ప్రభు “నా వారసుడుగా నిన్ను ప్రకటిస్తాను”
క్రిష్ “అవసరం లేదు” అన్నాడు.
ప్రభు “కంపనీ నీకు ఇచ్చేస్తాను”
డోర్ దగ్గరకు వెళ్ళిన క్రిష్ డోర్ నాబ్ పై చేయి పెట్టి ఆగిపోయాడు.
ప్రభు “నిన్ను చైర్మన్ గా ప్రకటిస్తాను, నా వారసుడుగా ప్రకటిస్తాను”
క్రిష్ నవ్వుతూ “పిచ్చోడిలా కనిపిస్తున్నానా!” అన్నాడు.
ప్రభు “ఇది నా వీలునామా…. నా యావధాస్తి, నీకే చెందుతుంది” అంటూ బ్రీఫ్ కేస్ నుండి తన వీలు నామా బయటకు తీశాడు.
క్రిష్ “వాట్” అని ముందుకు వచ్చి చదువుతూ “క్రేజీ…. క్రేజీ…. మరి నూతన్ వస్తే…. ఏం చేస్తారు…. ఓహ్… మర్చి పోయా…. ఇప్పుడు అర్ధం అయింది” అంటూ నవ్వుతున్నాడు.
ప్రభు “ఏం అర్దం అయింది”
క్రిష్ “నూతన్ తిరిగి వస్తే…. మీ అందరూ దాక్కొని నన్ను బలి పశువుని చేస్తారు… అంతే కదా… అంతేలే.. మేమిద్దరం కొట్టుకుంటూ ఉంటే… మీరు తప్పించేసుకుంటారు…. అంతే కదా…. అర్ధం అయింది…”
ప్రభు చిన్నగా నవ్వి “నిజం చెప్పూ….. నేను లైమ్ లైట్ వేయకపోయినా నూతన్ నిన్ను టార్గెట్ చేస్తాడు”
క్రిష్ “నాకు అదే అర్ధం కాదు… ఏటో పోయే వాడిని…. పిలిచి తమ్ముడు అన్నాడు… ఆ తర్వాత జీవితంలో చెప్పుకోలేనంత హెల్ప్ చేశాడు. సడన్ గా నా జీవితంలో కస్టాలు సృష్టించి నన్ను చంపబోయాడు… అసలు నాకు ఏం అర్ధం కావడం లేదు. అసలు నేను తనకు ఏం చేశాను, మీకు ఏం చేశాను…. అసలు మీ గొడవలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు”
ప్రభు ఏం మాట్లాడలేదు.
క్రిష్ “వద్దు అంకుల్…. అసలు ఏం వద్దు…. నేను పెళ్లి చేసుకుంటాను. నా జీవితం నార్మల్ గా హ్యాపీగా ఉంటాను”
ప్రభు “సరే నీ ఇష్టం నేను బలవంతం చేయలేను…. ఇదిగో నువ్వు అడిగిన గిఫ్ట్…” అంటూ ఒక కవర్ యిచ్చాడు.
క్రిష్ అది అందుకొని ఓపెన్ చేసి చదువుతూ “థాంక్స్” అన్నాడు.
ప్రభు “నూతన్ వస్తే…. నా దగ్గరకు రా…. నేను హెల్ప్ చేస్తా….”
క్రిష్ “హ్మ్మ్” అంటూ ఆ బాండ్ పేపర్ చదువుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు.
ప్రభు “నా వీలునామా ప్రకారం నువ్వే నా వారసుడివి….”
క్రిష్ “నీకేమి అంత వయస్సు అయిపోలేదు…. కంగారు పడకు….” అనుకుంటూ ఆ బాండ్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
ప్రభు బయటకు నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కాడు. లావణ్య అతని పక్కనే కూర్చుంది.
క్రిష్ ఆ బాండ్ పేపర్లు జాగ్రత్తగా కవర్ లో సర్దుకొని కారు దిగిపోయాడు.
ప్రభు దగ్గుతూ ఉంటే, లావణ్య ముందు ఉన్న చిన్న మెడికల్ బాక్స్ నుండి ఒక టాబ్లేట్ తీసి ఇచ్చింది.
ఇంతలోనే నోటికి అడ్డం పెట్టుకున్న కర్చీఫ్ ఎరుపు రంగులోకి మారిపోయింది.
లావణ్య ఇచ్చిన వాటర్ తీసుకొని టాబ్లేట్ వేసుకుంటూ వాటర్ తో బలవంతంగా మింగాడు.
లావణ్య “క్రిష్ కి మీ కండీషన్ తెలుసా!”
ప్రభు తల అడ్డంగా ఊపాడు.
లావణ్య “ఎందుకు అంకుల్….. క్రిష్ కి మొత్తం రాశారు”
ప్రభు తల పైకెత్తి లావణ్యని చూసి నవ్వుతూ “తను మాత్రమే హ్యాండిల్ చేయగలడు కాబట్టి…”
లావణ్య “నాన్ సెన్స్… అతనికి మీ మీద గౌరవం కూడా లేదు. అసలు మీకు కుటుంబం లేకపోయినా మీరు మా లాంటి చాలా మంది అనాధలకు సాయం చేశారు. మేమందరం మంచి పొజిషన్ లలో ఉన్నాం… మమ్మల్ని అందరికి కాదని… ఈ క్రిష్…. అసలు ఏముంది అతనిలో….”
ప్రభు “హహ్హహ్హ” అని నవ్వాడు.
లావణ్య “ఎందుకు నవ్వుతున్నారు”
ప్రభు “నువ్వు బాధ పడను అంటే… ఒక మాట చెప్పనా…”
లావణ్య “చెప్పండి….”
ప్రభు “విడి సమయంలో అందరూ విజేతలే….. కాని యుద్ధం వచ్చినపుడు మాత్రం వీరుడు మాత్రమే నిలబడతాడు….”
లావణ్య విసుగ్గా “హ..” అని నవ్వింది.
ప్రభు “యుద్ధం అయిపోయాక, వీరుడు మాత్రమే నష్ట పోతాడు… నూతన్ తిరిగి వస్తే… క్రిష్ ఎక్కడున్నా, ఏ పొజిషన్ లో ఉన్నా ఈ ఫైట్ లోకి వస్తాడు… వచ్చేస్తాడు… ఎందుకంటే తనకు తెలుసు ఇది తన యుద్ధం… యుద్ధం అయ్యాక తను నష్ట పోకుండా ఈ సాయం చేయాలని అనుకుంటున్నాను”
లావణ్య “అయితే… ఎంతో కొంత ఇచ్చేయొచ్చు… ఇలా మీ ఆస్తి మొత్తం రాసేస్తారా! అసలు వాడికి ఏం తెలుసనీ…”
ప్రభు “క్రిష్ గురించి నేను కూడా చెడ్డగా విని అతనికి కస్టాలు క్రియేట్ చేశాను… కాని ప్రతి సారి నవ్వుతూ గెలిచాడు… నూతన్ అంత పెద్ద సమస్య క్రియేట్ చేస్తే అందరం గజ గజలాడిపోయం…. ఒక్కడే నిలబడ్డాడు”
లావణ్య “నూతన్ బ్రతికి లేడు… ఉండి ఉంటే ఈ పాటికి తెలిసేది… అందరి చేత వెతికిస్తున్నాము….. ప్చ్….”
ప్రభు చిన్నగా నవ్వుతూ ఉన్నాడు.
లావణ్య “అసలు మీరు నూతన్ ని ఎందుకు తప్పు పడుతున్నారు…. ఏమో క్రిష్ తప్పు ఉందేమో మనకు తెలియదు కదా… పైగా వాడితో నా పెళ్లి కూడా ప్రపోజ్ చేశారు నన్ను అడగకుండా… ఛీ…” అంది.
ప్రభు చిన్నగా నవ్వాడు.
లావణ్య “అంత నవ్వొచ్చే విషయం ఏమి ఉంది”
ప్రభు “చిన్నప్పుడు…. ఒక పిల్లాడు ఒక టేబుల్ కి తగిలి కింద పడితే… ఆ టేబుల్ ని ‘అమ్మా’ అని కొట్టి ఆ పిల్లాడిని బుజ్జగిస్తాం…. కదా”
లావణ్య”హ్మ్మ్…. అవునూ”
ప్రభు “కాని అక్కడ ఆ టేబుల్ తప్పు ఏమయినా ఉందా…. లేదు…. ఆ పిల్లాడి తప్పే ఉంది కాని మనకు ఆ పిల్లాడిని ఏమి అనం…. ఎందుకంటే…. ఆ పిల్లాడితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది… ఆ టేబుల్ తో లేదు”
లావణ్య “అయితే….”
ప్రభు “నూతన్ నీకు చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి….. తప్పు నూతన్ దే అయినా… క్రిష్ తో విభేదిస్తున్నావ్”
లావణ్య “అంకుల్…”