కాలేజ్ బాయ్ Part 19 14

నిషా “మీ ఇంట్లో వాళ్ళు మా అక్కని ఒప్పుకుంటారా….”

క్రిష్ “ఎందుకు ఒప్పుకోరు? నా ఏంజెల్ కి ఏం తక్కువ?”

నిషా “నీకు వయస్సు తక్కువ….”

క్రిష్ నవ్వుతూ నిషా ని చూశాడు.

నిషా “అలా అని కాదు, నాకు కూడా మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టమే… కానీ… కానీ…”

క్రిష్ “నా వయస్సు తక్కువ…. ”

నిషా “హ్మ్మ్”

క్రిష్ “జాబ్ కూడా మీ అక్క పని చేసే కంపనీలో ట్రైనీగా జాయిన్ అవ్వబోతున్నాను”

నిషా “హ్మ్మ్”

క్రిష్ “మా ఫ్యామిలీ ఒప్పుకుంటారో లేదో… మీ అక్కని ఇబ్బంది పెడతారు ఏమో…”

నిషా “హుమ్మ్ అవునూ…”

క్రిష్ “అవన్నీ నాకు ఏం ఇబ్బంది లేదు… నేను చూసుకుంటా…” అంటూ పైకి లేచాడు.

నిషా “మా అక్కకి పిల్లలు పుట్టరు…”

క్రిష్ “పర్లేదు…. ఎవరినైనా దత్తత తీసుకుంటా…”

నిషా “మా అక్క నన్ను కూడా నిన్ను రెండో పెళ్లి చేసుకోమని అడిగింది”

క్రిష్, చిన్నగా నవ్వి “నువ్వు ఏం చెప్పావ్…”

నిషా “క్రిష్ నువ్వు మంచి వాడివే… కానీ…”

క్రిష్ “మనిద్దరి మధ్య అంత కానీలు అవసరం లేదు.. మనిద్దరం ఒకరికి ఒకరం సెట్ అవ్వము…”

నిషా “థాంక్స్” అని ఊపిరి పీల్చుకుంది.

క్రిష్ “సరే, నీ లవర్ గురించి చెప్పూ…”

నిషా “ఏం.. ఏం.. లవర్….” అంటూ తత్తర పడింది.

క్రిష్ “నాకు తెలుసు..”

నిషా “నీకు వైభవ్ ముందే తెలుసా…”

క్రిష్ తల ఊపాడు.

నిషా “మంచి వాడేనా…”

క్రిష్ “హ్మ్మ్, కానీ…”

నిషా “తెలుసు…. అఫైర్స్ ఉన్నాయ్… ఇక నుండి పెట్టుకోను అని చెప్పాడు”

క్రిష్ “ఓహో”

నిషా “ఏం చేసేది… పోనీ…. పోనీ…. వైభవ్ కి విడాకులు ఇచ్చేసేదా…..”

క్రిష్ “పెళ్లి కూడా చేసుకున్నావా…” అంటూ షాక్ లో నోరు మూసుకున్నాడు.

నిషా “నీకు తెలియదా… మరి తెలుసు అన్నావ్…” అంటూ క్రిష్ చేతి మీద కొట్టింది.

క్రిష్ “నెల రోజుల్లో చాలా మారిపోయావు” అంటూ తల అడ్డంగా ఊపాడు.

152. సింగిల్ – మింగిల్

కాజల్ “ఈ నెల రోజులు ఎలా ఉన్నావ్…”

క్రిష్ “బాగానే ఉన్నాను…”

కాజల్ “మిస్ అయ్యాను అని చెప్పొచ్చు కదా….”

క్రిష్ “హహ్హహ్హ మిస్ అయ్యాను”

కాజల్ “నిద్రపోవడం కోసం ఏం చేశావ్….”

క్రిష్ షాకింగ్ గా కాజల్ వైపు చూశాడు.

కాజల్ తల దించుకొని నాకు తెలుసు అన్నట్టు చూసింది.

క్రిష్ నిజం చెప్పకూడదు అని అనుకుంటూ “నిన్ను గుర్తు తెచ్చుకొని ఊపుకొని పడుకునే వాడిని, తర్వాత నిద్ర పట్టేసేది” అన్నాడు.

కాజల్ కోపంగా చూస్తూ క్రిష్ భుజం మీద గిచ్చింది.

క్రిష్ “అబ్బా” అని రుద్దుకుంటూ ఉన్నాడు.

కాజల్, క్రిష్ దగ్గరకు జరిగి క్రిష్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని అతని చేతి వేళ్ళలో తన వేళ్ళతో బంధించి అతని భుజం పై వాలిపోయింది.

ఇద్దరి మధ్య నిముషాలు క్షణాలులాగా గడిచిపోయినా ఇద్దరికీ అలానే ఉండిపోవాలి అని అనిపించింది.

క్రిష్ “నువ్వు గుర్తు వచ్చే దానివి…. ప్రతి రోజు… ప్రతి రాత్రి…” అన్నాడు.

కాజల్ పైకి లేచి, క్రిష్ కళ్ళలోకి చూస్తూ “సెక్స్ రిలేటడ్ చెబితే మూతి పగలకోడతా….”

క్రిష్ “హహ్హహ్హ” అని చాలా సేపు నవ్వాడు, కాజల్ తల పైకెత్తి అతని నల్లటి కళ్ళలో తన ప్రతి బింబం చూసి, దూరం జరగాలని అనుకున్నా క్రిష్ తనని దగ్గరకు లాక్కున్నాడు.

కొద్ది సేపటి తర్వాత… కాజల్ “చెప్పూ… ఎప్పటి నుండి నువ్వు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నావ్”

క్రిష్ సైలెంట్ గా చాలా సేపు ఉన్నాడు, ఆమె వైపు చూసి అదేం లేదు అని చెబుదాం అనుకున్నాడు కాని ఆమె వదిలేలా లేదు అని అర్ధం అయింది.

కాజల్ “రష్ వల్లే కదా…”

క్రిష్ షాకింగ్ గా చూస్తూ “నీకు ఏం తెలుసు…”

కాజల్ “విన్నాను”

క్రిష్ చిన్నగా నవ్వి మళ్ళి మామూలు అయిపోయాడు. అతని కళ్ళలో వచ్చి వెళ్ళిన పెయిన్ ని ఆమె గమనిస్తూనే ఉంది.

క్రిష్ “ఐ మిస్ హిమ్…” అన్నాడు.

అతని కళ్ళలో వచ్చిన తడిని వెంటనే కవర్ చేసుకుంటూ దూరం జరగబోయాడు, కాని కాజల్ వెళ్ళ నివ్వలేదు.

క్రిష్ సరే అనుకుంటూ ఆమె వైపు చూస్తూ “ఉదయాన్నే ఇంట్లో వస్తువుల కోసం వెళ్ళే వాడిని, ఫోన్ లో షేర్స్ గురించి చూసుకుంటూ కస్టమర్స్ తో కాంటాక్ట్ అయ్యే వాడిని, సాయంత్రం వేరే వర్క్ చేసుకొని అలిసి పోయి ఇంటికి వస్తే నా కోసం ఇంట్లో ఎదురు చూసే ఒక భార్య…. నన్ను చూడగానే నాన్న అనుకుంటూ వచ్చే నా కొడుకు….” అన్నాడు.

కాజల్ అతన్నే చూస్తూ ఉంది.

క్రిష్ “చిన్నప్పటి నుండి ఆమెను చూస్తూ ప్రేమించాను, కాని బయటపెట్టలేను… తనకు పెళ్లి అయి వెళ్ళిపోయాక అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ అంటూ రోమాన్స్ అంటూ పిచ్చి పనులు అన్ని చేసి నిత్య చేతిలో చిక్కాను”

కాజల్ “ఆమెను ఇంకా ప్రేమిస్తున్నావా!”

క్రిష్ చిన్నగా ఒక పొడి నవ్వు నవ్వి “తను నన్ను వదిలి వెళ్లిపోయినా నేను అర్ధం చేసుకున్నాను కాని నానిని నాకు దూరం చేసింది… ప్రేమ… ఆ ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *