కాలేజ్ బాయ్ Part 21-Stopped 13

పిన్ని చెల్లెళ్ళు “చిన్నప్పుడు మేం ముగ్గురం, రష్ ఇంకా రష్ చెల్లెలు…. కేశవ్, ఈ క్రిష్ మొత్తం అందరం కలిసి పెరిగాం… క్రిష్ కి రష్ కి ఎప్పుడూ గొడవ అవుతూ ఉండేది…. హాస్పిటల్ లో… ఆ మూమెంట్ లో కూడా రష్, క్రిష్ ని కేశవ్ తో గొడవ పడ్డందుకు తిట్టేది, కొట్టేది”

స్క్రీన్ మీద అందరూ రష్ ని చూస్తూ ఉన్నారు, ఆమె ఒళ్లంతా చమటలు పోసి టెన్షన్ టెన్షన్ గా భయం భయంగా ఉంది, నాని ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. కాని కళ్ళు మూయకుండా క్రిష్ ఆ రౌడీలను కొట్టడం చూస్తూ ఉన్నాడు.

కింద పడ్డ వాళ్ళు పైకి లేవడంతో క్రిష్ మరో రౌండ్ మొదలు పెట్టాడు. రాడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. పది మంది ఉన్నాం అని మళ్ళి మళ్ళి వెళ్లి క్రిష్ చేతుల్లో దెబ్బలు తింటున్నారు. క్రిష్ అలవోకగా తన స్కిల్స్ తో కొడుతూనేఉన్నాడు.

నిషా “రాక్షసుడులా ఉన్నాడు, నువ్వు వాడి కోసం భయపడి, తిండి కూడా తినకుండా కూర్చున్నావ్…”

కేశవ్ “చిన్నప్పటి నుండి ఇద్దరం ఫైట్ చేసుకున్నా క్రిష్ ఓడిపోయే వాడు”

రామ్మోహన్ “వాడు ఎప్పుడూ ఓడిపోలేదు…”

కేశవ్ “వాట్…”

రామ్మోహన్ చూపు స్క్రీన్ పై ఉన్న రష్ మీద ఉంది.

కొద్ది సేపటిలోనే క్రిష్ అందరిని కొట్టి పడేశాడు. నాని (3yrs) పరిగెత్తుకుంటూ రాగానే క్రిష్ నానిని ఎత్తుకొని గట్టిగా హాగ్ చేసుకున్నాడు. అతని చిన్న చిన్న చేతులు క్రిష్ మెడ చుట్టూ వేసి కళ్ళు మూసుకొని గట్టిగా హత్తుకున్నాడు.

ఇద్దరూ కొద్ది సేపటి వరకు అలానే ఉన్నారు.

అంతలోనే ఆ షాప్ లోకి మరో ఇద్దరూ వచ్చారు.

అందులో ఒక కుర్రాడు “హేయ్.. ఎవరు రా నువ్వు…. నా గురించి తెలియకుండా నా మనుషుల మీద చేయి వేశావ్…..”

రామ్మోహన్ “సెక్యూరిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు”

కేశవ్ “దగ్గరలో ఉన్నాం అన్నారు.”

నానిని రష్ చేతికి ఇస్తూ, క్రిష్ వాళ్ళ ముందుకు వెళ్లి “నువ్వు ఎవడ్రా….”

అంటూ ఆ రౌడీల ముందుకు వెళ్లి నిలబడ్డాడు.

రష్ భయంగా వెళ్లి నానిని ఎత్తుకొని క్రిష్ వెనక నిలబడింది.

అంతలో ఒక స్పోర్ట్స్ కారు నుండి ఒక కుర్రాడు కిందకు దిగి “చూడు బ్రదర్….” అంటూ వచ్చి క్రిష్ భుజం మీద చేయి వేశాడు.

క్రిష్ వెనక ఉన్న రష్ కనపడింది, కాని క్రిష్ అతని చూపుకు అడ్డంగా నిలబడి “చెప్పూ రా..” అన్నాడు.

ఆ కుర్రాడు కోపంగా “రా….. రా….. నన్ను రా… అని పిలుస్తావా!” అని అరిచాడు.

క్రిష్ తన మీదకు అతని కోపం మొత్తం తిప్పేసుకున్నాడు.

ఆ కుర్రాడు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ “నిన్ను చంపేస్తాను… నిన్ను బ్రతకనివ్వను…. నేను ఎవరో తెలుసా… నేను అసలు ఎవరో తెలుసా… మా నాన్న ఎవరో తెలుసా!” అంటూ అరుస్తున్నాడు.

అందరికి ఆ కుర్రాడు ఎదో సైకోలాగా కనపడ్డాడు. అనుకోకుండానే భయం భయంగా క్రిష్ భుజం మీద చేయి వేసింది. కాని క్రిష్ ఆమె చేతిని తోసేశాడు.

క్రిష్ ఒక అడుగు ముందుకు వేసి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు.

ఆ కుర్రాడు కోపంగా “తెలుసా! మా నాన్న ఎవరో తెలుసా!” అంటూ ఉన్నాడు.

క్రిష్ ఫోన్ కనక్ట్ అయింది… క్రిష్ చాలా కోపంగా “మిస్టర్ ప్రభాకర్…. నేను క్రిష్ ని మాట్లాడుతున్నాను… నీ కొడుకు…. నా మనుషులను కిడ్నాప్ చేశాడు. నేను అడుగుతూ ఉంటే…. మా నాన్న ఎవరో తెలుసా! అంటున్నాడు…. నీ కొడుకుని… నువ్వు హ్యాండిల్ చేస్తావా! నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా!” అన్నాడు.

ఆ కుర్రాడు ఫోన్ మోగింది, కొద్ది సేపటికి అందరూ పైకి లేచి రష్ కి క్రిష్ కి ఇద్దరికీ సారీ చెప్పి వెళ్ళిపోయారు.

క్రిష్ కారులో రష్ వెళ్తూ ఉంది… క్రిష్ మాట్లాడడం లేదు. రష్ చూస్తూ ఉంది కాని అతని కళ్ళు కూడా ఏం చెప్పడం లేదు.

రష్ “క్రిష్….”

క్రిష్ “హుమ్మ్….”

రష్ “ఎలా ఉన్నావ్…”

క్రిష్ “ఎక్సామ్స్ అయిపోయాయి… జాబ్ వచ్చింది….”

రష్ “పే….”

క్రిష్ “వాళ్ళు ఇక నిన్ను ఏమి చేయరు… ప్రభు అంకుల్ మనుషులే వాళ్ళు కూడా…”

రష్ “హుమ్మ్”

క్రిష్ “ఇంకేమైనా చెప్పాలా…”

రష్ “పెళ్లి చేసుకున్నావ్ కదా…”

క్రిష్ “చాలా మంచి అమ్మాయి”

రష్ “హ్యాపీ మారీడ్ లైఫ్…” అంది.

క్రిష్ “థాంక్స్” అంటూ కారు ఆపి రష్ దిగాక, నిద్రపోతున్న నానిని ఒక సారి చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రష్, క్రిష్ ని పూర్తిగా వదిలేసింది. అతని మీద ప్రేమగాని ద్వేషంగాని లేదు… కేవలం తన హృదయంలో ఒక వెచ్చని అనుభూతి కలుగుతుంది.

మనసులో “నన్ను నేను చూసుకోవాలి…. నానిని నేను కాపాడుకోవాలి” అనుకుంటూ ఉంది.

రష్ ఇంటికి వెళ్ళాక, సందీప్ రష్ భుజం మీద చేయి వేసి కోపంగా అరుస్తాడు. ఆమె రేప్ కి గురి అయింది అని అనుకుంటున్నాడు.

రష్ సందీప్ ని చెంప దెబ్బ కొట్టి “ఒళ్ళు దగ్గర పెట్టుకో… కొజ్జా నా కొడకా…. నా మీద కానీ, నాని మీద కాని…… నీది కాని నీ లంజ మొగుడు ఇక్బాల్ గాని చేయి వేశారో…. తాట తీస్తా” అంటూ నానిని తీసుకొని వెళ్ళిపోయింది.

సందీప్ భయపడ్డాడు.

రష్ “నానిని ఆ రోజు మెట్ల మీద నుండి తోసింది ఎవరో కూడా నాకు తెలిసింది.. నిజం తెలిసింది”

సందీప్ “అదీ… అదీ… ”

రష్ “లెట్స్ హెట్ ఈచ్ అదర్… ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్…. హస్బెండ్” అంటూ నానిని తీసుకొని మెట్లు ఎక్కి వెళ్ళిపోయింది.

క్రిష్, కాజల్ ఇంటికి రాగానే ఆమె భుజం మీద వాలిపోయి “వైఫ్…. లెట్స్ లవ్ ఈచ్ అదర్… ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్” అంటూ ఆమెను హత్తుకున్నాడు.

5 Comments

Add a Comment
  1. I do not understand why this writer is posting this worst story continuing. There is no other Stories. Pl stop continuing.

  2. I just love this story… The narration is too good … Plz continue bro, don’t go head into the negative commenters of comments.

  3. Bro. I stopped so many stories in middle because there is over full romance without a story lines. But this I read everything from starting to now . I am expecting this u will continue it. Don’t stop this story until the actual ends come…. Waiting for the next continuation update…

  4. I just love this story so much. You nailed it. Don’t go head into the negative commenters of comments…. Continue this update bro …plz
    Waiting…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *