129. బ్లడీ బాయ్స్
నిషా “గుడ్ మార్నింగ్ సర్”
నిరంజన్ ఆఫీస్ లో తన పర్సనల్ క్యాబిన్ రూమ్ లో హ్యాపీగా చిల్ అవుతూ ఉన్నాడు.
నిరంజన్ నలభై సంవత్సరాల వయస్సులో అక్కడక్కడ ఉన్న తెల్ల జుట్టుతో నీటుగా డ్రెస్ చేసుకుని హుందాగా ఉన్నాడు.
నిరంజన్ “హాయ్ నిషా… నాతో రా…” అని ఒక క్యాబిన్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
అక్కడ అన్ని క్యాబిన్స్ ఖాళీగా ఉన్నాయి. వస్తారు అనుకుంది కాని ఎవరూ లేరు.
వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యారు అనుకుంది. లేదా వర్క్ ఫ్రోం హోం చేస్తున్నారు అనుకుంది.
నిషా అక్కడ కూర్చొని HR ఇచ్చిన డీటెయిల్స్ తో లాగిన్ అయి, సెట్ రైట్ అయింది.
వర్క్ ఏమి చెప్పలేదు. మధ్యానం, నిరంజన్ దగ్గరకు వెళ్లి “సర్” అంది.
నిరంజన్ హాయిగా కూర్చొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని సినిమా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. అతని కాళ్ళు మరో కుర్చీలో పెట్టుకొని ఉన్నాడు.
నిషా “సర్” అంది.
నిరంజన్ ఆమెను చూసి “చెప్పమ్మా”
నిషా “సర్…. వర్క్” అంది.
నిరంజన్ “రేపు, చూద్దాం అమ్మా…”
నిషా నవ్వి “సరే సర్” అని వెనక్కి తిరిగి వెళ్లి పోయింది. ఆ రోజు అంతా తను కూడా చిల్ అయింది.
మరుసటి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్…. చిల్… చిల్… చిల్…
మూడో రోజు సీన్ మారిపోయింది, నిరంజన్ సర్ ఆఫీస్ కి కూడా రాలేదు.
నాలుగో రోజు నిషా ఆఫీస్ కి లేట్ గా వెళ్ళిన ఇబ్బంది లేదు ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు, పట్టించుకునే వాళ్ళు కూడా అసలు ఎవరూ లేరు.
అయిదో రోజు (శుక్రవారం) నిషా, నిరంజన్ ని అడిగింది.
నిరంజన్ “నీ వర్క్ ఏంటి?”
నిషా “మీ అసిస్టెంట్”
నిరంజన్ “నా వర్క్ ఏంటి?”
నిషా “వైభవ్ సర్ అసిస్టెంట్….”
నిరంజన్ “వైభవ్ రాలేదు, నాకు వర్క్ లేదు, నా అసిస్టెంట్ గా నీకూ కూడా వర్క్ లేదు….. ఓకే”
నిషా తల దించుకొని పళ్ళు నూరింది.
నిరంజన్ “ఒక పని చెయ్…. ఈ పేపర్ (న్యూస్ పేపర్) లో హుమ్మ్…” అని ఆలోచించి “ఇవన్నీ కూడా నాకు టైపు చేసి నా మెయిల్ కి పంపు…”
నిషా తన సిస్టం ముందు కూర్చొని టైప్ చేస్తుంది, నిరంజన్ ఎదో సినిమా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు.
నిషా కోపంగా అప్పటి వరకు రాసింది, నాలుగు సార్లు కాపీ పేస్ట్ చేసేసి మెయిల్ చేసి నిరంజన్ దగ్గరకు వెళ్లి “అయిపొయింది” అంది.
నిరంజన్ తన ఫన్ ని డిస్ట్రబ్ చేసినందుకు విసుగ్గా చూస్తూ “అపుడే అయిపోయిందా” అన్నాడు.
నిషా “యస్ సర్” అంది.
నిరంజన్ “ఓకే… యు కెన్ లీవ్…” అన్నాడు.
నిషా ఆఫీస్ నుండి బయటకు వచ్చింది.
ఇంటికి చేరుకొని టీవీ ఆన్ చేసింది. చూడాలని అనిపించలేదు. కబుర్లు చెప్పేందుకు క్రిష్ కూడా లేడు.
ఒక్క దానికే పిచ్చి పడుతున్నట్టు ఉంది. ఇంతకూ ముందు అయితే ఎక్స్ హస్బెండ్ సాత్విక్ ప్రొఫైల్ చూసుకుంటూ కుమిలిపోతూ ఉండేది.
ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయాలన్నా ఆలోచన కూడా లేదు.
క్రిష్ ఇంటి నుండి వెళ్లి మూడు వారాలు గడిచింది.
గొడవ జరిగింది, అక్క తిట్టింది వెళ్ళిపోయాడు.
ఒక వారం గడిచింది వచ్చాడు – తిట్టాడు – వెళ్లి పోయాడు.
రెండో వారం ఈషా పెళ్లి చూపులలో కలిశాం, రష్ ని చూసి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు.
మళ్ళి తన బాస్ వైభవ్ గురించి ఆలోచించింది.
తను కూడా వారం నుండి ఆఫీస్ కి రావడం లేదు.
మనసులో బ్లడీ బాయ్స్… సమస్య నుండి ఎందుకు పారిపోతారు.
రష్ విషయంలో తప్పు క్రిష్ ది కాదు. పెళ్లి విషయంలో వైభవ్ ది తప్పు కాదు.
అయినా వీళ్ళే తప్పు చేసినట్టు పనిష్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు?
టీవీ ఆన్ చేస్తే… దేవదాసు వస్తుంది. ANR తెగ తాగుతున్నాడు, పార్వతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే దేవదాసు ఎందుకు తనని తాను పనిష్ చేసుకుంటున్నాడు.
బ్లడీ బాయ్స్….. వీక్ బాయ్స్…… అనుకుంటూ తిట్టుకొని వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న రెండు బీర్ లలో ఒకటి తీసుకొని తాగుతూ కూర్చుంది.
కొద్ది సేపటికి కాజల్ వచ్చింది.
వస్తూనే… బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చి కిచెన్ లోకి వెళ్లి వంట చేసింది.
అప్పుడు వచ్చి నిషా పక్కనే కూర్చొని దిగులుగా కూర్చొని క్రిష్ గురించి ఆలోచిస్తుంది.
నిషా పళ్ళు నూరుకుంటూ చూసింది, ఎందుకె తాగుతున్నావ్? అని కాని, కొత్త ఆఫీస్ ఎలా ఉంది అని కాని కాదు.. తిట్టేసి వెళ్లి పోయిన వాడి గురించి ఆలోచిస్తుంది.
ఆఫీస్ లో ఉన్న ఫ్రస్త్రేషన్, ఇప్పుడు తినబోయే తన అక్క వంట మీద ఉన్న ఫ్రస్త్రేషన్, బాయ్స్ మీద ఫ్రస్త్రేషన్ అంతా కలగలిపి పక్కనే అక్క వైపు గడ్డం కింద చేయి పెట్టుకొని కోపంగా చూస్తుంది.
కాజల్ ఆలోచిస్తూ ఉంది కాని నిషా వైపు అసలు చూడలేదు, సడన్ గా “క్రిష్ తిన్నాడో లేదో” అంది.
నిషా మనసులో ఈ కోపం అంతా క్రిష్ మీదకు వెళ్లి పోయింది.