క్రిష్ పైకి లేచి నిలబడి కేశవ్ ఎదురుగా నిలబడ్డాడు.
క్రిష్, కేశవ్ చేయి చూపిస్తూ “నీ సెక్యూరిటీ ఆఫీసర్ బుద్ది పోగొట్టుకున్నవ్ కాదు…” అన్నాడు.
కేశవ్ “అది కాదు రా…. రేపు ఏదైనా కేసు గీసు వస్తే… హెల్ప్ చేద్దాం అని….”
క్రిష్ “నా బొక్క చేస్తావ్ రా… నెంబర్ వన్ స్వార్ధ పరుడువి నువ్వు…. నిన్ను అసలు నమ్మ కూడదు…” అన్నాడు.
కేశవ్ “అది కాదు రా… నాకు బామ్మర్దివి రా.. అప్పుడు మేం ఎవరం హెల్ప్ చేయలేదు…. మొండిగా వెళ్ళావ్…. సాధించుకొని వచ్చావ్… ఇప్పటికి నువ్వంటే మా అందరికి మంచి ఫీలింగ్… నువ్వు ఇబ్బందుల్లో పడకూడదు అని… అంతే….”
క్రిష్ “అయినా నేను సార్ట్ అవుట్ చేసుకున్నా లే….”
కేశవ్ “ఎవరో చెప్పను అంటావ్…. అంతేలే ఎంతైనా మేం బయట వాళ్ళం….” అని క్రిష్ వైపు దొంగ చూపు చూస్తున్నాడు. క్రిష్ చెబుతాడు అని అర్ధం అయి, చిన్నగా నవ్వుకుంటున్నాడు.
రెండు నిముషాల తర్వాత…
క్రిష్ “తనే…” అంటూ ఏటో చూస్తూ చెప్పాడు.
కేశవ్ “ఏంటి?” అని ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు.
క్రిష్ కేశవ్ ని చూస్తూ నిలబడ్డాడు.
కేశవ్ పగలబడి నవ్వుతూ “ఏంటి.. అయితే మీ ఇద్దరి పరిచయం మోసంతో మొదలయిందా…. సూపర్ రా బాబు…”
క్రిష్ “నీ సిస్టర్…. రష్ మోసంతో ముగించింది….. కాజల్ తో మోసంతో మొదలయింది….. ఏది బెస్ట్ అంటావ్…” అన్నాడు.
రెండు నిముషాల తర్వాత…
కేశవ్ “రష్ కి నువ్వొక బ్యాక్ అప్ వి… ఇప్పుడు తన మొగుడు ఏమైనా అన్నా, వదిలేసినా నీ దగ్గరకు వస్తుంది… నిన్ను అలా అట్టి పెట్టుకుంది… క్రిమినల్ బ్రెయిన్…” అన్నాడు.
క్రిష్ “ఏం చేయమంటావ్…. దిగిన తర్వాత ఈదడమే…. అలానే ఉంటే మునిగిపోతాం…. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక తప్పదు బావా… మోయాల్సిందే”
కేశవ్ “ఈ అమ్మాయి ఎలాంటిది? అసలు తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిని, అందులోనూ డబ్బు కోసం మోసం చేసిన వాడిని లవ్ చేయాలని తనకు ఎలా అనిపించింది… హౌ ఈజ్ దిస్ పాజిబుల్…”
క్రిష్ పైకి చూస్తూ “ఎందుకంటే తనొక ఏంజెల్…”
కేశవ్ “అబ్బో….”
క్రిష్, తిరిగి కేశవ్ ని చూస్తూ “నిజంగా తనొక ఏంజెల్…”
కేశవ్ “సరే…. నీ ఏంజెల్ ని జాగ్రత్తగా చూసుకో… ఈషాని కిడ్నాప్ చేయబోయిన ఆ కిడ్నాపర్ ఒక సీరియల్ అఫేండర్… ఒక సైకో లాంటి వాడు… వాడిని మేం రెండు నెలల ముందు వేరే కేసులో కూడా వెతుకుతున్నాం… దొరకడంలేదు”
రెండు నిముషాల తర్వాత…
క్రిష్ “రెండు రోజులు…”
కేశవ్ “ఏంటి?”
క్రిష్ “రెండు రోజుల్లో వాడిని తీసుకొచ్చి నీ ముందు నుంచో బెడతా…”
కేశవ్ “పిచ్చి పిచ్చిగా మాట్లాడకు”
క్రిష్, నవ్వుతూ లేచి నిలబడ్డాడు.
కేశవ్ “ఇన్వాల్వ్ అవ్వకు… ముందుగా చెబుతున్నా, ఇన్వాల్వ్ అవ్వకు…” అన్నాడు, కాని క్రిష్ నవ్వుతూనే ఉన్నాడు.
కేశవ్ “అసలు నీకూ ఎందుకు రా…”
క్రిష్ ఒళ్ళు విరుచుకుంటూ “ఎందుకు అంటే… నేను, హీరో ని కాబట్టి” అని నవ్వుతున్నాడు.
98. నా దైర్యం….
కాజల్ ఆఫీస్ లో కూర్చున్నా క్రిష్ మరియు కేశవ్ ల మాటల గురించే ఆలోచిస్తుంది. క్రిమినల్ ని పట్టుకోవడం గురించి కేశవ్ చూసుకుంటాడు.
కాని తనూ… రష్ గురించి ఆలోచిస్తూ… ఉంది.
ఈషా “ఏమయింది? మేడం… సెక్యూరిటీ ఆఫీసర్లు ఏమైనా ఇబ్బంది పెట్టారా… లేదంటే గాయం నొప్పిగా ఉందా…” అని కన్సర్న్ గా అడిగింది, తనని కాపాడుతూ అయిన గాయం అవ్వడం వల్ల కాజల్ పై తనకు ఇంతకు ముందు ఉన్న నెగిటివ్ ఫీలింగ్ పోయి పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఆఫీస్ అందరికి స్పెషల్ రెస్పెక్ట్ వచ్చినా అందరూ మాములుగానే ఉన్నారు.
ఈషా మాటలతో ఈ లోకంలో వచ్చి కాజల్ “బ్యాక్ అప్ రిలేషన్ షిప్ అంటే ఏంటి?” అని అడిగింది.
ఈషా “ఏంటి? మేడం..”
కాజల్ “బ్యాక్ అప్ రిలేషన్ షిప్ అంటే ఏంటి?” అని మళ్ళి అడిగింది.
ఈషా ఫోన్ లో చూస్తూ “బ్యాక్ అప్ రిలేషన్ షిప్ అంటే…. ఒక అమ్మాయి, తన భర్త లేదా బాయ్ ఫ్రెండ్ అందుబాటులో లేనప్పుడు బ్యాక్ అప్ గా పెట్టుకున్న వ్యక్తీతో రొమాంటిక్ రిలేషన్ షిప్ కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు అంటే మరో కొత్త తోడూ…. తన ఎక్సపెక్టేషన్ సంబంధించిన వాళ్ళు దొరికేవరకు….” అని చదివి ‘ఛీ… అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా…’ అంది.