లాయర్ “మరి నూతన్…”
ప్రభు “నూతన్ ఎవరూ?”
లాయర్ “సరే…” అంటూ తల ఊపాడు.
ప్రభు “నేను కోపంలో చేస్తున్నా అనుకున్నావా…”
లాయర్ “కాదా! నూతన్ ని నువ్వు చిన్నప్పటి నుండి పెంచావు… ఎదో చిన్న తప్పు చేసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు అని ఇలా చేస్తావా!”
ప్రభు “…”
లాయర్ “నూతన్ ని మొదట చూసినపుడు ఏమన్నావ్…. దీపం లాంటి వాడు అందరిని బ్రతికిస్తాడు అన్నావ్… ఇప్పుడు కోపం వచ్చి క్రిష్ ని ఎంచుకున్నావ్…”
ప్రభు దగ్గుతూ రక్తం కక్కాడు.
లాయర్ కంగారుగా ప్రభుని కూర్చోబెట్టాడు.
కొద్ది సేపటికి ప్రభు కోలుకున్నాడు, అనిపించినా తర్వాత లాయర్ మళ్ళి మొదలు పెట్టాడు.
లాయర్ “కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకోకు…. నూతన్ మంచి వాడు… నువ్వు అతన్ని అర్ధం చేసుకోలేదు”
ప్రభు “నేను కోపంలో కాదు భయంతో చేస్తున్నాను…. నూతన్ ని అర్ధం చేసుకున్నాను కాబట్టి, ఆ భయంతో చేస్తున్నాను”
విజయ్ “ఇంతకీ… ఆ క్రిష్ ఎక్కడ ఉన్నాడు… అతని ఎక్స్.వైఫ్ రష్ ఏం చేస్తుంది”
శ్రిలీల “తెలియదు… నాకు కూడా డౌట్ గా ఉంది… మళ్ళి కలిస్తే ఏం చేస్తారు….”
విజయ్ “త్వరలో… సెక్యూరిటీ ఆఫీసర్ కేశవ్ పెళ్ళిలో ఇద్దరూ కలవబోతున్నారు… మిత్రులు అవుతారు లేదా శత్రువులు అవుతారు… దేనికైనా మనం సిద్దంగా ఉండాలి”
శ్రిలీల “క్రిష్ ని మనం కంట్రోల్ చేయలేం….”
159. ఎక్సైట్మెంట్ – పనిష్మెంట్
నిషా “పోద్దుపోద్దున్నే దీని గోల ఏంటి?”
క్రిష్ “మరే, ఇప్పుడే ఎక్సామ్స్ అయిపోయాయి అనుకుంటున్నా, తగలబడింది”
లావణ్య “మిస్టర్ క్రిష్…. మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కేశవ్ గారి పెళ్ళికి వెళ్తున్నారు….. పెళ్లి ఉదయం పడకెండు గంటలకు జరుగుతుంది… మీ కోసం కొద్ది సేపట్లో సిటిలోనే ప్రొఫెషనల్ స్టైలిస్ట్ మరియు డిజైనర్ డిజైన్ చేసిన డ్రస్సేస్ వస్తున్నాయి”
నిషా నేను ఇద్దరం ఒకరి మొహం ఒకరం చూసుకొని తిరిగి లావణ్య వైపు అయోమయంగా చూడగానే…
లావణ్య “నాకు కూడా రోజు నీ మొహం చూడడం ఇష్టం లేదు కాకపోతే… ప్రభు అంకుల్ నన్ను నీ పర్సనల్ అసిస్టెంట్ ని చేశారు”
నిషా నా చెవి దగ్గరకు వచ్చి “అసలు దీనికి నీకు సంబంధం ఏంటి? నిజంగా ఇది నెంబర్ 4 కాదా….”
నేను కూడా తన చెవిలో “ఇది నా కాలేజ్ మేట్….. మొహం చూపించకుండా నాకు ప్రతి నెలా ఒక లవ్ లెటర్ రాసి నా బుక్స్ లో పెట్టేది….. నేను చించేసేవాడిని”
నిషా “బాగానే ఉంది కదా, బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి ఒక తొక్కు తోక్కక పోయావా! నీ వెనకాలే నేను కూడా తొక్కుతా….”
క్రిష్ “రామా…. రామా…. ఏం మాట్లాడుతున్నావ్?…. నాకు ఇప్పుడు పెళ్లి అయిపొయింది”
నిషా నన్ను చూసి “అబ్బాహ్… ” అని నోరు తెరిచి “సరే…. కానివ్వు నేను కూడా చూస్తా….” అని తల ఊపింది.
లావణ్య “మీ రోమాన్స్ అయ్యాక నాతొ కూడా మాట్లాడుతారా!” అని అడిగింది.
లావణ్య “అంటే నాకు వినపడకుండా మీరు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు కదా…”
నేను నోరు తెరిచి ఇది అని చెప్పబోయేంతలో…
నిషా “ఎప్పటి నుండి పర్సనల్ సెక్రటరీలు బాస్ ల సీక్రెట్స్ తెలుసుకుంటున్నారు” అని అడిగింది
లావణ్య నోరు తెరిచి “అది క్రిష్…”
నిషా “బాస్ అని పిలవలేవా!”
లావణ్య “మేమిద్దరం… క్లాస్ మేట్స్”
క్రిష్ “వేరే వేరే క్లాస్…. నేను ఎప్పుడూ తనతో మాట్లాడను కూడా లేదు”
లావణ్య “కాని మనిద్దరం…”
నిషా “షట్ అప్…”
నిషాని చూసి నేను కూడా స్టన్ అయ్యాను.
నిషా రెండూ చేతులు నడుము మీద పెట్టుకొని లావణ్యని కోపంగా చూస్తూ ఉంది.
లావణ్య తత్తరపడుతూ ఉండగానే నిషా తర్వాత ప్రశ్న వదిలింది.
నిషా “టైం ఎంత అయింది”
లావణ్యతో పాటు నేను కూడా ఫోన్ లో టైం చూశాను.
లావణ్య “తొమ్మిది అయింది” అని చిన్నగా చెప్పింది.
నిషా “పెద్దగా చెప్పూ”
లావణ్య పెద్దగా “తొమ్మిది అయింది” అని చెప్పింది.
నిషా “పెళ్లి పడకెండు గంటలకు…. అంటే దానికి గంట ముందు ఉండాలి… అంటే పది గంటలకు అక్కడ ఉండాలి…. దాని కోసం ఇక్కడ తొమ్మిది పదిహేనుకు బయలు దేరాలి…. ఇప్పుడు తొమ్మిది అయింది….. నీ ప్రొఫెషనల్ డిజైనర్స్ ఎప్పుడూ వస్తారు… ఎప్పుడూ రెడీ అవ్వాలి” అంది.
లావణ్య గుటకలు వేసి ఎదో మాట్లాడదాం అని నోరు తెరిచి ఎదో అనేంతలో…
నిషా “పర్సనల్ సెక్రటరీ అంటే చాలా పనులు చేయాలి…. బాస్ ఉన్నా లేకపోయినా…. పని జరిగేలా చేయాలి…. అవసరం అయితే మాట పడాలి…. మాట అనాలి…. నువ్వు ఏం చేస్తున్నావ్…. నీ బాస్ మీద అరుస్తున్నావ్….”
లావణ్య మొహం లో ఏడుపు వచ్చేసింది. నాకే చూస్తే జాలి వేసింది.
నిషా “నీకు ఇప్పుడు ఉంది ఒక్కటే పని…. టైం మేనేజ్ చేయడం అది కూడా చేయలేక పోతున్నావ్….” అంది.
ఇంతలో కాజల్ కూడా బయటకు వచ్చి నన్ను చూసి “ఏంటి?” అన్నట్టు సైగ చేసింది, నేను చిన్నగా నిషా చూడకుండా పక్కపక్కకు జరుగుతూ కాజల్ పక్కకు వచ్చాను.
లావణ్య “నన్ను నేను మార్చుకుంటాను మేడం…” అంది.
నిషా “అవునా…. అయితే ఎలా చేస్తావు చెప్పూ….”
లావణ్య బహుశా దీన్ని ఎందుకు కదిలించాను రా అనుకుంటుంది.
కాజల్ “ఏంటి రా… పోద్దుపోద్దున్నే పాపం తిట్టిస్తున్నావ్…”
క్రిష్ “నేనేం చేయలేదు…”
కాజల్ “మధ్యలో వేళ్ళకు మనల్ని కూడా తిడుతుంది”
క్రిష్ “మ్మ్” అనుకుంటూ మెల్లగా గదిలోకి వెళ్ళిపోయాను.
నిషా కోపంగా చూస్తూ “ఎలా చేస్తావ్…. చెప్పూ” అని పెద్దగా అరిచింది.
లావణ్య కంగారులో తన చేతిలో ఉన్న ఫోన్ ని కూడా వదిలేసింది.
కాజల్ “వదిలేయ్యవే…. మరి భయపెడుతున్నావ్…” అంది.
నిషా “నువ్వు ఉండక్కా ఇలాంటి ఇర్రేస్పాన్సిబుల్ మనుషులు మన చుట్టూ ఉంటే మన పరువు పోతుంది”
కాజల్ “వాళ్ళను వద్దని చెప్పూ…” అని లావణ్యని చూసి చెప్పింది.
లావణ్య హమ్మయ్యా అనుకోని తల గుండ్రంగా ఊపింది, కిందకు వంగి ఫోన్ తీసుకొని కాల్ చేసింది.
నిషా ముందుకు నడిచి ఫోన్ లాక్కొని “మార్నింగ్ సర్…” అంటూ కొద్ది సేపూ మాట్లాడింది.
నిషా కాజల్ మరియు లావణ్య ని మరియు అప్పుడే బయటకు వచ్చిన క్రిష్ ని చూస్తూ,
నిషా “పెళ్లి xxxx హోటల్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది… అదే హోటల్ లో రూమ్ నెంబర్ 401 మరియు 402 బుక్ చేశాను. స్టైలిస్టులు డైరక్ట్ గా అక్కడకు వస్తారు…. పెళ్లి అయ్యే వరకు అక్కడే ఉంటారు… మీరు మధ్యలో డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా వాళ్ళు అక్కడే ఉండి హెల్ప్ చేస్తారు…” అంది.
ముగ్గురం నోరు తెరుచుకుని నిషాని చూస్తున్నాం.
నిషా “పదండి” అంది.
నలుగురం స్పీడ్ గా పెళ్ళికి బయలుదేరాం.