కాలేజ్ బాయ్ Part 24 Like

లావణ్య, హరప్రీత్ ని చూసి “ఎందుకో…. మా బాస్ ది అయిపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాం”

హరప్రీత్ చేతిలో ఉన్న కార్ కీస్ కింద పడిపోయాయి. గుటకలు మింగుతూ ఆ కార్ కీస్ తీసుకొని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు.

లావణ్య మనసులో హరప్రీత్ తనను మిస్ అవుతున్నందుకే అలా బిహేవ్ చేశాడు అనుకుంటూ మురిసిపోతుంది.

మరో వైపు లోపల క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ హాగ్ చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు.

ఇంతలో బిలియర్డ్స్ క్లబ్ లోకి కొంత మంది ఆకతాయి కుర్రాళ్ళు వచ్చారు. హరప్రీత్ వాళ్ళను చూస్తూ గొడవ జరుగుతుంది ఏమో అని గుటకలు మింగాడు.

అనుకుంటూ ఉండగానే వాళ్ళు లోపలకు వస్తూనే క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ హాగ్ చేసుకోవడం చూశారు.

రౌడీ 1 “క్యా పీస్ హై…. భాయ్…..”

రౌడీ 2 “బాల్స్ భలే గుండ్రంగా ఉన్నాయ్…..”

రౌడీ 3 “అలా కాదు రా….. ఈ కర్ర తీసుకొని ఇలా బొక్కలో పడేలా తొయ్యాలి”

అంటూ నవ్వుకుంటూ ఉన్నారు.

క్రిష్ ఆ పూట మొత్తానికి ఎవరూ రాకుండా బుక్ చేసుకున్నాడు కానీ

క్రిష్ కోపంగా వాళ్ళ మీదకు వెళ్ళబోతే, కాజల్ క్రిష్ ని తోసుకొని బయటకు తీసుకొని వెళ్ళిపోయింది.

వాళ్ళలో లీడర్ లా ఉన్నాడు, చూడడానికి వాళ్ళ కంటే చిన్నగా అనిపించినా అందరూ అతని మాటే వినేట్టు ఉన్నారు.

లీడర్ “రేటు ఎంతో చెబితే మేము కూడా ఇస్తాం కదా…..” అంటూ నవ్వాడు.

కాజల్ ని వదిలి పెట్టి క్రిష్ డైరక్ట్ గా పరిగెత్తుకు వచ్చి గాల్లోకి ఎగిరి ఆ లీడర్ ని చాతీ మీద కొట్టాడు.

చుట్టూ ఉన్న వాళ్ళ అందరికి క్రిష్ చేసిన పని షాక్ గా అనిపించింది. అందరూ రియాక్ట్ అయ్యే లోపే…..

హరప్రీత్ వేగంగా వచ్చి క్రిష్ మరియు కాజల్ ని తీసుకొని వెళ్లి కార్ ఎక్కేసాడు. లావణ్య అందరి కంటే ముందుగానే ఎక్కేసింది.

వేగంగా అక్కడ నుండి వెళ్ళిపోయారు, హరప్రీత్ కంగారుగా “ఏంటి? సర్ అలా కొట్టేశారు… ఆ కుర్రాడి పేరు మాథ్యూస్…. వాళ్ళ అన్న… మీ లాగే పెద్ద ధనవంతుడు… కాకపోతే డబ్బు అంతా, గలీజ్ పనులు చేసి సంపాదించాడు… పెద్ద రౌడీ….” అన్నాడు.

లావణ్య కంగారుగా హరప్రీత్ చెప్పేది వింటూ ఉంది.

కాజల్ మాత్రం క్రిష్ ని గిచ్చుతూ ఎందుకు ఇలా చేశావ్ అంటూ చూస్తూ ఉంది.

క్రిష్ “మైకేల్ తమ్ముడా వాడు…..” అన్నాడు.

హరప్రీత్ వెనక్కి తిరిగి చూసి “మీకు మైకేల్ తెలుసా….” అని అడిగాడు.

క్రిష్ చిన్నగా నవ్వి తల ఊపాడు.

నలుగురూ రెస్టారెంట్ లో ఉన్నారు. క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ ఒక ప్రేవేట్ టేబుల్ దగ్గర ఉంటే, మరో ప్లేస్ లో లావణ్య మరియు హరప్రీత్ కూర్చొని ఉన్నారు.

కాజల్ కి నిషా పెట్టిన మెసేజ్ గుర్తుకు వచ్చింది “క్రిష్ మనకు తన ఫ్లాష్ బ్యాక్స్ ఇంకా ఒకటి చెప్పాల్సి ఉంది. మొత్తం నలుగురులో ముగ్గురు గురించి మాత్రమే మనకు తెలుసు….. ఆ ఒక్కరి సంగతి కూడా తెలుసుకో….” అని పెట్టిన మెసేజ్ గుర్తుకు వచ్చింది.

ప్రేమ మత్తులో మునిగిపోయిన తనకు క్రిష్ గురించి పూర్తిగా తెలుసుకోలేదు అనిపించింది.

కాజల్ “క్రిష్….”

క్రిష్ “హుమ్మ్….”

కాజల్ “నిన్నొకటి అడిగేదా….”

క్రిష్ “అడుగు…”

కాజల్ “లావణ్య బాగుంటుంది కదా…”

క్రిష్ వెనక్కి తిరిగి చూసి “హుమ్మ్, బాగానే ఉంటుంది”

కాజల్ “తనని పెళ్లి చేసుకుంటావా!”

క్రిష్ చిన్నగా నవ్వి కాజల్ మేడలో ఉన్న తాళిబొట్టును చూపించాడు.

కాజల్ “తనని రెండో పెళ్లి చేసుకుంటావా!”

క్రిష్ “నో….”

కాజల్ “ఎందుకని…. నేను ఒప్పుకుంటున్నా కదా….”

క్రిష్ “నో….” అని మరో వైపు తిరిగాడు.

కాజల్ క్రిష్ ముందుకు వచ్చి నిలబడి “మిస్టర్ ప్రభు తన ఆస్తిని నీకు రాసి ఇస్తున్నాడు కదా… నీకు వారసులు లేక పొతే ఎలా….”

క్రిష్ నవ్వేసి “ఎవరికీ రాసి ఇస్తున్నాడు…..”

కాజల్ “నీకే….”

క్రిష్ “ఎప్పుడూ….”

కాజల్ “అదేంటి?”

క్రిష్ “ఓహ్…. ఓకే….. అలా అనుకోవద్దు…. దీనికి పెద్ద సెట్ అప్ ఉంది”

కాజల్ “ఏంటది?”

క్రిష్ “మిస్టర్ ప్రభుని నేను నాలుగు సంవత్సరాలు క్రితం కలిశాను, అప్పటి నుండి బిజినెస్ లోకి వచ్చేశాను. మా నాన్న అమ్మిన పొలం తాలుకా నా వాటతో స్టార్ట్ చేశాను. మొదట్లో పొదుపుగా జాగ్రత్తగా బిజినెస్ చేసినా, రష్ నా జీవితంలోకి ఎంటర్ అయ్యాక సీరియస్ అవ్వాల్సిన అవసరం వచ్చేసింది. అపుడే ఫుల్ గా దిగిపోయాను”

కాజల్ “షేర్ మార్కెట్”

క్రిష్ “అండ్ ఫైనాన్స్…..”

కాజల్ “ఓహ్…”

క్రిష్ “అండ్ ఇన్వెస్ట్మెంట్స్…..”

కాజల్ “హా…!”

క్రిష్ “ప్రభు గారి కింద చాలా కంపనీలు ఉన్నాయి. అవన్నీ ఫంక్షన్ చేస్తూ తనకు ఒక వారసుడు ఉన్నాడు పేరు నూతన్…. నాకు నూతన్ సపోర్ట్ ఉండడంతో నా బిజినెస్ వేగం మరింత పుంజుకుంది. కస్టమర్లకు సజిషన్స్ ఇస్తూ కమీషన్ లతో నెల వారి లాభం, నా అంతట నేను ఇన్వెస్ట్ చేస్తూ మరో రకమైన లాభంతో ఉన్నాను…. అయితే…”

కాజల్ “హుమ్మ్…. అయితే….”

క్రిష్ “మిస్టర్ నూతన్ కొన్ని తప్పులు చేసి ….”

కాజల్ “వెయిట్…. నువువ్ భయ్యా అని పిలుస్తావు”

క్రిష్ “హుమ్మ్ అతనే….”

కాజల్ “కంటిన్యూ…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *