కాలేజ్ బాయ్ Part 16 Like

రోమాన్స్ అనుకుంటూ అక్కడే నిలబడ్డాను.

నిషా “ఎంత సేపటిలో స్టార్ట్ అవుతుంది” అన్నాను.

నిరంజన్ “టూ మినిట్స్” అన్నాడు.

అక్కడే నిలబడి ఉన్నాను.

అండ్ టూ మినిట్స్…. టెన్ మినిట్స్…. థర్టీ మినిట్స్…. ఐ మిస్సిడ్ మై లంచ్ …….. థర్డ్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే…

వెళ్లి తినొచ్చు.. కాని ఫస్ట్ డేనే నిజాయితీ లేదు అంటారు అనుకున్నా…. అందుకే నిలబడి ఉన్నా…

ఎవరికైనా ఫోన్ చేసి లేదా గేమ్స్ చూసుకుందాం అనుకున్నా

ఫైనల్లీ ఫోన్ చేశారు. కాని వైభవ్ సర్ మరియు నిరంజన్ సర్ ఇద్దరూ అరుచుకుంటూ ఉన్నారు.

వద్దు… వద్దు… వద్దు… వద్దు… జస్ట్ డూ ఇట్… జస్ట్ డూ ఇట్… డూ ఇట్…. డూ ఇట్….

బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. తర్వాత నాకు ఫోన్ లో “రూమ్ నెంబర్ చెబుతాను అక్కడకు రా… వేరే పెన్ డ్రైవ్ ఇస్తా…” అని వినపడింది.

ఆహ్…. ఫోర్త్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే…

అక్కడకు వెళ్లి పెన్ డ్రైవ్ తీసుకొని వచ్చి వైభవ్ సర్ “ప్లగ్ ఇన్” అనగానే పెట్టాను.

కొద్ది సేపటికి కళ్యాణ మండపం మొత్తం చీకటి అయిపొయింది. వావ్ రిచ్ పీపుల్ కెన్ మెక్ ఎనీ థింగ్…

సడన్ గా కళ్యాణ మండపం సినిమా థియేటర్ అయిపొయింది… అలాగే అందరూ సైలెంట్ గా ఉండడం తో.. మొత్తం సైలెన్స్ అయిపొయింది.

అందరూ నవ్వుతున్నారు. అక్కడ ఉన్న స్క్రీన్ పై ఫోటోస్ వస్తున్నట్టు ఉన్నాయి.

వాళ్ళ నవ్వులు వింటూ నేను కూడా నవ్వుకుంటూ ఉన్నాను. ఫైనల్ గా ఫోన్ తీసుకొని ఆన్ లైన్ లోకి వెళ్లి పోయాను.

కింద గొడవలు అవుతున్నాయి. కొంత సేపటికి వైభవ్ సర్ నాకు ఫోన్ చేసి “పారి పో….” అన్నారు.

పారి పో…. పారి పో…. పారి పో…. అన్నారు ఫిఫ్త్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే…

దెన్… ఐ రన్… ఐ హేట్ మై హై హీల్స్…. అండ్ ఐ హేట్ ఆల్ వుమెన్ హూ సపోర్త్స్ హై హీల్స్…

దాక్కొని క్రిష్ కి ఫోన్ చేశాను… పారి పోయాను. నీకూ కాల్ చేయడమే సిక్స్త్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే…

స్టొరీ విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు.

క్రిష్ నిషా చెవి దగ్గరకు వచ్చి “బుద్ది ఉందా…. ఎలాంటి సమయంలో ఎలాంటిది చెబుతున్నావ్…”

నిషా “కదా… ఛా…. తప్పు చేశాను… ”

క్రిష్ “బయటకు వెళ్దామా….”

నిషా తల ఊపగానే ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు.

నిషా “ఈషా కి సారీ చెప్పేదా… అందరికి సారీ చెప్పేదా” అని కంగారుగా అంది.

క్రిష్, నిషాని చూస్తూ “కామ్ డౌన్… అందరూ మర్చి పోతారు…. నువ్వు మళ్ళి కేలక్కు…” అన్నాడు.

నిషా “ఓకే” అంది.

అపార్ట్ మెంట్ కిటికీ నుండి కిందకు చూడగానే కారు నుండి కిందకు దిగుతున్న కాజల్ ని చూశారు.

నిషా “అక్క వచ్చింది”

క్రిష్ తనని చూడగానే సంతోషంగా నవ్వాడు.

ఆ వెనకే మరో కారు ఆగింది. అందులో నుండి మరో స్త్రీ దిగింది. తనని చూడగానే క్రిష్ మొహం మారిపోయింది.

నిషా “క్రిష్” అంటూ పక్కకు తిరిగి చూడగా….. బూమ్… క్రిష్ కనిపించలేదు. మాయమైపోయాడు.

వెనక్కి తిరిగి చూడగా ఈషాకి మిగిలిన వాళ్ళకు కూడా చెప్పకుండా సరాసరి వేగంగా బయటకు వెళ్లి పోతున్నాడు.

ఆమె డోర్ దగ్గరకు వచ్చే సరికి, క్రిష్ ఆమె కంట కనపడ కుండా దాటేసి వెళ్ళిపోయాడు.

కాజల్ కూడా క్రిష్ ని చూసింది. అతని చేతిని పట్టుకొని “క్రిష్” అంది.

క్రిష్, కాజల్ చేతిని వదిలించుకొని, ఆమె వెనక ఎదో దెయ్యాని చూసినట్టు భయపడుతున్నట్టు, తప్పించుకొని వెళ్ళిపోయాడు.

కాజల్ కూడా వెనక్కి తిరిగి అక్కడున్న ఆమె వైపు చూసింది.

ఆమె….. రష్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *