కాలేజ్ బాయ్ Part 18 Like

అందుకే మనల్ని కలిసి మోసం చేసి డబ్బు తీసుకొని వెళ్ళాడు.

ఆ డబ్బుతో ఆ పిల్లాడిని బాగు చేయించాడు.

కానీ…

మరో పెద్ద విషయం జరిగింది.

సందీప్ కుటుంబంలో యాక్సిడెంట్ జరగడంతో అతని తమ్ముడు ఫ్యామిలీ, తన తల్లి అందరూ చనిపోయారు. ఇంట్లో సందీప్ వాళ్ళ నాన్న, తను తప్ప ఎవరూ బ్రతకలేదు.

వారసుడు కావాలి అని ఆలోచించి… రష్ ని తిరిగి కలిసి ఆమెను వెనక్కి తీసుకొని వెళ్ళే ప్రపోజల్ పెట్టారు.

హాస్పిటల్ లో ఉన్న పిల్లాడిని చూడడానికి వెళ్ళిన క్రిష్ కి ఒక లెటర్ కనపడింది. దాని పై ఒత్తుడుకు అతను కట్టిన తాళిని ఉంచింది.

“నా ఫ్యామిలీ వచ్చింది నేను వెళ్తున్నా… బాగా చదువుకో… బాయ్…”

ఆమె అతని ఫస్ట్ లవ్….

ఆమె కోసం అన్ని చేశాడు…

అన్ని కోల్పోయాడు…. సొంత కుటుంబం కూడా అతన్ని దూరం పెట్టింది….

కానీ అతని బావ మిస్టర్ కేశవ్, సెక్యూరిటీ ఆఫీసర్ కావడంతో అసలు నిజం తెలుసుకొని ఆంటీ వాళ్లకు చెప్పి క్రిష్ ని కలుద్దాం అని డబ్బు తీసుకొని హాస్పిటల్ కి వచ్చారు.

క్రిష్ ఒక్కడే హాస్పిటల్ లో ఉన్నాడు. అతని చేతిలో లెటర్, ఆ పక్కనే పెట్టిన తాళి….

ఆంటీ వాళ్ళు, కేశవ్ లు క్రిష్ ని పిలిచినా క్రిష్ అందరిని వదిలేసి దూరం వెళ్ళిపోయాడు.

ఎవరిని పలకరించాలని చూసినా క్రిష్ పలకలేదు.. కలవలేదు..

మొత్తం విన్నాక నిషా ఏం మాట్లాడలేదు. తను విన్న కధకి, ఇప్పుడు తన గురించి విన్న కధకి చాలా తేడా ఉంది.

నిషా “క్రిష్ చాలా జోక్ గా నవ్వుతూ చెప్పేశాడు”

కాజల్ “హుమ్మ్… నవ్వుతూ ఉంటాడు…. ఎంత నొప్పి ఉన్నా నవ్వుతూ ఉంటాడు”

నిషా “ఇది అంతా నీకు ఎలా తెలుసు…. క్రిష్ చెప్పాడా”

కాజల్ “ఎప్పటికి చెప్పడు… మెల్ ఈగో…”

నిషా “నీకెలా తెలుసు…”

కాజల్ “ప్రేమించాను…. అందుకే తెలుసుకున్నాను”

నిషా “అసలు ఈ సారి కనపడితే కొట్టాలి” అని కోపంగా పైకి లేచింది.

మళ్ళి అటూ ఇటూ తిరుగుతూ “సిగ్గు ఉందా వాడికి అసలు….”

కాజల్ “ఏమయింది?”

నిషా “ఇంత జరిగాక కూడా సిగ్గు లేకుండా… రష్ కనపడగానే అలా రియాక్ట్ అయ్యాడు”

కాజల్ నవ్వుతుంది.

నిషా “ఎందుకు నవ్వుతున్నావ్….”

కాజల్ “ఆ రోజు క్రిష్ వెళ్ళిపోయింది రష్ ని చూసి కాదు… ఆమె చేతిలో ఉన్న పిల్లాడిని చూసి… రష్ మానసిక ఇబ్బంది వల్ల, ఆ పిల్లాడు క్రిష్ కి బాగా అలవాటు… రష్ ని విడిపోయే టైం కి వాడికి పదిహేను నెలలు… క్రిష్ ని నాన్న అని పిలుస్తూ ఉంటాడు. రష్ వడిలో ఉన్న పిల్లాడు అందరిలో తనని అలా పిలిస్తే ఇబ్బంది అని అక్కడ నుండి అర్జెంట్ పని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు”

పదిహేను నిముషాలు ఎవరూ ఏం మాట్లాడలేదు.

కాజల్ “క్రిష్ తన ఫోన్ లో మెసేజెస్ ఎప్పటివి అప్పుడు డిలీట్ చేస్తాడు. కాని వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిన మెసేజెస్ మాత్రం అలాగే ఉంటాయి. అవి సిల్లి అయినవే అని తెలిసినా….”

ఒక నిముషం తర్వాత…

కాజల్ “ఒంటరిగా ఉంటె క్రిష్ కూర్చొని ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటాడు. మనం మాట్లాడితే…. నవ్వేస్తాడు.. నవ్విస్తాడు..”

నిషా “క్రిష్ గురించి చాలా తెలుసు అనుకున్నాను”

కాజల్ “హుమ్మ్…”

నిషా “ఇప్పుడెం చేస్తావ్… ఈ నెలలో క్రిష్ కి ఎక్సాంమ్స్ పూర్తీ అవుతాయి. వెళ్ళిపోతే, మళ్ళి కనపడడు” అంది.

కాజల్ మొహం బాధగా మారిపోయింది

ఇంతలో బయట నుండి పెద్ద సౌండ్…. ఫ్లవర్ పాట్ పగిలిన సౌండ్…

కాజల్ కూర్చొని ఆలోచిస్తూ ఉంది.

నిషా చూసి వచ్చి “హలో మేడం గారు…. క్రిష్ తాగి వచ్చి గొడవ చేస్తున్నాడు….”

కాజల్ “వాట్” అంటూ పైకి లేచి చూస్తుంది.

నిషా “చూడు తాగి వచ్చి బూతులు తిడుతున్నాడు” అంది.

కాజల్ చిన్నగా నవ్వుతూ “క్యూట్ గా ఉన్నాడు కదా” అంది.

నిషా తల కొట్టుకొని “వాడు… ఆరు అడుగులు ఎద్దులా ఉంటాడు… నువ్వు క్యూట్ అంటున్నావ్” అంది.

కాజల్ కోపంగా నిషాని చూసింది.

నిషా “సరే, ఏడవకు…. క్యూట్ గానే ఉన్నాడు” అంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *