ఫోన్ “xxx నగర్ మేడం…. మా రూమ్ లో ఉన్నాడు”
కాజల్ “అయినా… ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తావ్…”
ఫోన్ “అంటే అది మేడం…”
కాజల్ “బుద్ది ఉందా…. అసలు ఇదేమైనా టెలిఫోన్ యుగం అనుకున్నావా… ఎవరి పర్సనల్ ఫోన్ వాళ్ళకు ఉంది ఎందుకు…. ఇలా వేరే వాళ్ళ పర్సనల్ ఫోన్ ఎత్తుతున్నావ్…. సంస్కారం ఉండే పని లేదా…”
ఫోన్ “మేడం…. సారీ మేడం…. సారీ మేడం…. ” అంటూ క్రిష్ ని కోపంగా చూస్తూ ఫోన్ కట్టేశాడు.
ఫ్రెండ్ “నీ యబ్బా…” అని క్రిష్ భుజం మీద చరిచి వెళ్లి పడుకున్నాడు.
క్రిష్ పక్క వేసుకొని బ్యాగ్ ని తలకు దిండులా పెట్టుకొని నడుము వాల్చాడు.
మెల్లగా కాజల్ నెంబర్ ని బ్లాక్ లిస్టు లో నుండి తీసేశాడు.
కాజల్ నుండి మళ్ళి ఫోన్, ఈ సారి ఎత్తలేదు.
క్రిష్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి నిద్ర పోవడం కోసం పడుకున్నాడు.
మరో వైపు…
కాజల్, నిషా ఫోన్ ని నిషా చేతికి ఇచ్చి, విసురుగా దిండుని మూడు దెబ్బలు కొట్టి తల కింద వేసుకొని పడుకుంది.
నిషా మనసులో “అంటే…. నేను సాత్విక్ ని మర్చిపోలేక పోతున్నా అని అక్కకి తెలుసా…. క్రిష్ కి కూడా తెలుసా… నిజంగా నన్ను నేను పనిష్ చేసుకుంటూ మోసం చేసుకుంటున్నానా…. ” అని ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకుంది.
ముగ్గురు మనుషులు నిద్ర రాకపోయినా గట్టిగా కళ్ళు మూసుకొని ఎప్పటికో నిద్ర లోకి జారుకున్నారు.
తెల్లారి బైక్ పార్క్ చేసి… తల వంచుకొని కాలేజ్ లోపలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఇంతలో కాజల్ వాయిస్ “ఒరేయ్….” అని వినపడింది.
క్రిష్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ “నువ్వూ…. ఇక్కడ….” అన్నాడు.
కాజల్ “తమరి కోసమే వచ్చాను స్వామి…. క్రిష్ లవర్ ని అనగానే లోపలకు పంపారు”
క్రిష్ “వాట్…” అని షాకింగ్ గా చూశాడు.
కాజల్ “ఏడవకు నేను కూడా ఇదే కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ ని”
క్రిష్ “ఓహో…” అని మళ్ళి నవ్వుతూ “అదేంటో అందమైన అమ్మాయిలు అందరూ ఇదే కాలేజ్ లో చదువుతారు” అన్నాడు.
కాజల్ “అందుకే కదా… తమరు ఇక్కడికి వచ్చింది”
క్రిష్ సిగ్గుగా తల దించుకున్నాడు.
కాజల్ “నా నెంబర్ బ్లాక్ లిస్టు చేశావ్…. నిషా ఫోన్ నుండి చేస్తుంటే… ఎవడో గొట్టం గాడికి ఇచ్చి మాట్లాడించావ్… హా… ”
క్రిష్ “అది కాదు…”
కాజల్ “ఆపరా… నీతో ఇన్ని రోజులు కాపురం చేసిన దాన్ని… నాకు తెలియదా… నీ వేషాలు…” అంది.
క్రిష్ “నువ్వు కాపురం, గీపురం అని అలా పెద్దగా మాట్లాడకే… ఎవరైనా వింటే బాగోదు….” అని ఆమె దగ్గరకు వచ్చి తిన్నగా కాలేజ్ క్యాంటిన్ కి తీసుకొని వెళ్ళాడు.
క్రిష్ “ఏం తింటావ్…”
కాజల్ “ఎదో ఒకటి … ఆకలేస్తుంది…”
క్రిష్ “అదేంటి… నిషా వండుతుంది కదా…”
కాజల్ “నేను ముందే బయటకు వచ్చాను…”
క్రిష్ “హేయ్.. నిజం చెప్పూ… నువ్వు వచ్చి ఎంత సేపు అవుతుంది” అన్నాడు.
కాజల్ ఏం మాట్లాడకుండా తల తిప్పుకుంది.
క్రిష్ వెళ్లి ఫుడ్ తీసుకొని వచ్చాడు. ఇద్దరూ తింటూ ఉంటే… క్యాంటిన్ లో ఉండే ఒక ఆమె క్రిష్ తో కాజల్ ని చూపించి “ఎవరూ?” అని అడిగింది.
క్రిష్ “ఏమో ఎవరో నాకు కూడా తెలియదు… ఆకలేస్తుంది అంటే తీసుకొని వచ్చి పెట్టిస్తున్నా…” అన్నాడు.
క్రిష్ నవ్వుతూ ఉంటే…. కాజల్ కోపంగా క్రిష్ ని చేత్తో కొడుతుంది.
క్రిష్ “ఇక చాలు…. ఇక చాలు…. కోపం తీరిపోయింది కదా… అయిపొయింది కదా… ఇక తిను…” అన్నాడు.
కాజల్ కోపంగా క్రిష్ ని చూస్తూ “నాకో డౌట్…. కాలేజ్ లో ఇంకేవారిని అయినా మైంటైన్ చేస్తున్నావా… నే మొహం లో కంగారు కనిపిస్తుంది” అంది.
క్రిష్ ఆమెను చూస్తూ “నిజం చెబుతున్నా… నా కంటికి నీ కంటే ఎవరు అందంగా కనిపించరు” అన్నాడు.
“హాయ్ క్రిష్” అంటూ ఒకమ్మాయి వచ్చింది.
కాజల్ కోపంగా క్రిష్ ని చూస్తూ ఉంటే… ఆమె సరాసరి వచ్చి క్రిష్ తో కాజల్ ని ఉద్దేశించి “ఎవరూ…. మీ అక్క అని అడిగింది”
క్రిష్ ఏం చెప్పాలో అర్ధం కాక అటు ఇటూ చూస్తూ ఉంటే… కాజల్ వెనక్కి వాలి ఏం చెబుతాడా అన్నట్టు అతన్నే చూస్తూ ఉంది.
క్రిష్ “నా పెళ్ళాం” అన్నాడు.
“యు సిల్లీ” అంటూ ఆ అమ్మాయి అక్కడ నుండి వేరే అబ్బాయి (తన బాయ్ ఫ్రెండ్) దగ్గరకు వెళ్ళిపోయింది.
క్రిష్ కూడా “బాయ్” చెప్పాడు.
కాజల్ కోపంగా చూస్తుంది.
క్రిష్ ఇబ్బందిగా చూస్తూ “ప్లీజ్… అలా చూడకు..” అన్నాడు.
ఇద్దరూ టిఫెన్ చేసేసి కారు దగ్గరకు వచ్చారు.
కాజల్ “ఇంటికి రా….”
క్రిష్ “నేను రానూ….”
కాజల్ “క్రిష్… పదే…. పదే…. చెప్పించుకోకు… ఇంటికి రా…”
క్రిష్ “అదీ….”
కాజల్ “నిషా చాలా సెన్సిటివ్… అందుకే నేను కూడా ఏమి అనను…. అప్పుడు నేను నిన్ను ఏమి అనక పోతే సపోర్ట్ చేసినట్లు అవుతుంది, ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది. అందుకే నిన్ను అరిచాను. అలా అని నిజంగానే బ్యాగ్ సర్దుకొని వచ్చేసావ్…. ఎదో మొగుడు తిడితే పెళ్ళాం పుట్టింటి కి పారిపోయినట్టు”