నిషా “అయితే, ఇలా మాట్లాడకూడదు…. అంటావ్…”
క్రిష్ “అవునూ…” తల ఊపాడు.
నిషా నవ్వేసి “సర్లే….”
క్రిష్ “నీ సంగతి ఏంటి? అంతా బాగానే ఉందా….”
నిషా “బాగా అంటే, ప్రాణాలతో ఉన్నాం… అటాక్స్ జరుగున్నాయి”
క్రిష్ “మీ అక్కకి చెప్పకు…. బాధ పడుతుంది”
నిషా “హుమ్మ్… త్వరలో మొత్తం క్లియర్ అవుతాయి… వైభవ్ నాకు ఒక గిఫ్ట్ ఇష్టా అన్నాడు”
క్రిష్ “ఓహ్… ఏం ఇస్తా అన్నాడు”
నిషా “గెస్ చెయ్….”
క్రిష్ “గోల్డ్, షేర్స్, బ్యాంకు బ్యాలెన్స్”
నిషా “అవన్నీ కాదు”
క్రిష్ “మరి….”
నిషా “ఒకమ్మాయిని సెలక్ట్ చేసుకున్నాం…”
క్రిష్ “వాట్….”
నిషా “మర్చి పోయావా… నాకు అబ్బాయితో పాటు అమ్మాయిలు అంటే కూడా ఇష్టమే….”
క్రిష్ తల పట్టుకొని “వైభవ్ కి చెప్పావా!”
నిషా “హుమ్మ్… ప్రాబ్లం వస్తే నువ్వు హెల్ప్ చేస్తా అన్నావ్….”
క్రిష్ “ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయే నీకూ…. ” అని షాక్ గా అడిగాడు.
నిషా “హహ్హాహ్హా” అని నవ్వింది.
క్రిష్ “సర్లే….. మీ అక్కకి ఇలాంటి ఐడియాలు ఇవ్వకు….”
నిషా నవ్వుతూనే ఫోన్ కట్టేసింది.
ముందు నుండి…. వెనక నుండి….
180. చాటింగ్
హరప్రీత్ ని ఒక వ్యక్తీ లాక్కొని వచ్చి మోకాళ్ళ దండ వేయించి అతని నుదిటి మీద గన్ పెట్టాడు.
హరప్రీత్ “సర్…. సర్…. వద్దు సర్….” అని బరతిమాలాడుతూ ఉన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ “నీకు నేను ఏం చెప్పాను….. క్రిష్ ఇక్కడకు వచ్చిన దగ్గర నుండి అతన్ని ఫాలో అవ్వమని చెప్పాను కదా….”
హరప్రీత్ “అవునూ సర్… ఫాలో అయ్యాను”
గన్ పట్టుకున్న వ్యక్తీ “మరి ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు”
హరప్రీత్ తల దించుకున్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ “చెప్పూ”
హరప్రీత్ “తెలియదు సర్… వాళ్ళు వెళ్ళిపోయారు”
గన్ పట్టుకున్న వ్యక్తీ “ఆ రోజు ఏమయింది?”
హరప్రీత్ నోటి నుండి మాటలు రాలేదు. అతని మొహం అంతా చమటలు పట్టేశాయి.
గన్ పట్టుకున్న వ్యక్తీ “వాళ్ళు పొద్దున్నే లేచి వేరే ఊరు వెళ్ళడం కోసం నీకు కాల్ చేశారు, తమరు మందు కొట్టి పడుకుని ఫోన్ ఎత్తక పోయే సరికి వేరే క్యాబ్ తీసుకొని వెళ్లిపోయారు, ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారో కూడా తెలియదు”
హరప్రీత్ “హిమాచల్ ప్రదేశ్”
గన్ పట్టుకున్న వ్యక్తీ “అక్కడ నుండి కూడా వెళ్ళిపోయారు… ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు”
హరప్రీత్ “సారీ… సర్…. సారీ… ”
గన్ పట్టుకున్న వ్యక్తీ “అరేయ్….. నీకు అసలు అర్ధం కావడం లేదు రా….. దీని వెనక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు…. మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకే….. పది లక్షలు ఇస్తాం అన్నారు”
హరప్రీత్ “అవునా… మరి నాకు లక్ష మాత్రమే ఇస్తా అన్నావ్”
గన్ పట్టుకున్న వ్యక్తీ, హరప్రీత్ మొహం మీద కొట్టి “పని చేయలేదు కదా….”
హరప్రీత్ మొహం రెండూ చేతులతో పట్టుకొని ముక్కు నుండి వస్తున్నా రక్తాన్ని రుద్దుకుంటూ ఉన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ యొక్క ఫోన్ మోగింది.
అతను ఫోన్ మాట్లాడుతూనే “అలాగే మేడం… అలాగే…. ఓకే…” అంటూ ఉన్నాడు.
అవతల ఒక అమ్మాయి నగ్నంగా కూర్చొని యోగా చేసుకుంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంది.
హరప్రీత్ ఎలా వినాలని అనుకున్నా…. అవతల ఎవరో అర్ధం కాలేదు, ముందుకు వంగి మరీ ఫోన్ వినాలని అనుకున్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ వెనక్కి తిరిగి హరప్రీత్ ని చూసే సరికి వేరే వైపు చూస్తున్నట్టు కవర్ చేసుకుంటూ ఈల వేసుకుంటూ ఉన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ, హరప్రీత్ చేసిన పని అర్ధం అయినా ఫోన్ లో “హా….. హా….. సరే మేడం” అంటూ మాట్లాడుతూ హరప్రీత్ ని చూసి పళ్ళు నూరుకుంటూ ఉన్నాడు.
హరప్రీత్ వేరే వైపు తిరిగినా ఒక కన్ను ఒక చెవి తన బాస్ మీద వేసి ఉంచాడు కాని విషయం తెలియడం లేదు. ఒక విషయం కన్ఫర్మ్, తన ప్రాణాలు సేఫ్…. ప్రస్తుతం క్రిష్ ఆచూకీ చెబితే ఇంకా చాలా డబ్బులు వస్తాయి.
గన్ పట్టుకున్న వ్యక్తీ, ఫోన్ కట్టేసి హరప్రీత్ దగ్గరకు వచ్చి ఎదో మాట్లాడబోయెంతలో, హరప్రీత్ “అయిదు లక్షలు….” అన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ “ఏంటి?”
హరప్రీత్ “అయిదు లక్షలు…. ఇస్తే క్రిష్ ఆచూకి కనుక్కుంటా….” అన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ పళ్ళు నూరి “సరే చెప్పూ…”
హరప్రీత్ చేయి జాపి “డబ్బులు” అన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ కోపంగా గన్ చూపిస్తూ “ఒళ్ళు బలిసిందా….”
హరప్రీత్ “సరే… నో డీల్…. గుడ్ బాయ్….” అని వెనక్కి తిరిగాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ కంగారుగా “అరె….. హరప్రీత్ భాయ్…. ఎందుకు అంత కోపం…. నువ్వు కనుక్కో…. నీ డబ్బు నీకు పంపిస్తా…. నన్ను నమ్ము… నన్ను నమ్మవా…..”
హరప్రీత్ చేయి చూపిస్తూ “నిన్నూ….”
గన్ పట్టుకున్న వ్యక్తీ “హుమ్మ్..”