నిషా “పందెమా…” అంది కన్నింగ్ గా నవ్వుతూ….
నేను “నీలా అబద్దాలు ఆడేవాళ్ళతో నేను పందెం కాయను”
నిషా “గెలవలెను అని చెప్పూ” అంది.
నేను “నిన్న నీ ఆఫీస్ మొదటి రోజు కదా… ఏం ఘనకార్యం చేశావ్… పది మంది నీ వెంట పడ్డారు” అన్నాను.
నిషా క్యాజువల్ గా “ఓహ్ అదా… ఏం లేదు…” అంది.
నేను మనసులో సచ్చింది గొర్ర అనుకున్నాను. చుట్టూ అందరూ నిషాని వింతగా చూడడం గమనించి నా వైపు ఉరిమి చూసింది ఆ విషయం ఎత్తినందుకు…
ఇక తప్పదు అనుకోని నా ముందుకు జరిగి “తర్వాత చెబుతా అన్నాను కదా… ఇలా అందరిలో అడగాలా…” అంది.
నేను “చెప్పూ” అన్నాను పెద్దగా….
నాతో పాటు చుట్టూ అందరూ కూడా ఇంట్రెస్ట్ గా వినడం మొదలు పెట్టారు. నిషా చెప్పడం మొదలు పెట్టింది.
ఆఫీస్ మొదటి రోజు కావడంతో నీటుగా ఆఫీస్ డ్రెస్ చేసుకొని అద్దంలో చూసుకొని బయటకు వచ్చాను. అక్కని అడిగి అడిగి కొనిపెట్టించుకున్న హీల్స్ ఇవి అనుకుంటూ వేసుకొని ఒక సారి పై నుండి కిందకు చూసుకున్నాను. హీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆడవాళ్లకు, హీల్స్ కి అవినాభావ సంబంధం ఉంది, ఎందుకంటే హీల్స్ మా ఆడవాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచేస్తాయి.
ఆత్మవిశ్వాసం గా అద్దంలో నన్ను నేను చూసుకుంటూ, సేల్ఫీ తీసుకోకుండా ఉండలేక పోయాను. సేల్ఫీ తీసుకొని ఒక సారి చూసుకొని బాస్ కి ఫోన్ చేశాను.
వైభవ్ “హలో ఎవరు?”
నిషా “నేను సర్… నిషా, కొత్తగా జాయిన్ అయిన మీ అసిస్టెంట్” అన్నాను.
వైభవ్ “హా…. ఆ ర్యాగింగ్ పిల్లవి కదా నువ్వు…” అన్నాడు.
నిషా పళ్ళు కొరుక్కొని “అవునూ సర్….” అంది.
వైభవ్ “ఇవ్వాళ జాయిన్ అవ్వమన్నానా”
నిషా “అవునూ సర్….”
వైభవ్ “అది కాదు ఇవ్వాళా…”
నిషా “అవునూ సర్…. అవునూ…”
వైభవ్ “ఓహ్… షిట్… ఓహ్… ఫక్…”
నిషా ఒక సారి ఫోన్ ని చూసి మళ్ళి చెవిలో పెట్టుకుంది.
వైభవ్ “ఓకే ఒక పని చెయ్….”
నిషా “చెప్పండి సర్…” అన్నాను. కొత్త జాబ్ కదా.. వినాలి..
వైభవ్ “ఇవ్వాళ నా నిశ్చితార్ధం”
నిషా “అవునా సర్… కంగ్రాట్స్…” మనసులో ఆ రోజు ఆన్ లైన్ లో ఎంగేజ్ మెంట్ అని చదివిన సంగతి గుర్తుకు వచ్చింది.
వైభవ్ “నువ్వు ఒక పని చెయ్”
నిషా “చెప్పండి సర్”
వైభవ్ “అడ్రెస్ పంపిస్తాను… అక్కడకు రా…”
నిషా “ఓకే సర్..” అంటూ ఫోన్ లో పంపిన అడ్రెస్ చూసుకున్నాను. అది ఒక పెళ్లి మండపం, పైగా నేను ఆఫీస్ అటైర్ లో ఉన్నాను.
ఇక చేసేది ఏం లేక క్యాబ్ అతనికి అడ్రెస్ మార్చమని చెప్పాను. విత్ ఎక్స్ట్రా ప్రైస్…… ఫస్ట్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే….
అక్కడకు వెళ్ళగానే వైభవ్ సర్ దగ్గరకు వెళ్ళగానే నన్ను ఒక పక్కకు తోసేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటూ ఉన్నారు.
ఆ కళ్యాణ మండపంలో చాలా ప్లేస్ ఉంది కాని తక్కువ మంది జనాభా ఉన్నారు.
ఒక వైపు వైభవ్ సర్ వాళ్ళు ఉంటే….. మరో వైపు పెళ్లి కూతురు తరుపు వాళ్ళు ఉన్నారు.
అందరికి మధ్యలో ఎవరితో సంబంధం లేకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాను.
ఒకతను వచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు.
నేను అతని వైపు కోపంగా చూసి “ఎప్పుడు ఆడపిల్లలని చూడలేదా… ఎందుకు అలా చూస్తున్నావ్” అన్నాను.
అతను నా ముందు వచ్చి నిలబడి, “నిషా…” అన్నాడు.
నేను అలానే కూర్చొని స్టైల్ గా “ఏంటి?” అన్నాను.
అతను “నా పేరు నిరంజన్…. వైభవ్ సర్ అసిస్టెంట్ ని, ఇక నుండి నువ్వు నా అసిస్టెంట్ వి” అన్నాడు.
నా మైండ్ బ్లాక్ అయిపొయింది… విత్ ఎక్స్టా ఇడియట్ యాటిట్యూడ్…… సెకండ్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే…
మెల్లగా లేచి నిలబడి, సరిగ్గా నిలబడి “సర్” అన్నాను.
అతను నన్ను ఫాలో మీ అన్నాడు. అతని వెంట వెళ్లాను, నాకేమో ఆకలి అవుతుంది.
వావ్…. అక్కడ అన్ని రకాలు ఐటమ్స్ ఉన్నాయి.
నిజానికి రిచ్ పీపుల్ పెళ్లి చూపులు కదా… భలే భలే ఐటమ్స్ ఉన్నాయి.
కాని నన్ను తీసుకొని వెళ్లి… ఒక గదిలో నించోబెట్టారు.
నా చేతిలో ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి ఫోన్ చేయగానే ఈ పెన్ డ్రైవ్ అక్కడ ఉన్న ఒక usb కి పెట్టి, స్విచ్ ఆన్ చేయమన్నారు.
నిషా “పెళ్లి కొడుకు పెళ్ళికూతురుకి గిఫ్ట్ ఇస్తున్నాడా” అన్నాను
అతను “హుమ్మ్” అని నవ్వాడు.