయాడు.
త్రిష “ఇతనేనా…” అని నూతన్ ఫోటో చూపించింది.
సుహాస్ “నాకు గుర్తు లేదు నేను ఆ ఫోటోస్ డెలీట్ చేసి ఆమెను పంపించేశాను” అన్నాడు.
త్రిష “ప్లీజ్… గుర్తు చేసుకోండి… మీ జీవితం మొత్తం మారిపోతుంది”
సుహాస్ “ఏమో తెలియదు… ఇదేదో ఆ లంజని అడిగితే సరిపోతుంది కదా…”
త్రిష “మిస్టర్ సుహాస్ తనని అలా లంజ అని పిలవకండి… ఆమె మీ బిడ్డకు తల్లి”
సుహాస్ పిడికిలి బిగించాడు.
త్రిష “గుర్తు తెచ్చుకోండి” అంటూ నూతన్ ఫోటో అతనికి చూపించింది.
సుహాస్, ఫోటో చూడకుండానే “హుమ్మ్” అన్నాడు.
త్రిష అవునని చెబుతున్నాడు అని అర్ధం చేసుకొని “యస్…” అని అరిచి ఆనందంగా కుర్చీలో కూర్చుంది.
సుహాస్, త్రిషలో వచ్చిన మార్పుని ఆశ్చర్యంగా చూస్తూ అలానే ఉన్నాడు.
త్రిష తన ఎక్సైటమెంట్ తగ్గించుకొని సుహాస్ వైపు చూస్తూ “కూర్చోండి” అంది.
సుహాస్ ఆమెను చూస్తూ వచ్చి తన సీట్ లో కూర్చున్నాడు.
త్రిష “వశీకరణం అనే మాట ఎప్పుడైనా విన్నారా….”
సుహాస్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ “నేను దేవుడిని నమ్మను” అన్నాడు.
త్రిష నవ్వుతూ “నేను కూడా కానీ.. వశీకరణం నిజం అయింది” అంది.
సుహాస్ “వాట్…. మీరొక డాక్టర్…”
త్రిష “ఒక వ్యక్తీ పేషెంట్ లా నా దగ్గరకు వచ్చి వశీకరణం నేర్చుకున్నాం అంటే నేను చిన్నగా నవ్వా, అతను మాట్లాడుతూ ఉంటే నేను నవ్వా అని నన్ను వశీకరణం చేసి… ” అని ఆగిపోయి గుటకలు మింగింది.
సుహాస్ ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. ఆమె చూపులు అతనికి అర్ధం అయ్యేలా చేశాయి.
త్రిష తల పట్టుకొని తిరిగి అతడినే చూస్తూ “మళ్ళి వచ్చాడు, సెక్యూరిటీని పిలిస్తే…”
సుహాస్ “సెక్యూరిటీని కూడా….”
త్రిష “హమ్… వశపరుచుకున్నాడు”
సుహాస్ “నాకు ఎందుకు చెబుతున్నారు”
త్రిష “నేను సీక్రెట్ కెమెరాలు పెట్టాను. అందులో జరిగింది చూసి….” అంటూ ఆమె కళ్ళలో వస్తున్నా కన్నీళ్లు తుడుచుకుంది.
సుహాస్ “సారీ…”
త్రిష “అది అసలు నేను కాదు…. అలా నేను చేయను…. ఎదో దెయ్యం వచ్చి నా శరీరాన్ని కొద్ది సేపు వాడుకొని వదిలినట్టు, అదంతా నేను వీడియో చూస్తున్నట్టు అనిపించింది”
సుహాస్ “మీకు గుర్తు లేదా”
త్రిష “నా ప్రమేయం లేదు…. అలాగే ఏం జరిగిందో నాకు గుర్తు లేదు”
సుహాస్ “నిజమా”
కొద్ది నిముషాల మౌనం…..
త్రిష “నీ భార్యతో…..” అని ఆగిపోయింది “అతని పేరు నూతన్… అతనికి ఎదో పెద్ద పొలిటికల్ సపోర్ట్ ఉంది”
సుహాస్ “ఎవరికీ ఈ విషయం ఎందుకు తెలియలేదు”