కాలేజ్ బాయ్ Part 20 23

154. నేను ఒప్పుకోను

నిషా నా వైపు కోపంగా చూస్తూ ఉంది. అంతలో ఇషా డోర్ వైపు చూస్తూ “ఎవరూ కావాలండి?” అని అడిగింది.

నిషా మరియు నేను ఇద్దరం డోర్ వైపు చూశాం.

డోర్ దగ్గర ఒక 25 సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంది.

క్రిష్ “లావణ్య” లావణ్య “క్రిష్”

క్రిష్ “ఇక్కడేం చేస్తున్నావ్….”

లావణ్య “నీతో మాట్లాడాలి…”

క్రిష్ “గెట్ అవుట్….”

లావణ్య “క్రిష్…”

క్రిష్ “ఐ సెడ్ గెట్ అవుట్….” అని ఇంకా పెద్దగా అరిచాడు.

కాజల్ గదిలో నుండి బయటకు వచ్చి మరి చూసింది. ఈ ఆరు నెలలలో క్రిష్ ని ఇంత కోపంగా చూడలేదు.

లావణ్యకళ్ళ నీళ్ళతో అక్కడే నిలబడింది.

నిషా చేయి చూపిస్తూ “నెంబర్ 4” అని అడిగింది.

నేను చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపి… ముందుకు చూశాను.

ఇంతలో 50 సంవత్సరాల పెద్ద వయస్సు వ్యక్తీ మిస్టర్ ప్రభు (ప్రభు ఇన్వెస్ట్మెంట్స్ చైర్మన్) వచ్చాడు.

సూట్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ లో కనిపిస్తున్న తనని చూస్తూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ప్రభు “క్రిష్” అన్నాడు.

క్రిష్ “మీరు ముందు వెళ్ళండి…. నేను మాట్లాడి డైరక్ట్ గా అక్కడకు వస్తాను”

కాజల్ “నిజంగా వస్తావు కదా….”

క్రిష్ “ఏం మాట్లాడుతున్నావ్…. నువ్వు జాగ్రత్తగా వేళ్ళు… నేను వచ్చేస్తాను”

ఇషా “ఎవరు తను….”

నిషా “ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది”

ఇషా “సినిమాల్లో యాక్టర్ ఏమో?”

నిషా “కాదు…. ఎక్కడో చూశాను”

క్రిష్ “నేను ఒప్పుకోను”

ప్రభు “నేను ఇంకా అడగలేదు”

క్రిష్ “నాకు వద్దు…”

ప్రభు “నేను ఇన్నాళ్ళు కూడా నీ అంత పవర్ ఫుల్ మైండ్ ని చూడలేదు… ఇది నువ్వు మాత్రమే చేయగలవు”

క్రిష్ “రేపు నేను కూడా నూతన్ లా మారిపోతే….”

ప్రభు “నువ్వు అలా చేయవు…”

క్రిష్ “మునిగిన వాడికే లోతు తెలుస్తుంది…. నేను ఏం పడ్డానో నాకు మాత్రమే తెలుస్తుంది”

ప్రభు “క్రిష్…. అలా ప్రతి సారి నో చెప్పకు…. ఇది నీ చేతికి ఇస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను”

క్రిష్ “నో…”

ప్రభు “లావణ్యని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు”

క్రిష్ విసుగ్గా ప్రభు వైపు చూశాడు.

ప్రభు తల పక్కకు తిప్పుకొని “సారీ….”

క్రిష్ మనసులో తనకు కాబోయే భార్యని తలుచుకొని చిన్నగా నవ్వుకున్నాడు. మెల్లగా అతని మనసు కుదుటపడింది. అతని మొహం పై చిన్నగా చిరునవ్వు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *