రెండు నిముషాల తర్వాత….
క్రిష్ “తను నా మనిషి….” అన్నాడు.
కేశవ్ “ఓహ్… తను నీ మనిషి…. వెరీ గుడ్… మరి రష్…. తను ఎవరి మనిషి… కొన్ని నెలల క్రితం ఇదే మాట రష్ విషయంలో చెప్పావ్… ఈమెది ఎన్నో నెంబర్?…. చెప్పూ రా తన టోకెన్ నెంబర్ ఎంత?…”
క్రిష్ కోపంగా కేశవ్ చొక్కా పట్టుకొని నేట్టేయబోతే… కేశవ్ మధ్యలోనే అతడిని ఆపి మరో పంచ్ ఇచ్చాడు.
అక్కడ నుండి ఇద్దరి మధ్య చిన్న సైజ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్ జరిగింది. చివరికి కేశవ్ , క్రిష్ ని నేల మీదకి విసిరేశాడు.
క్రిష్ వెనక్కి కింద పడి పైకి లేచి ముక్కు చూసుకుంటూ ఉన్నాడు.
కేశవ్ కూడా క్రిష్ ముక్కు చూసి “ఏం కాలేదు… కాని పగులుతుంది… మీద చేయి వేస్తె…. ఎదో బామ్మర్దివి, చిన్నోడివి అని ఊరుకుంటు ఉంటే… పెద్ద హీరో అనుకుంటున్నావా… మీదమీదకి వస్తున్నావ్… హా… నరికేస్తా…” అంటూ వేలు చూపించాడు.
97. ఎందుకు అంటే… నేను, హీరో ని కాబట్టి….
కేశవ్, క్రిష్ ఇద్దరూ బావ బామ్మర్దులు, ఎక్కువగా రామ్మోహన్ దగ్గర ఉండడంతో అలాగే స్పోర్ట్స్ లో బాక్సింగ్ లో కలిసి పోటీ చేయడంతో మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. కొట్టుకోవడం వాళ్ళ ఇద్దరి మధ్య సర్వసాధారణ విషయం.
కేశవ్, క్రిష్ ని పైకి లేపి అతని చొక్కా గుండీలు సరి చేసి, అతని జుట్టు సారి చేస్తూ… “చూడు… మనసు అంటే ఒకళ్ళకు ఇచ్చేది…. తలా ఒక ముక్క చేసి తలా కొద్ది కొద్దిగా పంచేది కాదు…” రా అని చెప్పాడు.
క్రిష్ అతన్ని తోసేసి చొక్కా గుండీలు పెట్టుకుంటూ, కేషవ్ వైపు కోపంగా చూస్తున్నాడు.
కేశవ్ “రష్, నిన్ను అసలు మనిషిలా కూడా లెక్క వేయలేదు… అందరూ తనని దూరం చేసినపుడు మాత్రమె నీ దగ్గరకు వచ్చింది”
క్రిష్ “నేను వెళ్లి కాపాడాను”
కేశవ్ “హా….”
క్రిష్ “మీరందరూ తనని వదిలేసి చేతులు దులుపుకుంటే… నేను వెళ్లి కాపాడాను…”
కేశవ్ “అయితే…”
క్రిష్ “బ్రదర్ వరస అయ్యే…. సెక్యూరిటీ ఆఫీసర్…. ద గ్రేట్ కేశవ్…. సబ్ ఇన్స్పెక్టర్ గారు…. సొంత తండ్రి రామ్మోహన్… నార్కోటిక్ డిపార్ట్మెంట్… ఎవ్వడు ఏం పీకలేక మూసుకొని ఉంటే… నేను వెళ్లి కాపాడాను… ఒక్కడిని వెళ్లి కాపాడాను”
కేశవ్ సైలెంట్ గా ఉన్నాడు.
క్రిష్ “ఊరికే లవ్ లెటర్ యిచ్చేసి… తనను తీసుకొని నేను లేచిపోలేదు రా…. తనని, తన పసికందుని కిడ్నాప్ చేస్తే… వరంగల్ వెళ్లి అందరిని ఎదిరించి… ఒక్కడిని కాపాడుకొని వచ్చాను… పిల్లాడికి బాగోక రెండు లక్షలు అవసరం అయితే చేతిలో డబ్బులు లేక పోతే… ఒకరిని మోసం చేసి తెచ్చి కట్టాను ఆ డబ్బు… ఆ రెండు లక్షలు…. అప్పుడు కూడా రాలేదు… ఏ పెద్ద వాళ్ళు… రాలేదు.. అవునూ రా హీరో నే…. హీరో నే…. ” అని ఆవేశంగా చెబుతున్నాడు.
రెండు నిముషాల్ తర్వాత…
కేశవ్, క్రిష్ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని “రేయ్, క్రిష్…. అది కాదు రా…. ఇంత చేశాక కూడా… రష్ ఎక్కడుంది”
క్రిష్ సైలెంట్ అయ్యాడు.
కేశవ్ “ఎక్కడుంది…. చెప్పూ…”
క్రిష్ “…”
కేశవ్ “వెళ్లి పోయింది…”
క్రిష్ “…”
కేశవ్ “నిన్ను వాడుకుంది…. నిజాయితీ… కృతజ్ఞత లేని మనుషులు రా…”
క్రిష్ “…”
కేశవ్ “నీ మంచి కోసమే చెబుతున్నా… నువ్వు మళ్ళి అలా అవ్వకూడదు అని చెబుతున్నా….”
క్రిష్ సైలెంట్ అయ్యాడు. అతని ఆవేశం కూల్ అయి మాములు అయ్యాడు.
రెండు నిముషాల తర్వాత…
ఇద్దరూ పక్కపక్కన కూర్చొని ఉన్నారు. కేశవ్, క్రిష్ భుజం చుట్టూ చేయి వేశాడు.
కేశవ్ “ఇంతకీ ఎవరినీ మోసం చేశావ్…. ఆ రెండు లక్షల కోసం..” అన్నాడు.